twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAAలో మరో ట్విస్ట్.. ఆరోజు మోహన్ బాబు దాడి చేశారు.. ఫుటేజ్ కావాలి.. ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ లేఖ

    |

    మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తన పని తాను మొదలు పెట్టేశారు. వరుసగా సినిమా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే ఈ నెల 16వ తేదీ ఉదయం 11. 45 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఇదంతా ఇలా ఉంటే... 'మా' ఎన్నికల్లో గెలిచిన అనంతరం పదవులకు రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్ బృందం తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటోందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    మేము చూశాం

    మేము చూశాం

    విష్ణు టీమ్ బాగా పనిచేయడం కోసం తాము మా పదవులకు రాజీనామా చేసామని ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రకాష్ రాజ్ 'మా' ఎన్నికల అధికారి కృష్ణ మోషన్ ను ఎన్నికల సమయంలో రికార్డ్ చేసిన సీసీ ఫుటేజ్ ఇవ్వాల్సిందిగా కోరారు.

    ముగిసిన 'మా' ఎన్నికలలో జరిగిన అనేక దురదృష్టకర సంఘటనలకు మీరు సాక్షులుగా ఉన్నారని పేర్కొన్న ప్రకాష్ రాజ్ DRC సభ్యులు మోహన్ బాబు మరియు మాజీ అధ్యక్షుడు నరేష్ ల వికృత, సామాజిక వ్యతిరేక ప్రవర్తనను మేము చూశామని లేఖలో పేర్కొన్నారు.

    శారీరకంగా దాడి చేశారు

    శారీరకంగా దాడి చేశారు

    నరేష్, మోహన్ బాబులు 'మా' సభ్యులను దూషించారు, బెదిరించారు మరియు శారీరకంగా దాడి చేశారని లేఖలో పేర్కొన్న ఆయన పోలింగ్ లో వారిని మరియు వారి అనుచరులను అనుమతించడానికి మీరు మీ విచక్షణాధికారాలు ఉపయోగించారని నేను అనుకుంటున్నానని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఎన్నికల అధికారిగా మీకు ఉన్న విచక్షణా అధికారం కారణంగానే వారి అనుయాయులు పోలింగ్ ప్రాంతంలోకి వచ్చారని నేను భావిస్తున్నానని అన్నారు.

    నవ్వులాట అయింది

    నవ్వులాట అయింది

    అలానే అక్కడ జరిగిన కొన్ని సంఘటనల విజువల్స్ మీడియాలోనూ ప్రసారం అయ్యాయి. దాంతో 'మా' ఎన్నికలు, తదనంతర పరిణామాలు ప్రజల దృష్టిలో నవ్వులాటగా మారిపోయాయన్న ప్రకాష్ రాజ్ పోలింగ్ కేంద్రంలో అసలు ఏం జరిగిందనే విషయం 'మా' సభ్యులు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారని అన్నారు.

    సీసీ ఫుటేజ్ కావాలి

    సీసీ ఫుటేజ్ కావాలి

    మీరు ఎన్నికల ముందు మీ బ్రీఫింగ్‌ల సమయంలో మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను పెడతామని చెప్పారు. వాటిలో అన్ని రికార్డ్ అయి ఉంటాయని నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని పొందడం మాకున్న ప్రజాస్వామిక హక్కుగా నేను భావిస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు.

    Recommended Video

    Bigg Boss Telugu 5 : నామినేషన్స్, ఎలిమినేషన్స్ మొత్తం రవికి తెలుసు..! || Filmibeat Telugu
    ఇవ్వడానికి రెడీ

    ఇవ్వడానికి రెడీ

    ఓ ఎన్నికల అధికారిగా సంబంధిత రికార్డులు కనీసం మూడు నెలల పాటు భద్రపరచడం మీ విధి అని గుర్తు చేసిన ప్రకాష్ రాజ్ సుప్రీంకోర్టు సైతం పలు తీర్పుల్లో ఎన్నికలకు సంబంధించిన రికార్డులు పోలింగ్ ఆఫీసర్ జాగ్రత్త చేయాలని చెప్పింది కాబట్టి వీలైనంత త్వరగా ఆ సీసీ ఫుటేజ్ ను మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నానని అన్నారు.

    ఒకవేళ మీరు దీనిపై వెంటనే స్పందించకపోతే ఆ ఫుటేజ్ డిలీట్ చేయబడింది లేదా ట్యాంపర్ అయ్యిందని భావించాల్సి ఉంటుంది" అని ప్రకాష్ రాజ్ లేఖలో పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ లేఖపై స్పందించిన మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సీసీ టీవీ ఫుటేజ్ మా ఆఫీసులో భద్రంగానే ఉందని, నిబంధనల ప్రకారం ఎవరడిగినా ఇవ్వడానికి రెడీ అని ప్రకటించారు.

    English summary
    Prakash Raj Seeks CCTV Footage of polling, he wrote a letter according to MAA Election officer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X