»   »  ధోని మూవీ ఫీవర్: గల్లి గల్లీలో ధోనీయే, ఆడియో వేడుకకు రాజమౌళి? ( సాంగ్ వీడియో)

ధోని మూవీ ఫీవర్: గల్లి గల్లీలో ధోనీయే, ఆడియో వేడుకకు రాజమౌళి? ( సాంగ్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని జీవితంపై త్వరలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 'ఎంఎస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈచిత్రంలో కోసం దేశంలోని క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఒక క్రికెటర్ జీవితంపై సినిమా రావడం... అది అతని రిటైర్మెంటుకు ముందే రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి. ధోని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రలో మామూలు మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇద్ద పెద్ద క్రికెట్ స్టార్ గా ఎదగడం వెనక చాలా విషయాలు ఉన్నాయి.

అవన్నీ సినిమాలో చూపించబోతున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీషులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా వేలాది థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 30న

సెప్టెంబర్ 30న

ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది. 80 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే మంచి శాటిలైట్ రైట్స్ ని సంపాదించుకుంది. సినిమాను సాధ్య‌మైనంత స‌హ‌జంగా తీసేందుకు కొన్ని రియ‌ల్ లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించారు.

 తెలుగులో ఆడియో వేడుక?

తెలుగులో ఆడియో వేడుక?

ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉండగా యూనిట్ కూడా వెరైటీ ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో హైప్ తెస్తుంది. ఈ నెల 24న తెలుగులో ఈ చిత్రానికి సంబంధించి ఆడియో వేడుక జరగిగే అవకాశం ఉందని అంటున్నారు.

 రాజమౌళి చీఫ్ గెస్ట్

రాజమౌళి చీఫ్ గెస్ట్

ఈ ఆడియో లాంఛ్ కి టీమిండియా వన్డే కెప్టెన్ ధోని చీఫ్ గెస్ట్ గా హాజరు కానుండగా, దర్శక ధీరుడు రాజమౌళి కూడా స్పెషల్ గెస్ట్ గా హాజరు అవుతారని సమాచారం. అయితే ఇప్పటి వరకైతే దీని గురించి ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు.

rn

ప్రతి గల్లి గలిలో ధోనీయే-వీడియో

తాజాగా ఎమ్మెస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాకు సంబంధించి వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ప్రతి గల్లీలో ధోని అంటూ సాగే ఈ పాటని ఎస్పీ బి చరణ్, చైతన్య ప్రసాద్ ఆలపించగా ఈ వీడియో అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. మరి ఈ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

 ధోని అంత చార్జ్ చేసాడా?

ధోని అంత చార్జ్ చేసాడా?

కాగా... తన జీవిత కథను సినిమాగా తీసినందుకు ధోనీ రూ. 60 కోట్ల వరకు చార్జ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో ధోనీ చార్జ్ చేయడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ మొత్తం ఆయనకు ముందే చెల్లించారా? లేక సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల నుండి ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

 హీరో, డైరెక్టర్

హీరో, డైరెక్టర్

సుషాంత్‌ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నీరజ్‌ పాండే డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే అనూహ్య స్పందన వచ్చింది.

 ధోనీ భార్య పాత్రలో

ధోనీ భార్య పాత్రలో

ఈ సినిమాలో ధోనీ భార్య పాత్రలో కైరా అడ్వాణీ నటించారు.

 అందరిలోనూ ఆసక్తి

అందరిలోనూ ఆసక్తి

ధోని చిన్న తనం నుండి ఆయన దేశం గర్వించదగ్గ క్రికెటర్ గా ఎదిగే వరకు అతని జీవితంలో చోటు చేసుకున్న అన్ని ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై క్రికెట్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

English summary
T-Series Telugu presents Prathi Galli Lo Dhoni Yee Video Song from latest Telugu movie M.S.Dhoni - The Untold Story starring Sushant Singh Rajput,Kiara Advani,Anupam Kher,Bhoomika Chawla,Herry Tangiri,Gautam Gulati. Music composed by Rochak Kohli while lyrics are penned by Chaitanya Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu