Just In
- 12 min ago
బాలీవుడ్‌లోకి విజయ్.. లాంచ్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్.. కరణ్‌తో చర్చలు సఫలం
- 34 min ago
విజయ్ దేవరకొండతో ఆలియా భట్ రొమాన్స్.. పూరి ప్లాన్!
- 1 hr ago
ఆ విషయంలో సన్నీలియోన్‌తో పోటీపడిన కాజల్.. చివరకు పైచేయి ఎవరిదంటే!
- 1 hr ago
రాంగోపాల్ వర్మ ఎఫెక్ట్: జీవిత రాజశేఖర్, హైకోర్టు జడ్జ్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
Citizenship Bill: రాహుల్ ట్వీట్‌తో శివసేన మళ్లీ యూటర్న్, ఉద్దవ్ థాక్రే ఏమన్నారంటే..?
- Automobiles
ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్ 390 అడ్వెంచర్
- Sports
వన్డే సిరీస్‌కూ ధావన్ దూరం.. శాంసన్‌కు చోటు?!!
- Lifestyle
సెక్సియెస్ట్ ఏషియన్ మెన్ జాబితాలో యంగ్ రెబల్ హీరో ప్ర‘భాస్‘ స్థానం ‘పది‘లం..
- Finance
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, కారణమిదే
- Technology
చైనా సంస్థలతో జట్టు కట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న ఇంటెక్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
పరువు నష్టం దావా వేస్తారా? మా అధ్యక్షుడిని కడిగిపారేసిన హేమ
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మధ్య విభేదాలు రోడ్డుకెక్కాయి. వీకే నరేష్ మీడియాకు ఎక్కగా.. దానికి పోటీగా జనరల్ సెక్రటరి జీవిత, సభ్యులు హేమ, జయలక్ష్మీ ప్రెస్ మీట్ పెట్టి అధ్యక్షుడి తీరును కడిగి పారేశారు. చిరంజీవి హయాం నుంచి కొనసాగుతున్న మా బైలాస్ (రాజ్యాంగం)ను ఎలా మారుస్తారంటూ వీకే నరేష్ చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా నటి హేమ మాట్లాడుతూ..

తొలి మీటింగ్‌లోనే గొడవలు
తొలి ఈసీ మీటింగ్‌లోనే చాలా గొడవలు జరిగాయి. అధ్యక్షుడు వీకే నరేష్ తనకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు. తనకు నచ్చిన అడ్వకేట్‌ను పెట్టుకొని ఏకపక్షంగా వ్యవహరించారు. ఆ మీటింగ్‌లో మా సభ్యులు తక్కువ ఓట్లు వేసిన వ్యక్తులను, మా ఎన్నికల్లో గెలువని ఓ వ్యక్తిని కూడా సమావేశంలో కూర్చొపెట్టారు అని హేమ ఆగ్రహం వ్యక్తం చేసింది.

శివాజీరాజా అధ్యక్షుడిగా ఉండగా
గత కమిటీలో శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్యదర్శి హోదాలో నాకు హక్కు ఉందని వాదించాడు. బుక్స్ అన్ని చంకలో పెట్టుకొన్నాను. మీడియా అంతా చూడండి. ఆఫీస్‌కు తాళం వేసి వెళ్లారు. అధ్యక్షుడు శివాజీ రాజాను కాదని, వైస్ ప్రెసిడెంట్ హోదాలో మీరు ఎలా సమావేశాన్ని నిర్వహించారు. అప్పుడు మీకు హక్కు ఉందంటే.. ఇప్పుడు జీవితకు ఆ హక్కు ఎందుకు ఉండదు అని హేమ మండిపడ్డారు.

పరువు నష్టం దావా వేస్తావా?
మా వివాదం తలెత్తినప్పుడు అప్పట్లో శివాజీరాజా, వీకే నరేష్ సమానంగా మద్దతు ఇచ్చాం. నా ప్రమేయం లేకుండా ఏజీఎం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తారా? మాపై పరువు నష్టం దావా వేస్తానని బెదిరిస్తారా? మీకు దావాలు వేసే సమయం ఉన్నప్పడు.. సమావేశానికి ఎందుకు రాలేదు. పలువురికి వెళ్లవద్దని మెసేజ్‌లు పంపటానికి, బెదిరించడానికి సమయం ఉంటుంది కానీ.. మీటింగ్ రావడానికి టైం లేదా అని హేమ ఫైర్ అయ్యారు.

ఇంకా మీపై గౌరవం
మా ఈసీ సమావేశం పెట్టేటప్పుడు తన 8 మందికి మెసేజ్‌లు పంపించి వీకే నరేష్ బెదిరించారు. కోర్టుకు ఈడుస్తారని, అరెస్ట్ చేస్తారని వారిని హెచ్చరించారు. 18 మంది ఇబ్బంది పడుతుంటే మాట్లాడటం వీలు కాలేదా? ఇప్పటి వరకు మీ మీద గౌరవం తోనే నేను సామరస్యంగా మాట్లాడాను. ఇప్పుడే అదే గౌరవంతో వివరణ ఇస్తున్నాను అని హేమ ప్రశ్నల వర్షం కురిపించారు.

నరేష్‌ను కడిగి పారేసిన హేమ
మెజారిటీ మా సభ్యుల మద్దతు మాకు ఉంది. 250 కుర్చీలు వేసినప్పటికీ సరిపోలేదు. చాలా మంది నిలబడి ఉన్నారు. ఇప్పటి వరకు సమావేశం ఎందుకు జరిగిందో తెలియదు అంటూ నరేష్ లీగల్ నోటీసులు ఇస్తానని అంటున్నారు. తాజా మీటింగ్ ఎందుకు జరిగిందో తెలియకపోయినా.. త్వరలోనే లీగల్ మీటింగ్ జరుగుతుంది. అది మాత్రం మీకు తెలుస్తుంది అని హేమ ఉవ్వెత్తున లేచింది.