‘మా’ ఎన్నికల ఫలితాలు వెల్లడి: అధ్యక్షుడిగా నరేష్ సంచలన విజయం!

హోరా హోరీగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రముఖ నటుడు నరేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఫలితాలు వెల్లడయ్యాయి. శివాజీ రాజాతో పాటు ఆయన ప్యానల్ నుంచి పోటీ చేసిన శ్రీకాంత్ తదితరులు ఓటమి పాలయ్యారు.

మొత్తంగా 745 ఓట్లు ఉండగా ఈ సారి రికార్డు స్థాయిలో 472 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 'మా' ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఓటింగ్ జరుగడం ఇదే తొలిసారి. ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

‘మా' అధ్యక్షుడిగా నరేష్ ఎన్నిక

‘మా' అధ్యక్షుడిగా నరేష్ ఎన్నిక

ఉత్కంఠగా సాగిన ‘మా' ఎన్నికల్లో నరేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకు 268 ఓట్లు పోలయ్యయి. శివాజీ రాజాకు కేవలం 199 ఓట్లు మాత్రమే పోలవ్వడంతో 69 ఓట్ల ఆధిక్యంతో విజయం నరేష్ సొంతమైంది.

జీవిత, రాజశేఖర్ విజయం

జీవిత, రాజశేఖర్ విజయం

నరేష్ ప్యానెల్ తరుపున ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటుగా పోటీ చేసిన హీరో రాజశేఖర్, జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన జీవిత విజయం సాధించారు. శివాజీ రాజా ప్యానెల్ తరుపున ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసిన శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన రఘుబాబు ఓటమి పాలయ్యారు.

స్వతంత్ర అభ్యర్థి హేమ విజయం

స్వతంత్ర అభ్యర్థి హేమ విజయం

ఉపాధ్యక్ష పదవికి స్వతంత్రంగా పోటీ చేసిన నటి హేమ విజయం సాధించడం విశేషం. ఆమెతో పాటు ఎస్వీ కృష్ణారెడ్డి (శివాజీ రాజా ప్యానల్) కూడా ఉపాధ్య పదవికి ఎన్నికయ్యారు.

కోశాధికారిగా రాజీవ్ కనకాల

కోశాధికారిగా రాజీవ్ కనకాల

కోశాధికారిగా రాజీవ్ కనకాల.. శివాజీ రాజా ప్యానల్ తరుపు నుంచి ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా గౌతమ్ రాజు, శివ బాలాజీ నరేష్ ప్యానల్ నుంచి గెలుపొందారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబబర్స్‌‌గా గెలుపొందిన వారు

ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబబర్స్‌‌గా గెలుపొందిన వారు

  • అలీ (నరేష్ ప్యానల్)
  • రవిప్రకాశ్‌ (శివాజీ రాజా ప్యానల్)
  • తనికెళ్ల భరణి (శివాజీ రాజా ప్యానల్)
  • సాయికుమార్‌ (శివాజీ రాజా ప్యానల్)
  • ఉత్తేజ్‌(శివాజీ రాజా ప్యానల్)
  • పృథ్వి(శివాజీ రాజా ప్యానల్)
  • జాకీ (నరేష్ ప్యానల్)
  • సురేశ్‌ కొండేటి (శివాజీ రాజా ప్యానల్)
  • అనితా చౌదరి(శివాజీ రాజా ప్యానల్)
  • అశోక్ కుమార్‌ (నరేష్ ప్యానల్)
  • సమీర్‌(శివాజీ రాజా ప్యానల్)
  • ఏడిద శ్రీరామ్‌(శివాజీ రాజా ప్యానల్)
  • రాజా రవీంద్ర (శివాజీ రాజా ప్యానల్)
  • తనీష్‌(శివాజీ రాజా ప్యానల్)
  • జయలక్ష్మి(శివాజీ రాజా ప్యానల్)
  • కరాటె కళ్యాణి (నరేష్ ప్యానల్)
  • వేణుమాధవ్‌(శివాజీ రాజా ప్యానల్)
  • పసునూరి శ్రీనివాస్‌ (నరేష్ ప్యానల్)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X