twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త తరహా ప్రేమకథతో వస్తున్నా: ఎమ్.ఎస్.రాజు

    By Srikanya
    |

    'కొత్త తరహా ప్రేమకథతో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. వినోదం, భావోద్వేగాల సమ్మేళనంగా సినిమా ఉంటుంది. అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది' అంటున్నారు ఎమ్.ఎస్ రాజు. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం తూనీగ తూనీగ. ఎమ్మెస్‌రాజు ఈ చిత్రానికి దర్శకుడు. మాగంటి రామ్‌చంద్రన్(రామ్‌గీ) నిర్మాత. దిల్ రాజు సమర్పకుడు. రియా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విశేషాలను ఆయన మీడియాతో ఇలా పంచుకున్నారు.

    ఇక చిత్రం ప్రోగ్రెస్‌ని నిర్మాత మాగంటి రామ్‌చంద్రన్ వివరిస్తూ 'ఇటీవల వారం రోజుల పాటు సంఘీ టెంపుల్‌లో చిత్రీకరించిన పతాక సన్నివేశాలతో షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నెల్లోనే ఆడియోను, జూన్‌లో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు. అలాగే తాతగారైన మాగంటి రవీంద్రనాథ్‌చౌదరి, ఈవీవీ సత్యనారాయణ ఆశీస్సులతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టానని, సుమంత్ సింగిల్‌టేక్ ఆర్టిస్ట్ అని నిర్మాత ప్రశంసించారు.

    ఇక ఎమ్.ఎస్ రాజు గతంలో నిర్మించిన సూపర్ హిట్ చిత్రం 'మనసంతా నువ్వే'లోని 'తూనీగ... తూనీగ, ఎందాక పరిగెడతావె' పాటలోని పదాలుతో ఈ టైటిల్ ని సెంటిమెంట్ గా పెట్టారు. ఇక ఈ చిత్రం షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది. ఫెరఫెక్షన్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఎమ్ ఎస్ రాజు తన కుమారుడు చిత్రాన్ని శిల్పం చెక్కినట్లు చెక్కుతున్నారని వినికిడి. అలాగే తమ బ్యానర్ లో వర్షం,మనసంతా నువ్వే,నువ్వొస్తానంటే నే వద్దంటానా వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చి ఉండటంతో ఈ సినిమా కూడా మంచి లవ్ స్టోరీ అని అంచనాలు ఉన్నారు. ఇక ఎమ్ ఎస్ రాజు వాన చిత్రంతో డైరక్టర్ గా మారారు. ఆయన రెండో చిత్రం ఇది.

    English summary
    
 MS Raju’s son Sumanth Ashwin is making his debut as hero under his father’s direction with 'Tuneega Tuneega' movie. The friendship between both the Raju's motivated Dil Raju to present this movie. Maganti Ramji is producing this film on Padmini arts banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X