అప్పుడు లేనిది ఇప్పుడే గుండెపోటు వచ్చిందా? వీకే నరేష్‌పై జీవిత, హేమ సెటైర్.. ముదిరిన మా వివాదం
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)లో మరోసారి వివాదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. జీవిత రాజశేఖర్, వీకే నరేష్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకొన్నది. కొద్దిరోజుల క్రితం జీవిత ఇచ్చిన వివరణపై వీకే నరేష్ స్పందిస్తూ.. మెగాస్టార్ చిరంజీవి హయాంలో రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత వీకే నరేష్ ఆరోపణలపై తాజాగా జీవిత, హేమలు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. వీకే నరేష్ ఏకపక్ష తీరుపై జీవిత స్పందిస్తూ..

వీకే నరేష్ ఏకపక్షంగా
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 26 మంది సభ్యులు ఉన్నారు. 16 మంది సభ్యులు ఓ వైపు.. 8 మంది సభ్యులు మరో వైపు ఉన్నారు. ఎనిమిది మంది గ్రూప్‌లో అధ్యక్షుడు నరేష్ ఉన్నారు. మా యూనియన్‌కు సంబంధించి అధ్యక్షుడిగా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకొంటారు. కమిటీలో చర్చించకుండానే ఆయన చెప్పిన విషయానికే మేము సంతకాలు పెట్టి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని జీవిత గరం అయ్యారు.

అంతర్గత విభేదాలు ఉన్నాయి
ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకోవడం కోసమే సెక్రెటరీ జీవిత గారిని కోరి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కానీ అధ్యక్షుడు వీకే నరేష్ దానికి హాజరుకాలేదు. 16 మంది సంతకాలు పెట్టడంతో మెజారిటీ సభ్యుల అంగీకారం మేరకు సమావేశం నిర్వహించాం అని జీవిత చెప్పారు.

రాజ్యాంగ ఉల్లంఘన చేయలేదా?
పెన్షనర్ డే సందర్భంగా వీకే నరేష్ సొంత వైఖరితో వ్యవహరించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈసీ మీటింగ్ నిర్వహించారు. ఈసీలో కొన్ని వ్యత్యాసాలను తెలుసుకోవడానికే సమావేశం నిర్వహించాలనుకొన్నాం. ఎలక్షన్ డేట్ విషయంలో గందరగోళం జరిగింది. జూలైలో పెట్టాల్సి ఉంటే.. సెప్టెంబర్‌లో జరుపడానికి మార్పులు చేశాడు. అప్పుడు లేని రాజ్యాంగ మార్పు గురించి ఇప్పుడు మాట్లాడటేమిటి? ప్రస్తుతం రాజ్యాంగం మారుస్తారా అంటూ గుండెపోటు వచ్చినంత పనిచేశారు అని జీవిత ఎద్దేవా చేసింది.

ఏక పక్ష విధానాలతో విసిగిపోయాం
గత ఆరు నెలల్లో వీకే నరేష్ తీరుతో చాలా ఇబ్బంది పడ్డాం. ఆయన ఏక పక్ష విధానాలతో విసిగిపోయాం. బైలాస్ విషయంలో కొన్ని మార్పులు చేయకుండా ఈసీ కమిటీని ముందుకు తీసుకెళ్లలేం. కాబట్టి మేము ఈసీ మీటింగ్‌ను నిర్వహించాం. ఆయనకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీటింగ్‌లో చెప్పాల్సింది అనే మాటను జీవిత పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











