మౌనవ్రతంలో సంగీత దర్శకుడు కీరవాణి
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రస్తుతం మౌనవ్రతంలో ఉన్నారు. ఆయన నిన్న(శనివారం) కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. మౌనవ్రతంలో ఉన్న ఆయన, స్వామివారికి పూజలు చేయించి, గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం తులసితీర్థం, ప్రసాదాలు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియావారికి తాను మౌనవత్రంలో ఉన్నానంటూ కాగితంపై రాసి చూపించి వెళ్లిపోయారు. ఆయన ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో రానున్న ఎస్ పి బాలసుబ్రమణ్యం అనే చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన సంగీతం అందించిన మగధీర చిత్రం మ్యూజిక్ పరంగానూ రికార్డులు సష్టించిన సంగతి తెలిసిందే.
కీరవాణి మగధీర రాజమౌళి రామచరణ్ తేజ కర్నూలు రాఘవేంద్ర స్వామి ఎస్ పి బాలసుబ్రమణ్యం మౌనవ్రతం keeravani karnool raghavendra swamy maghadheera sp balasubramanyam rajamouli ramcharan teja


Click it and Unblock the Notifications