రాజశేఖర్ తీరుపై ఫైర్.. మోహన్ బాబుకు ముద్దు పెట్టిన చిరంజీవి
మాలో ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మా డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమం జరుగుతుండగా రాజశేఖర్ తీరుపై అక్కడ ఆసీనులైన సినీ పెద్దలందరూ అసహనం వ్యక్తం చేశారు. మంచి ఉంటే మైకులో చెబుదాం.. చెడు ఉండే చెవిలో చెబుదామని చిరంజీవీ ఇచ్చిన సలహాకు రాజ శేఖర్ కౌంటర్ వేశాడు. నిప్పు దాచేస్తే దాగదని, పొగ వస్తూనే ఉంటుంది అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్టాడి ఈవెంట్లోంచి వాకౌట్ చేశాడు.

కఠినంగా శిక్షించండి..
అనంతరం చిరు మాట్లాడుతూ.. ఇంతకు ముందే చెప్పిన మాటకు గౌరవం, విలువ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. గౌరవం ఇవ్వన్నప్పుడు ఇక్కడ తామెందుకు ఉండటం అంటూ ప్రశ్నించాడు. ఇదంతా ముందే ప్లాన్ చేసి ఇక్కడకు వచ్చారని, సభను రసాభాస చేసేందుకు వచ్చా క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటే.. అతనిపై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోండని ఆదేశించాడు.

బయట మాట్లాడితే ఊరుకునేది లేదు..
ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన రాజశేఖర్‌పై కృష్ణం రాజు ఫైర్ అవుతూ.. వెంటనే కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఎలాంటి గొడవలు వచ్చినా వారి దగ్గరే చెప్పుకోవాలి, బయట ఎక్కడైనా సభలో చెబితే గట్టి యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించాడు.

నవ్వులు పూయించిన మోహన్ బాబు..
రాజ శేఖర్ స్పీచ్ తరువాత సభ అంతా వేడెక్కడంతో మోహన్ బాబు వచ్చి చల్లబరిచే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా కృష్ణం రాజును తాత అనడం, చిరుకు తనకు ఉన్న సరసం గురించి చెప్పి అందర్నీ నవ్వించాడు. తన కుటుంబం చిరు కుటుంబమని, చిరు కుటుంబం తన కుటుంబమని చెప్పి.. తామిద్దరం ఒక్కటేనని తెలిపాడు. దీంతో మోహన్ బాబును హగ్ చేసుకుని చిరు ముద్దు పెట్టేశాడు.

మనమే శాశ్వతం కాదు..
ఎలెక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని.. అధికారం ఏ ఒక్కరిది కాదని.. అహంకారానికి పోతే ఏమీ ఉండవు అంటూ సెటైర్లు వేశాడు. మనమే శాశ్వతం కాదని.. ప్రతీ నిమిషం మృత్యువు వెంటాడుతూనే ఉంటుందని తెలిపాడు. పెద్దలిచ్చిన మాను అందరూ కలిసి జాగ్రత్తగా చూసుకోవాలని, సవాళ్లు వద్దని సలహా ఇచ్చాడు. ఐ లవ్ రాజశేఖర్, అతని కుటుంబం అంటే ఇష్టం.. మేమంతా ఒకే తల్లి బిడ్డలం.. అందరం కలిసి ఉందామని పిలుపునిచ్చాడు.


Click it and Unblock the Notifications











