‘మా’లో విభేదాలు అవాస్తవం.. మీడియా వార్తల్లో నిజం లేదు..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలపై సంఘం కార్యవర్గం వివరణ ఇచ్చింది. మా యూనియన్‌లో ఎలాంటి విభేదాలు లేవని, మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పింది. హీరో రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధ్యక్షుడు వీకే నరేష్‌కు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్టు వార్తలు వెలుగు చూశాయి. అయితే ఆ వార్తపై మా ప్రతినిథులు స్పందిస్తూ..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కార్యవర్గంలో భేదాభిప్రాయాలు వచ్చాయని, అధ్యక్షుడు నరేశ్‌కి రాజశేఖర్ కార్యవర్గం నోటీసులు ఇవ్వబోతుందంటూ సోషల్ మీడియా, మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ఈ విషయం తెలిసిన మా కార్యనిర్వాహక వర్గం ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది.

ఓ అసోసియేషన్ అంటే.. చాలా సమస్యలుంటాయి. వాటన్నింటినీపై అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మా వెల్ఫేర్‌కి సంబంధించి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలు గురించి మంగళవారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించి మీడియాకు తెలియజేయాల్సిన వార్తలేవైనా ఉంటే అధికారికంగా మేమే తెలియజేస్తాంఅంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం తెలియజేసింది.
తాజాగా మా అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌కు మధ్య కొత్తగా అధిపత్య పోరాటం జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది. ఇటీవల 20 మంది మా సభ్యులతో రాజశేఖర్ అధ్యక్షతన సమావేశం జరగడం ఈ వివాదానికి బలం చేకూరిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. అలాగే నిధులు సేకరణ చేపట్టకపోగా.. పలు రకాలుగా నిధులను ఖర్చు చేస్తున్నారనేది మరో ఆరోపణ. ఈ నేపథ్యంలో వీకే నరేష్ వ్యవహారంపై 20 మందికిపైగా సభ్యులు సమావేశం కావడం గందరగోళానికి దారి తీసింది. దాంతో మా కార్యవర్గం స్పందించి వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











