చంద్రబాబు విషయం విని షాకయ్యా: 'అధినాయకుడు' నిర్మాత
అవి రూమర్స్...అటువంటివి మేమంతా షాకయ్యాం. నా స్నేహితులు కి చెందిన ప్రొడక్షన్ హౌస్ వాళ్లు నాకు సపోర్టుగా నిలిచి, సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. అంతేగాని ఈ చిత్రం తెలుగు దేశం పార్టీకి కానీ, వారి లీడర్ చంద్రబాబుకి గానీ ఏ విధమైన సంబంధం లేదు అని క్లారిఫై చేసారు నిర్మాత ఎం ఎల్ కుమార్ చౌదరి. ఆయన తాజా చిత్రం 'అధినాయకుడు'కి ఆర్దిక కారణాలు రావటంతో ల్యాబ్ లో ఆగిపోతే చంద్రబాబు సహాయం చేసాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించారు.
"అలాగే మేము వైయస్ జగన్ పై పొలిటికల్ సెటైర్స్ కలపటం కోసం కొన్ని సీన్స్ రీషూట్ చేసామని చెప్పుకుంటున్నారు. అది నిజం కాదు. ఎందుకంటే ఒకసారి సెన్సార్ పూర్తి అయ్యాక...అలాంటివి చేద్దామని భావించినా కుదరని పని" అని తేల్చి చెప్పారు. ఇక ''కొన్ని కారణాలవల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. ఇంత జాప్యం జరిగినా.... ఏనాడూ బాలయ్యబాబు నన్ను కారణం అడగలేదు. ఇకపై ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటాను. మహానటుడు ఎన్టీఆర్ జయంతి రోజున మా చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుక జరగడం ఆనందంగా ఉంది'' అని చౌదరి చెప్పుకొచ్చారు.
నందమూరి బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు' చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్దమైంది. నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మించిన ఈ చిత్రాన్ని పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని వాల్యూల్యాబ్స్ అధినేతలు కైవశం చేసుకున్నారు. బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో జయసుధ, లక్ష్మీరాయ్, సలోని, సుకన్య హీరోయిన్స్ . కీర్తి కంబైన్స్ పతాకంపై ఎంఎల్ కుమార్‌చౌదరి ఈ సినిమాను నిర్మించారు.
దర్శకుడు పరుచూరి మురళి మాట్లాడుతూ...'సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాము. ఆలస్యం అయినా కథలో బలం ఉంది. బాలకృష్ణ చేసిన మూడు పాత్రలు హైలైట్‌గా నిలుస్తాయి. ముఖ్యంగా పెద్దతరం పాత్ర ఎన్.టి.ఆర్.ను గుర్తుచేస్తుంది. చాలా పవర్‌ఫుల్‌పాత్ర. జయసుధ యాక్షన్ ప్రత్యేకంగా ఉంటుంది. పాటలన్నీ బాగున్నాయి. జూన్ 1న విడుదల అయ్యే మా చిత్రం బాలయ్య చిత్రాల్లో రికార్డ్ బద్దలుకొడుతుందనే నమ్మకముంది' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











