For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MAA Elections: ప్యానెల్‌ను ప్రకటించిన మంచు విష్ణు.. ఆ సినీ జంటకు రెండు పదవులు.. సంపూ కూడా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్'కు ఎన్నికలు జరుగుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది దీని గురించి పరిశ్రమలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. అయితే, ఈ సారి అది ఇంకాస్త ముందుగానే ప్రారంభం అయింది. ప్రస్తుత పాలక వర్గం పని చేస్తూనే ఉన్నా.. అక్టోబర్‌లో జరగాల్సిన ఎన్నికల కోసం చాలా రోజుల నుంచే హడావిడి కనిపిస్తోంది.

  ఇందులో విజయం సాధించేందుకు అప్పుడే పలువురు సినీ ప్రముఖులు పావులు కదుపుతున్నారు. ఇలాంటి సమయంలో పోటీదారుల్లో ఒకరైన మంచు విష్ణు తాజాగా తన ప్యానెల్‌ను ప్రకటించాడు. ఆ వివరాలు మీకోసం!

  Bigg Boss Telugu 5 Promo: ఆమె విషయంలో పెద్ద తప్పు చేసిన షణ్ముఖ్.. హౌస్‌లో షాకింగ్ విజువల్స్

  ఐదుగురిలో ఇద్దరు తప్పుకోవడంతో

  ఐదుగురిలో ఇద్దరు తప్పుకోవడంతో

  కొన్నేళ్లుగా ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల్లో ఇద్దరు ముగ్గురు ప్రముఖులు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అయితే, ఈ సారి మాత్రం ఏకంగా ఐదుగురు నటీనటులు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, వీరి నుంచి జీవిత, హేమ తప్పుకోవడంతో పాటు ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో చేరిపోయారు.

  Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన హమీదా.. పర్సనల్ ఫొటోలను లీక్ చేసి ఝలక్ ఇచ్చిన ఫ్యాన్స్

  అలా తప్పుకుంటానని చెప్పిన విష్ణు

  అలా తప్పుకుంటానని చెప్పిన విష్ణు

  ‘మా' అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న మంచు విష్ణు కొద్ది రోజుల క్రితం ఓ వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' స్థాపించినప్పటి నుంచి ఎన్నో విషయాలను ప్రస్థావించిన అతడు.. మా బిల్డింగ్‌ను కట్టేందుకు డబ్బులు ఇస్తానని చెప్పాడు. అంతకంటే ముందు పెద్దలంతా కలిసి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని నిబంధన పెట్టాడు.

  వ్యూహాత్మక అడుగులు.. వాళ్ల మద్దతు

  వ్యూహాత్మక అడుగులు.. వాళ్ల మద్దతు

  ఈ సారి ‘మా' ఎన్నికలను మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అందుకే ఆరంభం నుంచే అతడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే సీనియర్ హీరోల మద్దతును కూడా కూడగట్టుకున్నాడు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ సహా పలువురు స్టార్ హీరోల సపోర్టును అందుకున్నాడు. దీంతో ప్రకాశ్ రాజ్‌కు గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు.

  Bigg Boss: బయటపడిన రవి బండారం.. లహరి విషయంలో ప్రియ అన్నది నిజమే.. షాకిస్తోన్న వీడియో

  మా బిల్డింగ్ గురించి శుభవార్త చెప్పి

  మా బిల్డింగ్ గురించి శుభవార్త చెప్పి

  ప్రతిసారి జరిగే ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికలలో బిల్డింగ్ విషయం ప్రధానంగా చర్చ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే మంచు విష్ణు ‘మా ఆసోషియేషన్‌కు భవనం ఉండాలని మనందరి కల. ఆ కల త్వరలోనే నిజం కాబోతుంది. నేను స్వయంగా వెళ్లి మూడు స్థలాలను చూశాను. అందులో ఏది బెస్ట్ అనేది మనందరం కూర్చుని డిసైడ్ చేద్దాం' అని చెప్పాడు.

  Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety
  ప్యానెల్ ప్రకటించిన మంచు విష్ణు

  ప్యానెల్ ప్రకటించిన మంచు విష్ణు

  అక్టోబర్ 10న మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్‌ను ప్రకటించేశాడు. అంతేకాదు, అప్పుడే ప్రచారం కూడా నిర్వహించుకుంటున్నాడు. ఇక, ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో మంచు విష్ణు బుధవారం పలువురితో సమావేశం అయ్యాడు. ఇక, తాజాగా తన ప్యానెల్‌ను కూడా ప్రకటించేశాడు.

  పబ్లిక్ ప్లేస్‌లో భర్తతో శ్రీయ సరసాలు: ఏకంగా పైకి లేపేసి మరీ.. దారుణమైన ఫోజుతో అందాల విందు

  ‘మా' కోసం మనమందరం అంటూ

  ‘మా' కోసం మనమందరం అంటూ

  తాజాగా మంచు విష్ణు 26 మందితో కూడిన ప్యానెల్‌ను ప్రకటించాడు. ఇందులో విష్ణు అధ్యక్ష పదవికి, రఘుబాబు జనరల్ సెక్రెటరీగా, బాబూ మోహన్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్‌గా, మాదాల రవితో పాటు పృథ్వీరాజ్ వైస్ ప్రెసిడెంట్‌గా, శివ బాలాజీ ట్రెజరర్‌గా, కరాటే కల్యాణీతో పాటు గౌతం రాజు జాయింట్ సెక్రెటరీగా పోటీ పడుతున్నారు. వీరిలో సీనియర్లు ఎక్కువగా ఉన్నారు.

  18 మంది ఎగ్జిక్యూటీవ్ మెంబర్లు కూడా

  18 మంది ఎగ్జిక్యూటీవ్ మెంబర్లు కూడా

  మంచు విష్ణు ప్యానెల్‌లో అర్చన, అశోక్ కుమార్, గీతా సింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్‌పేట శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరీ రెడ్డి, సంపూర్ణేశ్ బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల, రేఖలు ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా పోటీ పడుతున్నారు. ఇక, ఈ ప్యానెల్‌లో భార్యభర్తలైన శివ బాలాజీ, స్వప్న ఇద్దరూ పోటీలో ఉండడం విశేషం.

  English summary
  Tollywood Actor and Producer Vishnu Manchu Participating in MAA Elections 2021. Now He Announced his Panel with 26 Members.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X