క్షమాపణలు కోరిన రాజశేఖర్.. దయచేసి మరోలా అర్థం చేసుకోవద్దంటూ మెసేజ్

Recommended Video

Rajasekhar Resigns As MAA Vice President, Gets Emotional

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. 'మా' 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. రాజశేఖర్, చిరంజీవి మధ్య రాజుకున్న వివాదం అందరినీ ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది. మధ్యలోనే ఈవెంట్ నుంచి వాకౌట్ చేసిన రాజశేఖర్ ఈ ఇష్యూపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. వివరాల్లోకి పోతే..

 చిరంజీవి సలహా.. రాజశేఖర్ తీరు

చిరంజీవి సలహా.. రాజశేఖర్ తీరు

నిన్న (జనవరి 2) జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ తీరుపై వెదికపై ఆసీనులైన సినీ పెద్దలందరూ అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి ఇచ్చిన సలహాకు రాజ శేఖర్ కౌంటర్ వేస్తూ.. నిప్పు దాచేస్తే దాగదని, పొగ వస్తూనే ఉంటుంది అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్టాడి ఈవెంట్లోంచి వాకౌట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

చిరంజీవితో గానీ, మోహన్ బాబుతో గానీ..

చిరంజీవితో గానీ, మోహన్ బాబుతో గానీ..

అయితే ఆ తర్వాత చిరంజీవి, మోహన్ బాబులతో తాను ప్రవర్తించిన తీరుపై రాజశేఖర్ సోషల్ మీడియా ద్వారా రెస్పాన్స్ ఇచ్చారు. ఈ మేరకు చిరంజీవితో గానీ, మోహన్ బాబుతో గానీ తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు రాజశేఖర్. దీంతో ఈ ఇష్యూ జనాల్లో మరిన్ని చర్చలకు తావిస్తోంది.

రాజశేఖర్ ట్వీట్.. క్షమాపణలు కోరుతున్నా

ఇక రాజశేఖర్ చేసిన ట్వీట్ చూస్తే.. ''మా డైరీ ఆవిష్కరణలో జరిగిందంతా నాకూ, నరేష్‌కు, ‘మా'కు మధ్య మాత్రమే. ఇక్కడ చెప్పిందంతా సరైంది కాదు. అందుకే నేను నిశ్శబ్దంగా ఒక పక్కన నిలబడి చూస్తూ ఉండలేకపోయాను. చిరంజీవి గారితో గానీ, మోహన్‌ బాబు గారితో గానీ నాకు ఎలాంటి విభేదాలు, గొడవలు లేవు. నా వల్ల అతిథులకు అసౌకర్యం కలిగి ఉంటే దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను'' అని పేర్కొన్నారు రాజశేఖర్.

దయచేసి మరోలా అర్థం చేసుకోవద్దు

ఆ వెంటనే మరో ట్వీట్ చేసిన రాజశేఖర్.. తనకు జరుగుతున్న దాని గురించి మాట్లాడటానికి ఇదే సరైన సమయం అనుకున్నానని తెలిపారు. ''ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి నేను రాజీనామా చేశాను. నా వైపు నుంచి చిత్ర పరిశ్రమకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తా. ఈ ఇష్యూని చిరంజీవి గారికి, మోహన్‌ బాబు గారికి నాకూ మధ్య జరిగిన గొడవగా సృష్టించవద్దు. వారిద్దరిపై నాకు అపారమైన గౌరవం ఉంది. ‘మా'కు వారి సేవలు అవసరం. దయచేసి దీన్ని మరోలా అర్థం చేసుకోవద్దు'' అని పేర్కొన్నారు.

నిన్న చిరంజీవి రియాక్షన్.. స్ట్రాంగ్ యాక్షన్

నిన్న చిరంజీవి రియాక్షన్.. స్ట్రాంగ్ యాక్షన్

కాగా రాజశేఖర్ తీరు చూసి నిన్న వెదికపై చిరంజీవి రియాక్ట్ అవుతూ.. చెప్పిన మాటకు గౌరవం, విలువ ఇవ్వడం లేదని రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశాడు. గౌరవం ఇవ్వన్నప్పుడు ఇక్కడ తామెందుకు ఉండటం అని ప్రశ్నించాడు. ఇదంతా ముందే ప్లాన్ చేసి ఇక్కడకు వచ్చారని, క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటే.. అతనిపై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోండని ఆదేశించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X