For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రోడ్డున పడ్డ ‘మా’ విభేదాలు.. చిరంజీవిని ఇరుకున పెడుతున్నారా? నిజం నిగ్గుతేలుతుందా?

  By Rajababu
  |
  Do Chiranjeevi Needs To Clarity On MAA Issue??

  సినీ నటుల సంక్షేమం కోసం ఏర్పాటైన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) విభేదాలు మీడియాలో భగ్గుమన్నాయి. సోమవారం పోటాపోటీగా శివాజీరాజా వర్గం, నరేష్ మీడియా సమావేశాలను నిర్వహించడంతో ఫిలింనగర్ వాతావరణం వేడెక్కింది. మీడియాలో పరస్పర ఆరోపణలు చేసుకోవడంపై అంతటా చర్చనీయాంశమైంది. మా సిల్వర్ జూబ్లీ వేడుకల నిధుల వ్యవహారం మా సంస్థ రెండుగా చీలిపోయింది.

  2 కోట్లు అని చెప్పి

  2 కోట్లు అని చెప్పి

  అమెరికాలో మెగాస్టార్ చిరంజీవితో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముందుగా రూ.2 కోట్లు వస్తాయని ముందుగా చెప్పినట్టు నరేష్ తాజాగా వెల్లడించారు. కానీ తీరా చూస్తే రూ.1 కోటి రూపాయలు మాత్రమే వచ్చాయని చూపించారు అని ఆయన పేర్కొన్నారు.

  హైదరాబాద్‌లో రూ.5 కోట్లు వచ్చేవి

  హైదరాబాద్‌లో రూ.5 కోట్లు వచ్చేవి

  అమెరికాలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా సభ్యులు బిజినెస్ క్లాస్‌లో వెళ్లడం ఎంతవరకు సబబు అని నరేష్ ప్రశ్నించారు. ఎవరి సొమ్ముని విలాసాలకు వాడుకొన్నారని ఘాటుగా నిలదీశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను అమెరికాలో కాకుండా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే రూ.5 కోట్లు వచ్చేవి.. అంతకంటే ఎక్కువగా కూడా వచ్చే అవకాశం ఉండేదన్నారు.

  చిరంజీవి మద్దతు ఎవరికి

  చిరంజీవి మద్దతు ఎవరికి

  సోమవారం ఉదయం శివాజీరాజా, శ్రీకాంత్, పరుచూరి గోపాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిరంజీవితో ఈ విషయాన్ని చర్చించాం. ఆ తర్వాతే మేము మీడియా ముందుకు వచ్చాం అని అన్నారు. ఈ మాటతో చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో అనే విషయం మరో వర్గంలో ఆసక్తిని రేపుతున్నది.

  చిరంజీవిని వివాదంలోకి

  చిరంజీవిని వివాదంలోకి

  శ్రీకాంత్, శివాజీరాజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెగాస్టార్‌ను వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు. చిరంజీవితో మాట్లాడిన తర్వాతే సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పడం చర్చనీయాంశమైంది. మెగాస్టార్ మద్దతు తీసుకొనే నరేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారా? అందరివాడిగా పేరున్న చిరంజీవి ఓ వర్గానికి మద్దతు తెలిపే అవకాశం ఉందా అనే ప్రశ్నలు లేస్తున్నాయి. ఇక ఈ వివాదంలో చిరంజీవి తలదూర్చితే మరింత దుమారం చెలరేగే అవకాశం లేకపోలేదు.

  నిధుల దుర్వినియోగం నిజమేనా

  నిధుల దుర్వినియోగం నిజమేనా

  మా అసోసియేషన్‌లో నిధుల అవకతవకలు జరిగాయని నరేష్ చేస్తున్న ఆరోపణలు తప్పు అని శివాజీరాజా గానీ, శ్రీకాంత్ గానీ ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదు? అనేది మరో ప్రశ్నగా మారింది. ఫ్యాక్ట్ ఫైండిగ్ కమిటీ ఏర్పాటు చేయాలన్న నరేష్ ప్రతిపాదనకు మరో వర్గం ఎందుకు ఒప్పుకోవడం లేదని మరో ప్రశ్నగా మారింది.

  నిజానిర్ధారణ కమిటీకి భయమేల?

  నిజానిర్ధారణ కమిటీకి భయమేల?

  మా నిధుల దుర్వినియోగం జరిగిందా? ఒకవేళ జరుగకపోతే నిజా నిర్ధారణ కమిటీ ఎందుకు వేయడం లేదు. నరేష్ చేస్తున్న ఆరోపణలకు శివాజీరాజా వర్గం ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ప్రధాన కార్యదర్శిని కాదని పలు కార్యక్రమాల నిర్వహణలో బెనర్జీని ఎందుకు రంగంపైకి తీసుకొచ్చారు అని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవకాశం శ్రీకాంత్ వర్గానికి ఉందనే మాట వినిపిస్తున్నది.

  సభ్యుల మధ్య రాజీకి మార్గాలు

  సభ్యుల మధ్య రాజీకి మార్గాలు

  శ్రీకాంత్, శివాజీ రాజా వర్గానికి, నరేష్ వర్గానికి రాజీ కుదిర్చే ప్రయత్నాలు ముమ్మరమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే విధంగా ఆరోపణలు కొనసాగితే కొందరికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని, అలాంటి ఛాన్స్‌ను తీసుకోకపోవడమే మంచిదనే అవగాహనకు వస్తున్నట్టు తెలిసింది.

  English summary
  The Movie Artists Association is facing a lot of unnecessary rumors in the recent times. The association is facing allegations regarding the funds utilized for organizing the events in the USA. Regarding this issue, MAA members said that there is no truth in the news. Naresh alllegations made this issue very serious note
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more