బ్రేకింగ్ : మా డైరీ ఆవిష్కరణ వేడుకలో అవమానం.. ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా

Recommended Video

Rajasekhar Resigns As MAA Vice President, Gets Emotional

దాదాపు తొమ్మిది వందల మంది ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో లెక్కలేనన్ని వివాదాలున్నాయి. గత ఎన్నికల్లో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. నరేష్-శివాజీ రాజా మధ్య వాగ్వాదాలు జరగ్గా.. గెలిచాక నరేష్-రాజశేఖర్ మధ్య చిచ్చు మొదలైంది. ఎవరినీ అడక్కుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడని నరేష్‌పై ఫైర్ అయ్యారు. అయితే వీరి మధ్య తలెత్తిన సమస్యలను సద్దుమణిగించేందుకు సినీ పెద్దలు ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు. నేటి మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ విభేదాలు తలెత్తాయి. దీంతో రాజశేఖర్ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

మా డైరీ ఆవిష్కరణలో చిరు ప్రసంగం..

మా డైరీ ఆవిష్కరణలో చిరు ప్రసంగం..

మా డైరీ ఆవిష్కరణ 2020 సందర్భంగా తమిళ చిత్ర పరిశ్రమలోని నడిగర సంఘంలో చోటుచేసుకొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ప్రస్తావించారు. ఓ దశలో నడిగర సంఘం అభివృద్దిని, సంక్షేమ పథకాలను చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. వారి స్థాయికి మనం వెళ్లలేమా అనే సందేహం కలిగేదని అన్నారు. కానీ అక్కడ డబ్బు పెరిగిన కొద్ది అక్కడ కూడా వివాదాలు తారాస్థాయికి చేరుకొన్నాయని చిరంజీవి అన్నారు. ఈ క్రమంలోనే మంచి ఉంటే మైకులో చెడు ఉంటే చెవిలో చెప్పాలంటూ సూచించారు.

భగ్గుమన్న రాజశేఖర్..

భగ్గుమన్న రాజశేఖర్..

మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మండంగా మాట్లాడారని, సభ్యులంతా కలిసి మెలిసి పనిచేయాలని సూచించారని... ప్రజాస్వామ్య పద్దతిలో ముందుకెళ్లాలని సలహా ఇచ్చారు.. కానీ విభేదాలను పక్కన పెట్టి సమస్యలను పరిష్కరించుకోలేమని చిరు ప్రసంగాన్ని అపహాస్యం చేశారు. నిప్పును కప్పి పుచ్చితే పొగ రాకుండా ఉండదు అని రాజశేఖర్ సెటైర్ వేశారు. ప్రతీ ఒక్కరు హీరోలుగా పనిచేస్తున్నాం. కానీ నిజ జీవితంలో హీరోలుగా పనిచేయడానికి ప్రయత్నిస్తే నొక్కేస్తున్నారు అని రాజశేఖర్ ఫైర్ అయ్యాడు.

రాజశేఖర్ తీరుపై అసహనం..

రాజశేఖర్ తీరుపై అసహనం..

రాజశేఖర్ ప్రోటోకాల్ పాటించకుండా మైక్ లాక్కుని మాట్లాడటం, మాలోని విభేదాలను బహిరంగంగా చెప్పడం, సభను అడ్డుకోవడం లాంటివి చేయడంపై మోహన్ బాబు, చిరంజీవి, కృష్ణం రాజు, టీఎస్సార్, మురళీ మోహన్ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నానని, ఇలా మాట్లాడే వారిని కఠినంగా శిక్షించాలని కృష్ణం రాజు ఫైర్ అయ్యారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద రాజశేఖర్‌ను స్ట్రాంగ్‌‌గా శిక్షించాలని చిరంజీవి డిమాండ్ చేశాడు.

క్షమాపణ చెప్పిన జీవిత..

క్షమాపణ చెప్పిన జీవిత..

రాజశేఖర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం.. ఆయనకు లోపల ఏది ఉంటే అది మాట్లాడేస్తాడని చెప్పుకొచ్చింది. చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపింది. అందరి అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళ్లాలనేది తమ కోరిక అని, దాని కోసం తాము పోరాటం చేస్తున్నామని తెలిపింది. నరేష్‌కు, తమకు ఎలాంటి విభేదాలు, గొడవలు లేవని తెలిపింది. అందరం కలిసి కట్టుగా పని చేస్తామని చెప్పుకొచ్చింది.

కలత చెందిన రాజశేఖర్..

కలత చెందిన రాజశేఖర్..


నేటి ఈ ఉదంతంలో రాజ శేఖర్ కలత చెందినట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌లో తనకు అవమానం జరిగినట్టు ఫీల్ అయిన రాజశేఖర్ తన ఉపాధ్యక్ష పదివికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X