మహేష్ బాబుకు కూడా కోటి రూపాయలేనా, అనుమానం కలిగింది: నరేష్
Recommended Video

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో నిధుల దుర్వినియోగం అంశంపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. 'మా' ప్రెసిడెంట్ శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్ వేర్వేరుగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకున్నారు. 'మా' సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇండస్ట్రీలోని పెద్ద స్టార్లతో ప్రోగ్రామ్స్ చేసి భారీగా నిధులు సేకరించి... సొంత బిల్డింగ్ కట్టుకోడం, సేవా కార్యక్రమాలు చేయాలనేది వారి ముఖ్య ఉద్దేశ్యం. అయితే కార్యక్రమాల నిర్వహణ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, రావాల్సినంత డబ్బు రావడం లేదని కొందరి అనుమానం. ఈ విషయంలోనే శివాజీ రాజా, నరేష్ మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది.

నేను అప్పుడే క్లియర్‌గా చెప్పాను
నరేష్ మాట్లాడుతూ... చిరంజీవిగారి ప్రోగ్రాం వచ్చినపుడు నేను క్లియర్ గా... కనీసం ముగ్గురి దగ్గర నుండి కొటేషన్ తీసుకుని బెస్ట్ కొటేషన్ కు స్పందన తెలపాలని చెప్పాను. ఆ తర్వాత నాతో ఎలాంటి సంప్రదింపులు జరుపలేదు' అని తెలిపారు.

ముందు రెండు కోట్లన్నారు..
‘ఆ తర్వాత శివాజీ రాజా, శ్రీకాంత్ మిత్రుడైన విజయ్ అనే వ్యక్తి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. చిరంజీవిగారు వస్తే రెండు కోట్లు ప్రోగ్రాంకు ఇస్తామన్నారు. రూ. 25 లక్షలు బ్యాంకులో పడింది. మీరంతా ఆమోదం తెలిపితే చేద్దామన్నారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయిన తర్వాత కోటి రూపాయలే ప్రోగ్రాంకు ఇస్తామని చెప్పడం జరిగింది. మొదటి కార్యక్రమం, పెద్దలు వస్తున్నారు కాబట్టి సంతకం పెట్టడం జరిగింది.' అని నరేష్ తెలిపారు.

నాకు ఆ పవర్స్ ఉన్నాయి
‘వారు ఏం చేసినా నేనేం మాట్లాడలేదు. శివాజీ రాజా మీద ఉన్న పూర్తి నమ్మకంతో సంతకం పెట్టారు. జనరల్ సెక్రటరీ అయిన నాకు ఆఫీస్ హ్యాండోవర్ చేసుకునే పవర్స్ ఉన్నాయి. కానీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకూడదు అని మిన్నకుండి పోయాను.' అన్నారు.

నాకు బ్యాగ్రౌండ్ ఉంది.. తప్పు చేయను
నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను. 7వ ఏట నుండే ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడూ ఎవరితో కాంట్రవర్సీలకు పోలేదు. ధర్మం కోసం పోరాడతాను. నాకు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంది. 200 సినిమాల ఆర్టిస్టును, 100 సినిమాల హీరోను. అయినా ఆర్గనైజేషన్ ప్రధానంగా నేను నేర్చుకున్నాను. కాబట్టి కొంత సడలింపు ఇవ్వడం జరింది. నేను ఎవరి మీద కంప్లయింట్స్ చేయడం లేదు. తప్పు చెప్పడం లేదు. ఉన్న వాస్తవాలను చెప్పాను.

మహేష్ బాబుకు కూడా కోటి అంటే అనుమానం వచ్చింది
ఆ తర్వాత కొన్ని రోజులకు మహేష్ బాబును ప్రోగ్రాం చేయడానికి ఒప్పించాను. దానికి కూడా కోటి రూపాయలు అన్నపుడు కొంచెం అనుమానం, కన్ ఫ్యూజన్ కలిగింది. కానీ మీ ఇష్టం అని మేమంతా కూడా సైలెంట్ అయిపోయాం. ఆ సమయంలో ఏదైనా మాట్లాడితే సిల్వర్ జూబ్లీకి మేమంతా అడ్డం వచ్చినవారం అవుతామని ఆమోదించడం జరిగింది. ఇది వాస్తవం.... అని నరేష్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











