MAA Elections: ఓటింగ్ సమయంలో రెచ్చిపోయిన ప్రగతి.. ఆ నటుడిపైకి దూసుకెళ్లి కొట్టేందుకు ప్రయత్నం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో భారీగా వాగ్వాదాలు చోటుచేసుకొన్నాయి. ఓ దశలో నువ్వెంత? అంటే నువ్వెంత అని బాహాబాహికి దిగారు. ఇరు వర్గాల మధ్య భావోద్వేగాలు కనిపించాయి. ఒకరిపైకి మరొకరు ఆవేశంగా దూసుకెళ్తూ కనిపించారు. కొందరు నటీనటులు వారికి సర్ది చెప్పి గొడవను నివారించే ప్రయత్నం చేశారు. అయితే పోలింగ్ సందర్భంగా ఓ నటుడిపై నటి ప్రగతి ఆవేశంతో కొట్టేంత పని చేశారు. ఆ విషయంలోకి వెళ్తే..

గొడవలు, ఘర్షణ వాతావరణంలో

గొడవలు, ఘర్షణ వాతావరణంలో

పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్‌కు సంబంధించిన వాళ్లు ఒకరిపై మరొకరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గొడవలకు దిగారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ, రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్టు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇలా అనేక గొడవలు, ఘర్షణ వాతావరణం మా ఎన్నికల్లో కనిపించడం అత్యంత వివాదంగా మారింది. సినీ పరిశ్రమ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

సమీర్, శివ బాలాజీ బాహబాహీ


పోలింగ్ జరుగుతున్న సమయంలో శివబాలాజీ, సమీర్ మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. సమీర్‌ను నువ్వెంత అంటే.. శివ బాలాజీని నువ్వెంత అంటూ మాటలు విసురుకొన్నారు. వారిద్దరు ఒకరిపై ఒకరు కలియబడేందుకు సిద్ధం కాగా.. గందరగోళం నెలకొన్నది. కొందరు నటులు వచ్చి వారిని విడిపించడంతో అక్కడ ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితి సద్దుమణిగింది.

సహనం కోల్పోయిన నటి ప్రగతి

సహనం కోల్పోయిన నటి ప్రగతి

ఇక ప్రగతి కూడా ఓ దశలో సహనం కోల్పోయింది. ఓ నటుడికి ప్రగతికి మధ్య గొడవ జరిగింది. అయితే ఆ నటుడిని ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచింది. చేయి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది. నువ్వేంది నాకు చెప్పేది అంటూ హెచ్చరించింది. అయితే ప్రగతి, ఆ నటుడికి మధ్య గొడవ పెద్దగా కావడంతో అక్కడే ఉన్న మిగితా నటులు అక్కడికి వచ్చి వారిని శాంత పరిచారు. అయినా ప్రగతి మాత్రం అదే ఆవేశంతో కాసేపు అతడిని ఘాటుగా విమర్శించింది.

తన తోటి నటుడిపైకి దూసుకెళ్లిన ప్రగతి

తన తోటి నటుడిపైకి దూసుకెళ్లిన ప్రగతి

అయితే పలు సినిమాలో చిన్న చిన్న పాత్రలు వేసే ఆ నటుడికి ప్రగతికి మధ్య ఎందుకు ఘర్షణ జరిగిందో కారణాలు తెలియరాలేదు. సాధారణంగా చాలా శాంతంగా కనిపించే ప్రగతి అలా కోపంతో ఊగిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే వారి మధ్య గొడవకు కారణాన్ని మాత్రం ఎవరు బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదు. దానిని అంతంటి ముగిద్దామని చెప్పడం కనిపించింది.

Recommended Video

Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
అర్ధరాత్రి కల్లా ఫలితాలు..

అర్ధరాత్రి కల్లా ఫలితాలు..

అయితే ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ 2 గంటలకు ముగియనున్నది. భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఈ ఓటింగ్ లెక్కించడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. ఈ అర్ధరాత్రికి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X