twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముండ మోసినట్టు ఎందుకు ఏడుపు? అవసరమైతే కృష్ణుడు రంగంలోకి.. వీకే నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసినా ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఆయన ప్యానెల్‌లోని కొందరు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మాజీ అధ్యక్షుడు వీకే నరేష్ తన బాధ్యతలను విష్ణు మంచుకు అప్పగించారు. ఈ సందర్భంగా నరేష్ మీడియాతో మాట్లాడుతూ..

    చివరి రోజు ఆనంద భాష్పాలు అంటూ

    చివరి రోజు ఆనంద భాష్పాలు అంటూ

    ఎమోషన్స్, ప్రస్టేషన్‌తో మా ప్రతిష్టను దిగజార్చవద్దు. ఈ రోజు మా అధ్యక్షుడిగా నా చివరి రోజు. ఆనంద బాష్పాలు వస్తున్నాయి. నేను ఇప్పట్లో పోటీ చేయనని చెప్పాను. అవసరమైతే కృష్ణుడు వస్తాడు. అలాంటి అవసరం రావొద్దని అనుకొంటున్నాను. ఖచ్చితంగా ధర్మాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఆరేళ్లపాటు మా సంస్థ అభివృద్ధికి పాటుపడ్డాం అని వీకే నరేష్ అన్నారు.

    ఆరోపణలు మానుకొంటే మంచింది అని నరేష్

    ఆరోపణలు మానుకొంటే మంచింది అని నరేష్

    మా ఎన్నికలు పెద్ద ఎత్తున ఎన్నికల జరిగిన తర్వాత కూడా ఆరోపణలు చేయడం బాధాకరం. కొందరి పేర్లు ఎత్తడం నాకు ఇష్టం లేదు. నా వల్ల ప్రకాశ్ రాజ్‌కు ఏమైనా అయిందా? మా సభ్యులు విష్ణు మంచును గెలిచిపించారు. ఎవరు గెలిచినా మా సభ్యుల విజయం అని ప్రకాశ్ రాజ్ స్వయంగా చెప్పారు. సభ్యులు తమకు నచ్చిన వాళ్లను గెలిపించుకొన్నారు. ఇకనైనా వారు ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి అని నరేష్ పేర్కొన్నారు.

    ప్రకాశ్ రాజ్ మాటపై నిలబడు అంటూ

    ప్రకాశ్ రాజ్ మాటపై నిలబడు అంటూ

    ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేయడంపై వీకే నరేష్ స్పందిస్తూ.. ఆ వివాదంపై కొత్త ప్యానెల్ నిర్ణయం తీసుకొంటుంది. గెలిచినా, ఓడినా రెండు సంవత్సరాలు కలిసి పనిచేస్తామని అన్నారు. అలాంటి మాటలు చెప్పిన వాళ్లు మాటపై నిలపడాలి కదా అని నరేష్ ప్రశ్నించారు. కాబట్టి ఈ విషయాన్ని వారికే వదిలేద్దాం. మోడీ గెలిచినంత మాత్రాన.. కాంగ్రెస్ వాళ్లు దేశాన్ని విడిచి వెళ్లిపోతారా? అని ఎదురు ప్రశ్న వేశారు.

    మగాళ్లు ఎందుకు ఏడుస్తున్నారో ..

    మగాళ్లు ఎందుకు ఏడుస్తున్నారో ..

    ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగలేదని ఆరోపించడంలో అర్ధం లేదు. అధికారుల ముందే ఎన్నికలు జరిపించాం. ఓటర్లు స్వయంగా ఓట్లు వేశారు. ఇంతకంటే ప్రజాస్వామ్యబద్దంగా ఎక్కడైనా ఎన్నికలు జరుగుతాయా? కొందరు ముండ మోసినట్టు ఎందుకు ఏడుస్తున్నారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మగాళ్లు మీడియా ముందు ఎందుకు ఏడ్చారో అర్ధంకాలేదు అని వీకే నరేష్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

    Recommended Video

    Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
    మరోసారి ఈ ఓట్లు కూడా రావు అంటూ

    మరోసారి ఈ ఓట్లు కూడా రావు అంటూ

    మగాళ్లు ఎందుకు ఏడుస్తున్నారు? మగాళ్లు ఏడిస్తే నమ్మరు. కలిసి పనిచేస్తే వాళ్లను కొడుతారా? కలిసి పనిచేయడానికి నేను కూడా ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా పనితీరును ప్రశ్నించవచ్చు. ఇలా చేస్తే ఆ ప్యానెల్‌కు మళ్లీ పోటీ చేస్తే వచ్చేసారి ఇన్ని ఓట్లు కూడా రావు. మా సంస్థకు ఎన్నికలు రావొద్దని కోరుకొంటున్నాం అని వీకే నరేష్ అన్నారు.

    English summary
    MAA Elections 2021: Manchu Vishnu Takes Charge as MAA President from Naresh. After this, VK Naresh contraversial comments on Prakash Raj Panel
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X