హీరోయిన్లకు డిసెంబర్ ‘డెడ్ లైన్’
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) లో సభ్యత్వం తీసుకోకుండా తెలుగు సినిమాల్లో కొనసాగుతున్న హీరోయిన్లపై 'మా" తీవ్రంగా స్పందించింది. డిసెంబర్ లోగా సభ్యత్వం తీసుకోని హీరోయిన్లపై నిషేదం విధించడం లేదా, వారిని బహిష్కరించి సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మా అధ్యక్షుడు మురళీ మోహన్ మంగళవారం మీడియా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ....గత నెల రోజుల క్రితమే సభ్యత్వం తీసుకోని వారికి నోటీసులు పంపామని, వారిలో కొందరు స్పందించగా, మరికొందరు తమ నోటీసులు ఖాతరు చేయ లేదని తెలిపారు. మరోసారి వారికి నోటీసులు పంపామని, డిసెంబర్ లోగా సభ్యత్వం తీసుకోనిచో....వారిపై కఠిన చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు.
బహుషా వారు షూటింగుల్లో బిజీగా ఉండటం వల్ల సభ్యత్వం తీసుకోలేదని మేము భావిస్తున్నాం, డిసెంబర్ లోగా సభ్యత్వం తీసుకుంటారనే నమ్మకం ఉందని తెలిపారు. అలా జరుగని పక్షంలో 'మా"నిర్ణయం కఠినంగా ఉంటుందని తేల్చి చెప్పారు. కాగా...సభ్యత్వం తీసుకోని హీరోయిన్లలో జెనీలియా పేరు ముందున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











