వావ్..గ్రేట్ : తెలుగు కమిడియన్ ..గిన్నిస్ రికార్డు

By Srikanya

హైదరాబాద్ : మన తెలుగు తెరపై తాగుబోతు పాత్రలంటే ముందు గుర్తొచ్చే పేరు ఎమ్మెస్ నారాయణ పేరే. ఇప్పుడంటే తాగుబోతు రమేష్ వచ్చాడు కానీ ఇంతకుముందు తాగుబోతు పాత్ర అంటే ఎమ్మెస్ ని గుర్తు చేసుకోవాల్సిందే. తనదైన కొత్త తరహా మేనరిజమ్‌తో ఈ తరహా పాత్రలకు ఆయనకు ఆయనే సాటి. కృష్ణంరాజు, శ్రీకాంత్ నటించిన మా నాన్నకి పెళ్లి చిత్రంతో నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభించి 17 ఏళ్లవుతోంది. ఈ ప్రయాణంలో 700ల చిత్రాల్ని పూర్తి చేసిన నటుడిగా త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కబోతున్నారు ఎమ్మెస్ నారాయణ.

ఎంఎస్ నారాయణ మాట్లాడుతూ... అతి తక్కువ కాలంలో 700 సినిమాల్లో నటించిన నటుడ్ని తానేనని చెప్పారు. ఈదిశగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో పేరు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ సినీ రచయిత అవుదామని 1994లో హైదరాబాద్ వెళ్లాను. 1997లో నటుడిగా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను. ప్రస్తుతం 'గోవిందుడు అందరి వాడే'తో పాటు 15 సినిమాల్లో నటిస్తున్నా. దూకుడు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పారు.

M.S. Narayana on his way to Guinness Book

ఇక మాజీ ఎంపీ మెంటే పద్మనాభం సహకారంతోనే సినీ రంగంలోకి ప్రవేశించా. ఆయనే నాకు గాడ్‌ఫాదర్. హాస్యనటులు మల్లికార్జునరావు, ఏవీఎస్, శ్రీహరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇటీవల మరణించడం నాన్నెంతగానో బాధించింది. వారు లేని లోటు చిత్రసీమకు తీర్చలేనిది. హైదరాబాద్‌లో తెలుగు సినిమా వాళ్లకు ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి.

అలాగే... సినిమాల్లో ఎక్కువగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల మాండలికాన్ని వాడుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మాండలికంలో కూడా సినిమాలు రావచ్చు. ఎందుకంటే సినీ రంగానికి నైజాం ప్రాంతం నుంచే 50 శాతం ఆదాయం వస్తోంది. తెలంగాణ ఆర్టిస్టులతోనే పూర్తిస్థాయిలో సినిమాలు తీసే పరిస్థితి లేకపోలేదు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినీ షూటింగ్‌లకు సరిపడా మౌలిక వసతులు ఉన్నాయి. ఈదిశగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది.' అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X