పక్కా ప్లాన్ ప్రకారమే రాజశేఖర్ రచ్చ! కఠిన చర్యలు తీసుకోండి, తీసి బయటపడేయండి: చిరంజీవి
Recommended Video
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రాజశేఖర్, మా సభ్యుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పరుచూరి గోపాలకృష్ణ చేతిలో నుంచి మైక్ లాక్కొని రాజశేఖర్ మాట్లాడుతూ..

హీరో రాజశేఖర్ ప్రసంగం
మార్చి నెలలో మా సంఘంలో బాధ్యతలు స్వీకరించాను. అప్పటి నుంచి నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ విషయంలో మా కుటుంబంలో విభేదాలు కూడా నెలకొన్నాయి. మా కోసం పిచ్చిగా పనిచేస్తున్నావని మా ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. నా బెంజ్ కారు కూడా ఆ వ్యవహరంలోనే పాడైపోయింది అని రాజశేఖర్ అన్నారు.

నిప్పును కప్పి పుచ్చితే
మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మండంగా మాట్లాడారు. సభ్యులంతా కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ముందుకెళ్లాలని సూచించారు. కానీ విభేదాలను పక్కన పెట్టి సమస్యలను పరిష్కరించుకోలేం. నిప్పును కప్పి పుచ్చితే పొగ రాకుండా ఉండదు అని రాజశేఖర్ అంటుండగా.. చిరంజీవి అడ్డుకొన్నారు.

నా గొంతు నొక్కేస్తున్నారు..
ప్రతీ ఒక్కరు హీరోలుగా పనిచేస్తున్నాం. కానీ నిజ జీవితంలో హీరోలుగా పనిచేయడానికి ప్రయత్నిస్తే నొక్కేస్తున్నారు అని రాజశేఖర్ మాట్లాడుతుండగా.. మోహన్‌బాబు అభ్యంతరం చెబితే.. నువ్వు గట్టిగా మాట్లాడితే ఏది జరిగిపోదు. నరేష్‌తో విభేదాలపై నిజం చెప్పాలనుకొన్నాను అని రాజశేఖర్ బయటకు వెళ్లిపోయారు.

రాజశేఖర్‌పై చిరంజీవి మండిపాటు
రాజశేఖర్ మాట్లాడిన తీరుపై చిరంజీవి మండిపడ్డారు. విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇప్పుడే చెప్పాను. కానీ పెద్దలకు గౌరవం ఇవ్వకుండా రాజశేఖర్ వ్యవహరించారు. రాజశేఖర్ తీరును ఖండిస్తున్నాను. అసలు విషయాన్ని పక్కన పెట్టి మీడియాలో చెడు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మా పెద్దరికాన్ని గౌరవం ఏముంటుంది అని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.

తీసి బయటపడేయండి..
రాజశేఖర్ వ్యవహారం ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు. బయటి ప్రపంచానికి మన బలహీనతను చెప్పుకోవడం చాలా ఇబ్బందికరం. మైక్ లాక్కొని రాజశేఖర్ తీరు దారుణం. సౌమ్యంగా మాట్లాడాలని ప్రయత్నిస్తే నాలో ఆవేశాన్ని బయటకు లాగడం అభ్యంతరకరం. రాజశేఖర్ వెల్ ప్లాన్‌గా వచ్చారని అర్ధమైంది. క్రమశిక్షణా చర్యల సంఘం ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే తీసి బయటపడేయాలి అని చిరంజీవి అన్నారు.


Click it and Unblock the Notifications











