గొడవలు సహజం.. రాజశేఖర్ ఆవేశంలో మాట్లాడాడు.. టీఎస్సార్ స్పీచ్

Recommended Video

Chiranjeevi Angry On Rajasekhar | MAA Association Diary Launch

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగంపై రాజ శేఖర్ కౌంటర్ వేయడంతో సభలో గందరగోళం నెలకొంది.

మంచి మైకులో.. చెడు చెవిలో

మంచి మైకులో.. చెడు చెవిలో

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) లో అంతర్గత విభేదాల గురించి అందరికీ తెలిసిందే. నరేష్, జీవిత, రాజశేఖర్ మీడియా ముందుకు రావడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అప్పట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వీటిపై చిరంజీవి మాట్లాడుతూ.. మంచి విషయాలు ఉంటే మైక్‌లో చెప్పుకొందాం. చెడు విషయాలు ఉంటే చెవిలో చెప్పుకొందామంటూ సలహా ఇచ్చాడు. విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగుదామని అందరికీ సూచించారు.

 రాజశేఖర్ ఫైర్..

రాజశేఖర్ ఫైర్..

అనంతరం మైకు అందుకున్న రాజశేఖర్.. చిరు మాటలను, ప్రసంగంపై సెటైర్లు వేశాడు. నిప్పును దాచి పెడితే పొగ రాకుండా ఉండదని, గత సభ్యులు బాగా చేయలేదనే, తమను గెలిపించారని అలాంటప్పుడు వారు బాగా చేశారని ఎలా చెబుతారంటూ చెప్పుకొచ్చాడు. తనకు బయటకు ఒకలా లోపల ఇంకోలా మాట్లాడటం రాదని చెబుతూ.. సభ నుంచి బయటకు వెళ్లిపోయాడు.

 టాలీవుడ్ అంటే మజాక్ కాదు..

టాలీవుడ్ అంటే మజాక్ కాదు..

కళాబంధు టీ సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ అంటే గొప్పగా చూసేవారు.. మనవారిని ఒకలా చూసేవారు. కానీ ఇప్పుడు మారింది. టాలీవుడ్ అంటే మాటా మజాక్ కాదని నిరూపించారు. చిరంజీవిలో ఓ ప్రత్యేకత ఉంటుంది. నలభై ఏళ్ల నుంచి చూస్తున్నాను.. ఏ విషయాన్నైనా సున్నితంగా చెబుతాడు. మోహన్ బాబుకు కోపం వెంటనే వస్తుంది.. మళ్లీ వెంటనే శాంతంగా అవుతారు.

ఆవేశంలో మాట్లాడాడు..

ఆవేశంలో మాట్లాడాడు..

రాజశేఖర్ ఏదో ఓ ఆవేశంలో మాట్లాడాడు.. భార్యాభర్తలకే గొడవలు సహజం.. విభేదాలు రావడం మానవ సహజం.. ఇంత పెద్ద మాలో గొడవలు రావడం మామూలే. రాజ శేఖర్‌ ఎప్పుడూ ఫైర్ అయినా.. జీవితా పక్కనే ఉండి శాంతం శాంతం అంటూ కూల్ చేస్తుంది. మా దేశంలోనే నంబర్ వన్ కావాలి'అని కోరుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X