For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    'యమ్‌6' చిత్రం అందర్నీ అలరిస్తుంది.. ఫిబ్రవరి 8న రిలీజ్

    |

    విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై విశ్వనాథ్‌ తన్నీరు నిర్మించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'యమ్‌6'. ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు మాట్లాడుతూ ''నటుడిగా అవ్వాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో కొన్ని టీవీ సీరియల్స్‌లో నటించటంతో పాటు, కొన్ని సీరియల్స్‌ నిర్మించాను కూడా. అలాగే కొన్ని చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేశాను.

    M6 movie set to release on Feb 8th

    ప్రస్తుతం నిర్మాతగా నూతన నటీనటులు ధ్రువ, అశ్విని (మిస్‌ బెంగుళూరు), నూతన దర్శకుడిని సినీ రంగానికి పరిచయం చేస్తూ 'యమ్‌ 6' సినిమా నిర్మించాను. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నాం. ఇదొక హారర్‌, కామెడీ, థ్రిల్లర్‌. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. దర్శకుడు జైరాం వర్మ చెప్పిన ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ నచ్చి ఈ సినిమా నిర్మించాను. ఈ చిత్రానికి కథే హీరో. అందరికీ నచ్చే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇలాంటి సినిమాకి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా ఇంపార్టెంట్‌. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి ఆర్‌ఆర్‌ బాగా కుదిరింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఎక్కడా బోర్‌ ఫీల్‌ అవ్వరు. ఉత్కంఠకు గురి అవుతారు. అనుకోకుండా వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. నటీనటులు కొత్తవాళ్ళైనా బాగా నటించారు. ఈ సినిమా లోని 'ఈ క్షణం' అనే మెలోడియస్‌ పాటను అరకు , మంగుళూరులోని సుందరమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం.

    M6 movie set to release on Feb 8th

    'యమ్‌6' అనే డిఫరెంట్‌ టైటిల్‌ ఎందుకు పెట్టామో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. నా అభిమాన దర్శకులు వి.వి.వినాయక్‌గారు మా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మా సినిమాను ప్రేక్షక దేవుళ్ళు విజయంతో ఆదరిస్తారనే ఆశిస్తున్నాను. ఇలాంటి చిన్న చిత్రాలని ఆదరిస్తే మాలాంటి కొత్త నిర్మాతలు మరిన్ని చిత్రాలు నిర్మించటానికి వీలుంటుంది. నా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. ఆ వివరాలను త్వరలో తెలియజేస్తాం అన్నారు.

    M6 movie set to release on Feb 8th

    ధ్రువ , శ్రావణి , అశ్విని , తిలక్‌ , సాధన ,అప్పలరాజు , హరిత , వంశీ , ఇంద్రతేజ నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : సురేష్‌ , సంగీతం : విజయ్‌ బాలాజీ , సినిమాటోగ్రఫీ : మహ్మద్‌ రియాజ్‌ , కాస్టింగ్‌ . స్టార్‌ యాక్టింగ్‌ స్టూడియో .ఎడిటింగ్‌ : వంశీ కందాల . పబ్లిసిటీ డిజైన్‌ . టాకింగ్‌ పిక్చర్స్‌ స్టూడియో సోమేశ్వర్‌ పోచం , నిర్మాత : విశ్వనాధ్‌ తన్నీరు , కధ , స్క్రీన్‌ ప్లే , దర్శకత్వం : జైరామ్‌ వర్మ

    English summary
    M6 movie is directed by VishwanathTanneeru. Dhruva is the hero for the movie. This movie trailer was launched by Director VV Vinayak. This movie set to release on Feb 8th.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more