రాజశేఖర్ రాజీనామా.. ఆమోదించిన ‘మా’.. జీవిత తదుపరి కార్యాచరణ..?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) 2020 డైరీ ఆవిష్కరణ సందర్భంగా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ వార్తలు మీడియాలో ఎంతగా హల్‌చల్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేదికపై పరుచూరొ గోపాల కృష్ణ మాట్లాడుతూ ఉండగానే.. మధ్యలో మైక్ అందుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. దీని పై మా వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి సహా పెద్దలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అందరికీ తెలిసిందే.

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..

సభా మర్యాదలు పాటించకుండా, ‘మా' గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయడం, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రసాభాస చేసినందుకు గానూ రాజశేఖర్‌పై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా చిరంజీవి ఆదేశించిన సంగతె తెలిసిందే. కృష్ణంరాజు సైతం కో ఆర్డినేషన్ కమిటీని వెంటనే ఏర్పాటు చేస్తున్నామని, మా గురించి బహిరంగ వ్యాఖ్యలు చేసిన వారిపై యాక్షన్ తీసుకోవాలని సూచించాడు.

జీవిత క్షమాపణలు..

జీవిత క్షమాపణలు..

ఈ ఘటన అనంతరం వేదికపైకి వచ్చిన జీవిత సభకు, మా పెద్దలందరికీ క్షమాపణలు చెప్పింది. రాజశేఖర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వమని, ఆయన లోపల ఏది ఉంటే అదే మాట్లాడుతాడని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. మాలో విబేధాలున్నా కూడా అందరం కలిసి ముందుకు వెళ్తామని, కలిసి పని చేస్తామని చెప్పుకొచ్చింది.

 రాజశేఖర్ రాజీనామా..

రాజశేఖర్ రాజీనామా..

ఈ ఉదంతం అనంతరం రాజశేఖర్.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ ప్రకటన జారీ చేశాడు. దీంతో పాటు ఓ లేఖను కూడా విడుదల చేస్తూ.. కారణాలను వివరించాడు. నరేష్ వ్యవహారశైలి కారణంగానే తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపాడు. మా మెంబర్స్ నిర్ణయాలకు నరేష్ విలువ ఇవ్వడని, అతనిది ఏకపక్ష ధోరణి అంటూ ఆరోపణలు చేశాడు.

ఆమోదించిన మా..

ఆమోదించిన మా..

కాగా ఆదివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించిన ‘మా' రాజశేఖర్ రాజీనామాను ఆమోదించింది. దీంతో పాటు క్రమశిక్షణ చర్యల కోసం ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించింది. కృష్ణంరాజు చిరంజీవి మురళీమోహన్ మోహన్ బాబు జయసుధలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు 'మా' ప్రకటన విడుదల చేసింది.

జీవిత కార్యాచరణ..

జీవిత కార్యాచరణ..

మరి రాజీనామాను ఆమోదించి రాజశేఖర్‌ను మాకు దూరం పెట్టడంతో సరిపెడతారా.. లేక చిరు, కృష్ణం రాజు అన్నట్లు క్రమశిక్షణ చర్యల పేరుతో రాజశేఖర్ మీద సస్పెన్షన్ కూడా విధిస్తారా అన్నది చూడాలి. రాజశేఖర్ ‘మా'కు దూరమైన నేపథ్యంలో సంఘంలో ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో ఉన్న ఆయన భార్య జీవిత ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X