OTT భారీ హిట్టైన మూవీకి సీక్వెల్.. కానీ ఓటీటీలో కాకుండా థియేట్రికల్ రిలీజ్..రికార్డు ధరకు రైట్స్!

వినోద రంగంలో ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతున్నది. ఓటీటీలకు ప్రేక్షకులు చేరువైన నేపథ్యంలో నిర్మాతలకు ఆదాయాన్ని ఎక్కువగా ఓటీటీ సంస్థలే ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీలో సంచలన విజయం సాధించడమే కాకుండా, క్రిటిక్స్ ప్రశంసలు అందుకొన్న చిత్రంగా మా ఊరి పొలిమేర నిలిచింది. సెన్సేషనల్ హిట్‌ను సొంతం చేసుకొన్న ఈ సినిమాకు సీక్వెల్‌గా మా ఊరి పొలిమేర 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ ఉండటంతో ఓటీటీలో కాకుండా థియేట్రికల్ రిలీజ్‌కు నిర్మాతలు సిద్దమయ్యారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో యూనిట్ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళితే..

మా ఊరి పొలిమేర పార్ట్ 1 ప్రస్తుతం డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. హాట్ స్టార్‌లో ఈ సినిమాకు రికార్డు వ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలో రిలీజ్ అవుతున్న మా ఊరి పొలిమేర 2 సినిమాకు మంచి క్రేజ్్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాను నవంబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్రం యూనిట్ వెల్లడించింది.

Ma Oori Polimera 2 Theatrical rights and business for Fancy price

మా ఊరి పొలిమేర 2 సినిమాకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని.. ప్రముఖ డిస్టిబ్యూటర్ వంశీ నందిపాటి ఈ సినిమా హక్కులను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేశారు. శ్రీకృష్ణ క్రియేషన్ బ్యానర్‌పై గౌరు సమర్పించగా, గౌరికృష్ణ నిర్మించారు. ఈ మూవీకి డాక్టర్ అనిల్ విశ్వ‌నాథ్ దర్శకత్వం వహించారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ.. మా ఊరి పొలిమేర పార్ట్ 1 ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా రెండో పార్టుపై భారీ అంచనాలు పెరిగాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించాం. న‌వంబ‌ర్‌ 3వ తేదీన మా చిత్రాన్ని థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్ అని అన్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమాలో ప్రతీ సన్నివేశం ఉత్కంఠ భరితంగా, ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. తదుపరి సీన్ ఎలా ఉంటుందనే ఉత్సుకత ఉంటుంది. ఈ సినిమాను పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్‌తో పలు ప్రాంతాల్లో షూట్ చేశాం. సత్యం రాజేశ్, కామాక్షి అద్బుతంగా నటించారు అని దర్శకుడు అనిల్ విశ్వనాథ్ అన్నారు.

Ma Oori Polimera 2 Theatrical rights and business for Fancy price

నటీనటులు: స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ తదితరులు

మ్యూజిక్: గ్యాని
సినిమాటోగ్ర‌ఫీ: ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి
ఎడిటింగ్: శ్రీ వ‌ర
ఆర్ట్ డైర‌క్ట‌ర్: ఉపేంద్ర రెడ్డి చందా
ఫైట్ మాస్ట‌ర్: రామ్ మాస్ట‌ర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఎన్‌సీ స‌తీష్ కుమార్
నిర్మాత: గౌరి కృష్ణ‌
స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్, దర్శకత్వం: డాక్టర్ అనిల్ విశ్వ‌నాథ్‌
రిలీజ్ డేట్: 2023-11-03

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X