twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’ ఎన్నికల వేళ శ్రీరెడ్డి సెన్సేషన్: క్రిమినల్స్‌, లేడీ సప్లయర్స్ అంటూ...

    |

    కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో శ్రీరెడ్డి టాలీవుడ్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారంలో సరైన న్యాయం చేయడం లేదంటూ అప్పట్లో 'మా' అసోసియేషన్, ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్దనగ్న ప్రదర్శన చేసి మీడియాలో హాట్ టాపిక్ అయింది. శ్రీరెడ్డి చేసిన ఈ రచ్చ అప్పట్లో శివాజీ రాజా నేతృత్వంలోని 'మా' అసోసియేషన్‌ను ఇబ్బందులోకి నెట్టింది. వారు కూడా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం శ్రీరెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మకాం మార్చి కోలీవుడ్లో సెటిలైంది. తాజాగా 'మా' ఎన్నికలు జరుగుతున్న వేళ శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

    వారినే గెలిపించాలంటూ ట్వీట్

    వారినే గెలిపించాలంటూ ట్వీట్

    శివాజీ రాజాగారి ప్యానల్‌నే మరోసారి గెలిపించాలంటూ శ్రీరెడ్డి ఈ సందర్భంగా కోరడం చర్చనీయాంశం అయింది. అతడు సేవా దృక్ఫధం ఉన్న మంచి వ్యక్తి, అతడిని వదులుకోవద్దు అంటూ ప్రశంసలు గుప్పించడం గమనార్హం.

    క్రిమినల్స్, లేడీ సప్లయర్స్

    క్రిమినల్స్, లేడీ సప్లయర్స్

    క్రిమిన్సల్, పింప్స్‌కు ఓటు వేయవద్దు. మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను లేడీ సప్లయర్ల చేతుల్లోకి వెళ్లనీయొద్దు... అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.

    శివాజీ రాజా ప్యానల్ వర్సెస్ నరేష్ ప్యానల్

    శివాజీ రాజా ప్యానల్ వర్సెస్ నరేష్ ప్యానల్

    ఈ సారి ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్, నరేష్ ప్యానల్ పోటాపోటీగా రంగంలోకి దిగారు. మరోసారి అధికారం దక్కించుకోవాలని శివాజీ రాజా ప్యానల్ ప్రయత్నిస్తుండగా.... తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ నరేష్ ప్యానల్ కోరుతోంది.

    జీవిత, రాజశేఖర్ రాకతో రసవత్తరంగా...

    జీవిత, రాజశేఖర్ రాకతో రసవత్తరంగా...

    అయితే నరేష్ ప్యానల్ తరుపు నుంచి జీవిత, రాజశేఖర్ పోటీ చేస్తుండటంతో ఈ సారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. వీరు చిరంజీవి, మహేష్ బాబును కలిసి ఉధృతంగా ప్రచారం చేస్తూ మీడియాలోహాట్ టాపిక్ అయ్యారు.

    English summary
    "Vote for sivaji raja garu panel..seva drukpadam vunna manchi vyakti,dnt loose him..dont vote to criminals,pimps..dnt keep our maa association in lady suppliers." Sri Rereddy tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X