twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Maa Elections final list: సంపూర్ణేష్ బాబు, సుడిగాలి సుధీర్ ఘన విజయం.. మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల హడావుడి ఆదివారం రోజు ప్రశాంతంగా మొదలై సోమవారం ఉత్కంఠతో ముగిశాయి. గత నెల రోజుల నుంచి ఎన్నికల బరిలో నిలిచిన టువంటి కొంతమంది ప్రముఖ నటీనటులు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్యలో విమర్శల ఘాటు పెరుగుతూనే వచ్చింది. మొత్తానికి సోమవారం రోజున ఎన్నికల ప్రతినిధి పూర్తి ఓట్ల లెక్కింపు వివరాలను తెలియజేశారు. ఇక ఈ ఎన్నికల్లో చిన్న నటులు కొంతమంది పోటీకి నిలవడం విశేషం. అందులో సంపూర్ణేష్ బాబు సుడిగాలి సుదీర్ వంటి వారు కూడా ఉన్నారు.

     ఎన్నికల ఫలితాల అనంతరం..

    ఎన్నికల ఫలితాల అనంతరం..

    మా ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి చాలా సీరియస్ గా ముందుకు సాగడం విశేషం. ఎన్నికల బరిలో ప్రతి ఒక్కరు కూడా సాధారణ ఎన్నికలు తలపించేలా పోటీ చేయడం విశేషం. కేవలం మా లోని లోపాలను మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలపై కూడా కొందరు నిందలు వేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రం మళ్లీ ఎప్పటిలానే కలిసి పని చేయడానికి సిద్ధమని చెబుతున్నారు.

    ప్రకాష్ రాజ్ రాజీనామా

    ప్రకాష్ రాజ్ రాజీనామా

    ఇక ఎన్నికల్లో ఫలితాలపై కొందరు ఏమాత్రం సంతృప్తిగా లేరు. మంచు విష్ణు లోకల్ నాన్ లోకల్ బేధాన్ని చూపుతూ గెలిచాడు అని కొందరు కబోర్డ్ చేస్తున్నారు ఇక ప్రకాష్ రాజ్ ఇప్పటికే మా సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు వంద ఓట్లకు పైగా తేడాతో గెలిచారు. MAA అధ్యక్షుడు మంచు విష్ణుకు 383 ఓట్లు రాగా ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు వచ్చాయి.

     మిగతా వారికి వచ్చిన ఓట్లు..

    మిగతా వారికి వచ్చిన ఓట్లు..

    జనరల్ సెక్రటరీ రఘు బాబు 341 ఓట్లు రాగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ 375 ఓట్లను అందుకొని మొదటి విజయం అందుకున్నారు. ఇక జాయింట్ సెక్రటరీస్ ఉత్తేజ్ కు 333 ఓట్లు రా గౌతమ్ రాజుకు 322 ఓట్లు వచ్చాయి. వైస్ ప్రసిడెంట్స్ మాదాల రవి (376 ఓట్లు) మరియు బెనర్జీ (298 ఓట్లు) ట్రెజరర్: శివ బాలాజీ 360 ఓట్లను అందుకున్నారు.

    సుడిగాలి సుధీర్ ఘన విజయం

    సుడిగాలి సుధీర్ ఘన విజయం

    ఇక ఎన్నికల్లో మొదటిసారి చిన్నతరహా నటీనటులకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా అవకాశం ఇచ్చారు. ఇక మంచు విష్ణు పదం నుంచి 10 మంది గెలవగ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎనిమిది మంది గెలిచారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్లో అవకాశం అందుకున్నటువంటి సుడిగాలి సుధీర్ 279 ఓట్లను అందుకని మొదటి గెలుపును అందుకున్నాడు.

     సంపూర్ణేష్ బాబు సక్సెస్

    సంపూర్ణేష్ బాబు సక్సెస్

    ఇక మంచు విష్ణు ఫ్యామిలీ తో మంచి అనుబంధం ఉన్నటువంటి సంపూర్ణేష్ బాబు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఘన విజయాన్ని అందుకున్నాడు. 285 కోట్లను అందుకని సంపూర్ణేష్ బాబు మా ఎలక్షన్స్ లో మొదటి సారి తన సత్తా చాటాడు. మొదటి నుంచి కూడా సంపూర్ణేష్ బాబు మంచు విష్ణు కు మద్దతు పలుకుతూ వస్తున్నాడు.

    Recommended Video

    Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
    ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కు వచ్చిన ఓట్లు

    ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కు వచ్చిన ఓట్లు

    మొత్తం 18 పోస్టులు ఉండగా.. మంచు విష్ణు ప్యానెల్ 10 పోస్టులను గెలుచుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ 8 పోస్టులను గెలుచుకుంది.

    శివారెడ్డి - 362 ఓట్లు
    గీతా సింగ్ - 342 ఓట్లు
    అశోక్ కుమార్ - 336 ఓట్లు
    బ్రహ్మాజీ - 334 ఓట్లు
    శ్రీలక్ష్మి - 330 ఓట్లు
    సి మాణిక్ - 326 ఓట్లు
    ప్రభాకర్ - 319 ఓట్లు
    తనీష్ - 306 ఓట్లు
    శ్రీనివాసులు - 296 ఓట్లు
    హరనాథ్‌బాబీ - 296 ఓట్లు
    సురేష్ కొండేటి - 294 ఓట్లు
    ఎన్. శివన్నారాయణ - 290 ఓట్లు
    సంపూర్ణేష్ బాబ్ - 285 ఓట్లు
    శశాంక్ - 284 ఓట్లు
    సమీర్ - 282 ఓట్లు
    సుడిగాలి సుధీర్ - 279 ఓట్లు
    బొప్పన విష్ణు - 271 ఓట్లు
    కౌశిక్ - 269 ఓట్లు

    English summary
    Maa elections final result Sudigali Sudheer total votes list,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X