twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA Elections Results Live అధ్యక్షుడిగా విష్ణు మంచు గెలుపు.. వైస్ ప్రసిడెంట్‌గా శ్రీకాంత్ విజయం..అనసూయ జబర్దస్

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అత్యంత ఉద్రిక్తతలు, వాడివేడి కామెంట్ల మధ్య జరుగుతున్నాయి. పలువరు అగ్ర నటులు తమ ఓటు హక్కును ఉపయోగించుకొన్నారు. ఆదివారం ఉదయమే ఓటింగ్‌ ప్రారంభమైంది. పలువురు సినీ నటులు ఉదయాన్ని వచ్చి ఉత్సాహంగా ఓటు వేశారు. అయితే స్పల్ప ఘర్షణలు, గొడవలతో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నాయి. జూబ్లిహిల్స్‌లోని ప్రముఖ విద్యాసంస్థలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాల గురించి వివరాల్లోకి వెళితే..

    అధ్యక్షుడిగా విష్ణు గెలుపు.. వైస్ ప్రసిడెంట్‌గా శ్రీకాంత్ విజయం..

    అధ్యక్షుడిగా విష్ణు గెలుపు.. వైస్ ప్రసిడెంట్‌గా శ్రీకాంత్ విజయం..


    మా ఎన్నికల్లో ప్రసిడెంట్, వైస్ ప్రసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రసిడెంట్పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా మారింది. వైస్ ప్రసిడెంట్ ఎన్నిక కోసం మంచు విష్ణు ప్యానెల్‌లో బాబు మోహన్ బరిలో ఉండగా, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ పోటీలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్ విజయం సాధించినట్టు సమాచారం. ఇక అధ్యక్ష పదవి రేసులో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించినట్టు సమాచారం.

    మంచు విష్ణు ప్యానెల్‌లో

    మంచు విష్ణు ప్యానెల్‌లో

    మంచు విష్ణు ప్యానెల్‌లో జనరల్ సెక్రెటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివ బాలాజీ విజయం సాధించారు. జీవిత రాజశేఖర్‌పై రఘుబాబు ఏడు ఓట్లతేడాతో విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లోని నాగినీడుపై శివ బాలాజీ 32 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శివ బాలాజీకి 316 ఓట్లు రాగా, నాగినీడుకు 284 ఓట్లు వచ్చాయి.

    ఎవరెవరూ గెలించారంటే..

    ఎవరెవరూ గెలించారంటే..

    ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో పోటీ చేసిన జీవితపై రఘుబాబు 7 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో నలుగురు గెలుపు సాధించారు. అనసూయ, సురేష్ కొండేటి, కౌశిక్, శివారెడ్డి విజయం సాధించారు. మరో ఆరుగురు అధిక్యంలో ఉన్నారు. మంచు విష్ణు ప్యానెల్‌లో ఎనిమిది మంది విజయం సాధించారు. వారిలో మాణిక్, హరినాథ్, బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మీ, జయవాణి శశాంక్, పూజిత కార్యవర్గ సభ్యులు విజయం సాధించారు. మరో ఆరుగురు అధిక్యంలో ఉన్నారు.

    ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు

    ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు


    మా ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉత్కంఠను రేపుతున్నది. తాజా సమాచారం ప్రకారం ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో 12 మంది లీడింగ్‌లో ఉండగా, విష్ణు మంచు ప్యానెల్‌లో 6 గురు సభ్యులు లీడింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రతీ నిమిషానికి ఓట్ల లెక్కింపులో వ్యత్యాసాలు కనిపిస్తున్నట్టు సమాచారం. ఓ దశలో ప్రకాశ్ రాజ్ టీమ్ మెంబర్స్ అందరూ లీడింగ్‌లో ఉండటం గమనార్హం.

    600కి పైగా ఓటు హక్కును

    600కి పైగా ఓటు హక్కును

    మా ఎన్నికల్లో మొత్తం 900 మందికిపైగా సభ్యులు ఉన్నారు. అందులో 600 మంది ఓటు హక్కును ఉపయోగించుకొంటారని భావించారు. మధ్యాహ్నం నాలుగు గంటలకు పోలింగ్ పూర్తి అవుతుంది. రాత్రి 9 గంటల వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

    తుది ఫలితం ఎప్పుడంటే..

    తుది ఫలితం ఎప్పుడంటే..

    మా సంఘంలో మొత్తం 905 మంది సభ్యులు ఉండగా, అందులో 883 మంది చెల్లుబాటు అయ్యే ఓటర్లు ఉన్నారు. అందులో 605 మంది ఓట్లు వేయగా, 60 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. ఓట్ల లెక్కింపు 4 గంటల ప్రాంతంలో మొదలైంది. రాత్రి 9.30 తర్వాత ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉంది. చివరిగా ప్రసిడెంట్ ఓట్ల లెక్కింపు జరుగుతుందని పోలింగ్ అధికారులు తెలిపారు.

    కొత్త పార్టీ రావొచ్చు.. రేపు ఏదైనా జరుగవచ్చు..

    కొత్త పార్టీ రావొచ్చు.. రేపు ఏదైనా జరుగవచ్చు..


    మా ఎన్నికల్లో పోటీని తప్పుకోవడం నా ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకొన్నాను. నేను తీసుకొన్న నిర్ణయం మంచిదే. ఎవరైతే హామీలు చేశారో.. వారందరిని హామీలు పూర్తి చేసేలా పోరాటం చేస్తాను. భవిష్యత్‌లో అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. ఈ రెండు ప్యానెల్స్‌ను వదిలేసి.. మరో కొత్త ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తారా? లేక కొత్త యూనియన్ ప్రారంభిస్తారా అంటే. కొత్త పార్టీలు ఎన్ని రాలేదు.. రేపు ఏమైనా జరుగవచ్చు అంటూ కామెంట్ చేశారు.

    1 గంట వరకు 491 ఓట్లు

    1 గంట వరకు 491 ఓట్లు

    మా ఎన్నికల పోలింగ్ విషయానికి వస్తే.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు భారీగా పోలింగ్ నమోదైంది. 1 గంట వరకు పోలైన ఓట్లు 491 ఓట్లు అని ఎన్నికల అధికారులు వివరాలు అందజేశారు. సుమారు 550 నుంచి 600 వరకు ఓట్లు పోలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం సినీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది.

    హీరోయిన్ జెనీలియా ముంబై నుంచి

    హీరోయిన్ జెనీలియా ముంబై నుంచి

    మా ఎన్నికల్లో పాల్గొనేందుకు హీరోయిన్ జెనీలియా ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. విష్ణు మంచు ఆమెను స్వంత ఖర్చులతో రప్పించినట్టు సమాచారం. చాలా రోజుల తర్వాత జెనీలియా ముంబైకి వచ్చారు.

    శివబాలాజీ చేయి కొరికిన హేమ

    శివబాలాజీ చేయి కొరికిన హేమ

    మా ఎన్నికల పోలింగ్‌లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య భారీ వాగ్వాదం జరిగింది. ఓ దశలో భారీగా తోపులాట జరగడంతో ఒకరినొకరు నెట్టుకొన్నారు. ఆ క్రమంలో శివబాలాజీ చేతిని హేమ కొరకడం మీడియా కెమెరాలకు చిక్కింది. తనతో అభ్యంతరకరంగా వ్యవహరించడం వల్లే తాను ఇలా చేశాను అని హేమ వివరణ ఇచ్చింది.

    ఓటింగ్‌ కేంద్రాలకు అగ్ర నటులు

    ఓటింగ్‌ కేంద్రాలకు అగ్ర నటులు

    ఆదివారం ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఓటింగ్‌ ప్రక్రియ మొదలవ్వడానికి ముందు విష్ణు మంచు, ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, మంచు మనోజ్, రాంచరణ్ తదితరులు పోలింగ్ కేంద్రాలకు చేరుకొన్నారు. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్‌ను కౌగిలించుకొన్నారు. ఓ దశలో మోహన్ బాబు కాళ్లకు నమస్కరించడానికి ప్రకాశ్ రాజ్ ప్రయత్నించగా నిరాకరించారు.

    ఓటు హక్కు వినియోగించుకొన్న బాలకృష్ణ

    ఓటు హక్కు వినియోగించుకొన్న బాలకృష్ణ

    ఆదివారం ఉదయమే బాలకృష్ణ తన ఓటు హక్కును ఉపయోగించుకొన్నారు. మా అభివృద్దికి పాటుపడే ప్యానెల్‌కు ఓటు వేశాను. రెండు ప్యానెల్స్ కూడా మంచి పనులు చేస్తారనే అభిప్రాయం ఏర్పడింది అని బాలకృష్ణ అన్నారు.

    మీడియాపై చిరంజీవి సెటైర్లు

    మీడియాపై చిరంజీవి సెటైర్లు

    మా ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి రావడంతో మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా హడావిడి మొదలుపెట్టారు. చిరంజీవిని మాట్లాడించేందుకు ప్రయత్నించగా మీడియాపై సెటైర్లు విసిరారు.

    ప్రకాశ్ రాజ్‌కు ఓటు వేశా

    ప్రకాశ్ రాజ్‌కు ఓటు వేశా

    మెగా బ్రదర్ నాగబాబు ఓటు వినియోగించుకొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రకాశ్ రాజ్‌కు ఓటు వేశాను. ప్రజాస్వామ్యానికి ఓటు వేశాను అంటూ నాగబాబు స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ గెలుపుపై నాగబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

    నటి రోజా ఘాటైన కామెంట్లు

    నటి రోజా ఘాటైన కామెంట్లు

    అగ్రనటులు మా ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వివాదాలు చోటుచేసుకొన్నది. ఆ విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ఎన్నికల సమయంలో మంచి వాతావరణం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. 900 మంది సభ్యులు ఉన్న ఎన్నికలు వివాదాస్పదంగా మారడం బాధాకరం అని రోజా అన్నారు.

    నటి ప్రగతి వార్నింగ్

    నటి ప్రగతి వార్నింగ్


    ఇక ప్రగతి కూడా ఓ దశలో సహనం కోల్పోయింది. ఓ నటుడికి ప్రగతికి మధ్య గొడవ జరిగింది. అయితే ఆ నటుడిని ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచింది. చేయి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది. నువ్వేంది నాకు చెప్పేది అంటూ హెచ్చరించింది. అయితే ప్రగతి, ఆ నటుడికి మధ్య గొడవ పెద్దగా కావడంతో అక్కడే ఉన్న మిగితా నటులు అక్కడికి వచ్చి వారిని శాంత పరిచారు. అయినా ప్రగతి మాత్రం అదే ఆవేశంతో కాసేపు అతడిని ఘాటుగా విమర్శించింది.

    ఎంత న్యాయం చేస్తారో.

    ఎంత న్యాయం చేస్తారో.

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఎన్నికలు వచ్చాయి. నా ఓటును నేను వినియోగించుకొన్నాను. ఈ ఎన్నికల్లో ఎవరు నెగ్గినా వారికి ఓట్లు వేసిన వారికి ఎంత న్యాయం చేస్తారో.. ఓట్లు వేయని వారికి కూడా అంతే న్యాయం చేయాలి. తెలుగు సినీ పరిశ్రమకు, కళాకారులకు తగిన న్యాయం చేయాలి నటుడు నారాయణమూర్తి అన్నారు.

    నాన్ లోకల్ వివాదంపై నటుడు సుమన్

    నాన్ లోకల్ వివాదంపై నటుడు సుమన్

    మా ఎన్నికల్లో నాన్ లోకల్, లోకల్ అనే వివాదం రావడం చాలా దారుణం. రాష్ట్రం విడిపోయింది. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు ఉన్నారు. వారిని నాన్ లోకల్ అంటే తప్పు.. అలాంటి ఫీలింగ్ ఉండకూడదు. ఇక్కడ ఎవరైతే పుట్టలేదో నావాళ్లను నాన్ లోకల్ అనవచ్చు. కానీ అందరూ కలిసి మెలిసి ఉండాలి అని సుమన్ సూచించారు. తెలంగాణ, హైదరాబాద్‌లో మల్టీ నేషనల్ కంపెనీలు ప్రాంతాలకు అతీతంగా ఉద్యోగాలు ఇస్తున్నారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు, పట్టం కట్టాలి. పక్క రాష్ట్రం నుంచి వచ్చారని లోకల్ కాదంటే ఎలా? కన్నడ రాష్ట్రంలోని బెంగళూరులో చాలా మంది తెలుగు వాళ్లు పనిచేస్తున్నారు? రేపటి రోజున నాన్ లోకల్ అని వాళ్లను టార్గెట్ చేస్తే పరిస్థితి ఏమిటి? అని సుమన్ ప్రశ్నించాడు.

    రికార్డుస్థాయి ఓటింగ్

    రికార్డుస్థాయి ఓటింగ్


    మా ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్స్‌తో కలిపి మొత్తం 700 ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే 2 గంటల వరకు పోలింగ్ ఉండగా, దానిని 3 గంటల వరకు పొడిగించారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం ఫలితాలు 8.30 కల్లా వెల్లడయ్యే అవకాశం ఉంది.

    English summary
    MAA Elections voting is going at Hyderabad with tensious moment. Balakrishna Chiranjeevi, Pawan Kalyan voted in the morning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X