For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్ మూవీ నుంచి చెప్పకుండా తీసేశారు.. ఆ అమ్మాయి వల్ల నాపై కేసు పెట్టారు: నోరు విప్పిన ప్రకాశ్ రాజ్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని నటీనటుల సంక్షేమం కోసం ఏర్పాటైన సంఘమే 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' (మా). ఆరంభంలో దీనికి సీనియర్ నటులు అధ్యక్షులుగా చేశారు. రానురానూ ఈ సంఘానికి ఎన్నికలు అనివార్యం అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి రెండేళ్లకు ఒకసారి 'మా' పాలకవర్గానికి ఎన్నిక జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.

  ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య రోజుకో ములుపు తిరుగుతున్నాయి. ఇందులో అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న ప్రకాశ్ రాజ్ తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మూవీ గురించి ఓ సీక్రెట్ లీక్ చేశారు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  ఐదు నుంచి రెండుకు చేరిన అభ్యర్థులు

  ఐదు నుంచి రెండుకు చేరిన అభ్యర్థులు

  కొంత కాలంగా 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల్లో ఇద్దరు ముగ్గురు ప్రముఖులు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అయితే, ఈ సారి మాత్రం ఏకంగా ఐదుగురు నటీనటులు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, వీరి నుంచి ముగ్గురు తప్పుకోవడంతో ప్రకాశ్ రాజ్, విష్ణు మధ్య ఎన్నిక జరుగుతుంది.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  ప్రకాశ్ రాజ్ ముందే... ఆ ప్రకారమే అన్నీ

  ప్రకాశ్ రాజ్ ముందే... ఆ ప్రకారమే అన్నీ

  ప్రకాశ్ రాజ్ 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల కోసం ఎప్పటి నుంచో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకే అందరి కంటే ముందే తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఇప్పటికే 27 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ను కూడా ప్రకటించారు. అంతేకాదు, వెంటనే వాళ్లందరితో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. తమ భవిష్యత్ కార్యాచరణనూ వెల్లడించేశారు.

  సమయం వచ్చేసింది.. దూకుడుగా వెళ్తూ

  సమయం వచ్చేసింది.. దూకుడుగా వెళ్తూ

  సినీ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికలు అక్టోబర్ 10న జరగబోతున్నాయి. అదే రోజు కౌటింగ్ కూడా ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రచారాన్ని ముమ్మరం చేసేసింది. అదే సమయంలో విమర్శలు చేస్తూ ప్రత్యర్థి వర్గంపై పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  ఆ షోలోకి ప్రకాశ్ రాజ్.. అన్నీ ప్రస్తావిస్తూ

  ఆ షోలోకి ప్రకాశ్ రాజ్.. అన్నీ ప్రస్తావిస్తూ

  'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న ప్రకాశ్ రాజ్.. తాజాగా ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'అలీతో సరదాగా' అనే షోకు గెస్టుగా వచ్చారు. ఇందులో భాగంగా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ విశేషాలను పంచుకున్నారు. అలాగే, వైవాహిక జీవిత అంశాలను కూడా వివరంగా చెప్పుకొచ్చారు.

  టాలీవుడ్ డబ్బులన్నీ... కోలీవుడ్ కోసమే

  టాలీవుడ్ డబ్బులన్నీ... కోలీవుడ్ కోసమే

  ఈ షోలో భాగంగా ఆలీ మాట్లాడుతూ.. 'తెలుగు సినిమాల్లో డబ్బులు బాగా డిమాండ్ చేసి.. వాటిని తీసుకెళ్లి తమిళ సినీ ఇండస్ట్రీలో మూవీలు చేస్తున్నాడని మీపై ఓ ఆరోపణ ఉంది. అది నిజమేనా' అని ప్రశ్నించాడు. దీనికి ప్రకాశ్ రాజ్ 'ఫలానా దగ్గర డబ్బులు ఫలానా దగ్గర పెట్టాలని లేదు కదా. అయినా నాకు సినిమాలు అంటే దురద' అంటూ వివరణ ఇచ్చారాయన.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  ప్రకాశ్ రాజ్‌ను బ్యాన్ చేయడానికి కారణం

  ప్రకాశ్ రాజ్‌ను బ్యాన్ చేయడానికి కారణం

  ప్రకాశ్ రాజ్‌ను టాలీవుడ్ నిర్మాతలు ఎందుకు బ్యాన్ చేశారు అని ఈ షోలో అలీ ప్రశ్నించాడు. దీనికి ప్రకాశ్ రాజ్ 'ఓ సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో కొందరు ఓ అమ్మాయిపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఒకరిని పక్కకు నెట్టేశాను. అప్పుడు నా మీద కేసు పెట్టారు. అలా నిర్మాతలు నా మీద నిషేదం విధించారు. అయినా ఇప్పుడది గుర్తు చేయడం ఎందుకు' అని అన్నారు.

  Recommended Video

  MAA Elections : Chiranjeevi VS Mohanbabu మధ్య ఎన్నికలుగా Mind Game | PrakashRaj || Filmibeat Telugu
  మహేశ్ సినిమా నుంచి చెప్పకుండా తీశారు

  మహేశ్ సినిమా నుంచి చెప్పకుండా తీశారు

  ఈ టాక్ షోలో ప్రకాశ్ రాజ్ గతంలో జరిగిన ఓ సంచలన విషయాన్ని ప్రస్తావించాడు. 'ఆగడు సినిమాలో నేను చేయాల్సి ఉంది. కానీ, శ్రీను వైట్ల గారు స్పీడు కావాలి అన్నారు. అది నాకు నచ్చడం లేదు అని ఆయనకు చెప్పాను. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య డిస్టబెన్స్ వచ్చింది. అంతే.. తర్వాతి రోజే సోనూ సూద్ గారు సెట్‌లోకి వచ్చేశారు' అంటూ అప్పటి విషయాన్ని వివరించారు.

  English summary
  Tollywood Actor Prakash Raj Participating in MAA Elections 2021. Now He Reveals Reason Behind his Exit From Aagadu Movie in Alitho Saradaga.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X