శివాజీరాజాపై నరేష్ ఫైర్.. నన్ను నరికేయాలని.. నిధుల దుర్వినియోగం.. ఎవడబ్బ సొమ్ము!

By Rajababu

Recommended Video

Actor Naresh Talks About Shivaji Raja @Naresh Counter Press Meet

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) వివాదంపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. ఏకంగా మా అధ్యక్షుడు శివాజీ రాజాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆయన నేతృత్వంలో నిధుల అవకతవకలు జరిగాయి అని నరేష్ విమర్శలు చేయడంతో మాలో విభేదాలు రోడ్డును పడ్డాయి. సోమవారం ఉదయం శివాజీరాజా నిర్వహించిన మీడియా సమావేశంలో లేవనెత్తిన సమాధానం ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..

నిధుల దుర్వినియోగం

నిధుల దుర్వినియోగం

సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయి. మా అధ్యక్షుడు శివాజీ రాజా నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించాయి. శివాజీరాజా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరిపై కూడా తాను ఫిర్యాదు చేయడం లేదు. అధ్యక్షుడిగా ఆయనే కొనసాగాలని కోరుకొంటున్నాను అని నరేష్ ఫైర్ అయ్యారు.

సమాచారం ఇవ్వడం లేదు

సమాచారం ఇవ్వడం లేదు

జనరల్ సెక్రటరీగా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. చీము, నెత్తురు ఉన్న వాడిని మాట్లాడకపోతే అది తప్పవుతుంది. మాలో లోపాయికారీగా ఏదో జరుగుతున్నది. ఎప్పుడు ధర్మం కోసం పోరాడుతాను అని అన్నారు.

శివాజీరాజా స్పందించడం లేదు

శివాజీరాజా స్పందించడం లేదు

నిధుల వినియోగంపై జరిగిన కొన్ని అవకతవకలపై కీలక సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించాను. కానీ శివాజీ రాజా నా ఫోన్‌ కాల్‌కు, చాటింగ్‌కు రిప్లే ఇవ్వలేదు. శివాజీ రాజా స్పందించడం లేదని నరేష్ వాట్సప్ ఛాటింగ్ డాటాను మీడియాకు చూపించారు.

అమెరికా ఈవెంట్లలో కోటిపై అనుమానం

అమెరికా ఈవెంట్లలో కోటిపై అనుమానం

శివాజీరాజాపై నమ్మకంతోనే పలు ఒప్పందాలపై సంతకాలు చేశాను. అమెరికాలో జరిగిన రజతోత్సవ వేడుకలకు చిరంజీవి కూడా హాజరయ్యారు. ఆ వేడుకల్లో రూ.1 కోటి వసూలైందని వచ్చినట్టు చెప్పడంతో నాకు అనుమానం వచ్చింది నరేష్ అన్నారు.

అమెరికాలో ఏం జరిగిందో తెలియదు

అమెరికాలో ఏం జరిగిందో తెలియదు

అమెరికాలో ఏం జరిగిందో నాకు తెలియదు. క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం కూడా నాకు తెలియదు అని అన్నారు. అమెరికాలో సిల్వర్ జూబ్లీ వేడుకల్లో అవినీతి జరిగింది అని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

బిజినెస్ క్లాస్‌లో మా సభ్యులు వెళ్తారా?

బిజినెస్ క్లాస్‌లో మా సభ్యులు వెళ్తారా?

అమెరికాలో జరిగే ఈవెంట్ కోసం మూవీ ఆర్టిస్టు సభ్యులు వెళ్లారు. అందురు ఎకానమీ క్లాస్‌లో వెళ్లకుండా బిజినెస్ క్లాస్‌లో వెళ్లారు. అంటే ఒక్కొక్కరికి రూ.3 లక్షలు టికెట్ ఖర్చు అయింది. అదంతా ఎవరి సొమ్ము? వాటికి ఎక్కడ నుంచి ఖర్చు పెట్టారు అని నరేశ్ ప్రశ్నించారు.

నన్ను నరికి వేయాలనే ప్రయత్నం

నన్ను నరికి వేయాలనే ప్రయత్నం

నన్ను టార్గెట్ చేసుకొని కొందరు రాజకీయాలు చేస్తున్నారు. నన్ను, నా ఇమేజ్‌ను నరికి వేయడానికి కొందరు కుట్ర చేస్తున్నారు. తప్పు జరగనప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. రజతోత్సవ వేడుకల్లో ఏ మేరకు అవకతవకలు జరిగాయనే విషయం బయటకు రావాల్సిన అవసరం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X