‘మా’లో తీవ్ర లుకలకలు.. అధ్యక్షుడు వీకే నరేష్‌పై రాజశేఖర్ వర్గం తిరుగుబాటు?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో మళ్లీ లుకలుకలు చోటుచేసుకొన్నాయనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏకంగా మా అధ్యక్షుడు వీకే నరేష్‌పై సభ్యులు తిరుగుబాటు బాహుటా ఎగురవేసినట్టు తెలిసింది. వీకే నరేష్‌కు వ్యతిరేకంగా షోకాజ్ నోటీస్ జారీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చిన వార్త టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నది. ఈ వివాదానికి కారణం ఏమిటంటే..

 ‘మా'లో గొడవలు

‘మా'లో గొడవలు

కొద్దికాలంగా మా యూనియన్‌లో గొడవలు చోటుచేసుకొంటున్నాయి. గతంలో శివాజీ రాజాకు, నరేష్‌కు మధ్య జరిగిన వివాదం సద్దుమణిగిందని అనుకొన్నారు. కానీ తాజాగా రాజశేఖర్, నరేష్‌కు మధ్య కొత్తగా అధిపత్య పోరాటం జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది. ఇటీవల 20 మంది మా సభ్యులతో రాజశేఖర్ అధ్యక్షతన సమావేశం జరగడం ఈ వివాదానికి బలం చేకూరిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

 వీకే నరేష్‌పై విమర్శలు

వీకే నరేష్‌పై విమర్శలు

మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వీకే నరేష్‌పై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. అలాగే నిధులు సేకరణ చేపట్టకపోగా.. పలు రకాలుగా నిధులను ఖర్చు చేస్తున్నారనేది మరో ఆరోపణ. ఈ నేపథ్యంలో వీకే నరేష్ వ్యవహారంపై 20 మందికిపైగా సభ్యులు సమావేశంపై తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది.

నిధుల దుర్వినియోగం

నిధుల దుర్వినియోగం

తెలంగాణ ప్రభుత్వానికి వ్యాపార ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగించిన రూ.750000 దుర్వినియోగమైనట్టు ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అయితే ఈ ఆరోపణపై ఎలాంటి సమాచారం బయటకు రాకుండా మా యూనియన్ చర్యలు తీసుకొంటున్నది. ఇలాంటి కొన్ని నిధుల వ్యయాలు గురించి సంఘంలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు సమాచారం.

 షోకాజ్ నోటీసుల జారీ చేసేందుకు

షోకాజ్ నోటీసుల జారీ చేసేందుకు

మంగళవారం (సెప్టెంబర్ 10)న హీరో రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. అధ్యక్షు వీకే నరేష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. ఉపాధ్యక్షుడైన రాజశేఖర్ ఏకంగా అధ్యక్షుడి స్థానంలో కూర్చొని కమిటీ సమావేశపరచడం చర్చనీయాంశమైంది. దీనిని బట్టి మా సంఘంలో భారీగా విభేదాలు చోటుచేసుకొన్నట్టు తెలుస్తున్నది. అధికారికంగా సంఘం ఇలాంటి సంఘటనలపై మీడియాకు ఎలాంటి సమాచారం ఇస్తుందా అనే విషయం మీడియాలో ఆసక్తిని పెంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X