చిరంజీవి చెప్పిన కొటేషన్‌ను ఆఫీస్‌లో పెట్టండి.. మురళీ మోహన్ స్పీచ్

Recommended Video

MAA Controversy : Murali Mohan Sensational Comments Over Chiranjeevi And Rajasekhar Issue

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగంపై రాజ శేఖర్ కౌంటర్ వేయడంతో కార్యక్రమం అంతా గందరగోళంగా మారింది. దీంతో రాజశేఖర్ తీరుపై మోహన్ బాబు, కృష్ణం రాజు, టీఎస్సార్, మురళీ మోహన్ లాంటి వారు స్పందించారు.

మంచి మైకులో.. చెడు చెవిలో

మంచి మైకులో.. చెడు చెవిలో

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) లో అంతర్గత విభేదాల గురించి అందరికీ తెలిసిందే. నరేష్, జీవిత, రాజశేఖర్ మీడియా ముందుకు రావడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అప్పట్లో సెన్సేషనల్‌గా మారాయి. సినీ పెద్దలు మధ్యవర్తిత్వం చేసినా ఆ విభేదాలు సద్దుమణగకపోవడం వంటి వాటిపై చిరంజీవి మాట్లాడుతూ.. మంచి విషయాలు ఉంటే మైక్‌లో చెప్పుకొందాం.. చెడు విషయాలు ఉంటే చెవిలో చెప్పుకొందామంటూ సలహా ఇచ్చాడు.

రాజశేఖర్ ఫైర్..

రాజశేఖర్ ఫైర్..

అనంతరం మైకు అందుకున్న రాజశేఖర్.. చిరు మాటలను, ప్రసంగంపై సెటైర్లు వేశాడు. నిప్పును దాచి పెడితే పొగ రాకుండా ఉండదని, గత సభ్యులు బాగా చేయలేదనే, తమను గెలిపించారని అలాంటప్పుడు వారు బాగా చేశారని ఎలా చెబుతారంటూ చెప్పుకొచ్చాడు. తనకు బయటకు ఒకలా లోపల ఇంకోలా మాట్లాడటం రాదని చెబుతూ.. గరంగరంగా బయటకు వెళ్లిపోయాడు.

అలా పుట్టింది..

అలా పుట్టింది..

విశాఖపట్నం నుంచి విమానంలో వస్తుండగా.. మా ఆలోచన పుట్టింది. అలా గాల్లో మాకు పునాదులు పడ్డాయని మురళీ మోహన్ చెప్పుకొచ్చాడు. మలయాళ ఇండస్ట్రీ అమ్మ అని పెట్టుకుంటే.. దాంట్లోంచి మా అని నామకరణం చేశామని, దానికి బాపు గారు మోనోగ్రామ్ వేసి ఇచ్చారని నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని, ఆర్టిస్ట్‌ల అంతిమ యాత్రలు ఎంతో ఘనంగా చేయాలని ఫిక్స్ అయ్యామని, అప్పట్లో ఆఫీస్,మూలధనం లాంటివి ఏవీ లేకపోయినా తలా కొంత వేసుకుని చేశామని పేర్కొన్నాడు.

 ఆఫీస్‌లో పెట్టండి..

ఆఫీస్‌లో పెట్టండి..

మంచిని మైకులో చెడును చెవిలో చెప్పండి అని చిరంజీవి చక్కగా చెప్పారని, ఆ మాటను మా ఆఫీస్‌లో రాసి పెట్టండని మురళీ మోహన్ సూచించాడు. మా ఉన్నది అధికారం చెలాయించడం కోసం కాదు.. పేద కళాకారులకు సహాయం చేయడానికేనని పేర్కొన్నాడు. ప్రతీ ఆర్టిస్ట్ తన పుట్టినరోజుకు ఎంత వయసు ఉంటే అన్ని వేల రూపాయలు డొనేషన్‌గా ఇవ్వాలని ఏఎన్నార్ అన్నట్టు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డులు, ఇతర సమస్యల గురించి ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించాలని చిరంజీవి, మోహన్ బాబును కోరాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X