twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీసులను కలిసా...సంస్కారం లేదు: నటి హేమ ఫైర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : రాజేంద్రప్రసాద్ ప్యానల్ సభ్యుడు, నటుడు శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించారని సినీ నటి హేమ ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని దర్శకరత్న దాసరి నారాయణరావుని కలిశానని ఆమె ఆదివారం తెలిపారు. తనకు క్షమాపణ చెప్పేంత సంస్కారం శివాజీరాజాకు ఉందని అనుకోవటం లేదని హేమ అన్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి శనివారం వెళ్లిన సంగతి నిజమేనన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    తనపై వ్యక్తిగతంగా దూషణలు చేసినందుకే శివాజీ రాజాపై ఫైర్ అవ్వాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా శివాజీ రాజా నటుడు రాజేంద్రప్రసాద్ కి మద్దతిస్తున్నారన్న విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికల మాదిరిగానే సినీ ఎన్నికల నేపథ్యంలో వ్యక్తిగత దూషణలు చేసుకోవడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోనుచేస్తుంది.

    అందువల్ల ఇంట గెలిచి రచ్చ గెలవాలని శివాజీ రాజాపై తాను స్పందించాల్సి వచ్చిందని హేమ పేర్కొన్నారు. 'మా' తరపున నాగేంద్రబాబు బిల్డింగ్ కొన్న విషయంపై నేను మాట్లాడాను. ప్రస్తుతం ఆ బిల్డింగ్ అమ్మితే రూ.30 లక్షలు కూడా రావని తాను చెప్పానన్నారు. దాంతో హేమకు మాట్లాడటం రాదు, ఆమెకు ఏం తెలియదని శివాజీ రాజా వ్యాఖ్యానించడం సంస్కారం కాదన్నారు.

    Maa elections: Hema fire on Artist Sivaji raja

    శివాజీ రాజా వెర్షన్...

    నటి హేమ తనపై చేసిన వ్యాఖ్యలు తన విజ్ఞతకే వదిలేస్తున్నానని నటుడు శివాజీ రాజా అన్నారు. ఆమె కంట్రోల్ లో ఉంటే బావుంటుందని అన్నారు. మా ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ తరుపున పోటి చేస్తున్న ఆయన ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి మాట్లాడాల్సిన అవసరం హేమకు ఏముందని ప్రశ్నించారు. వీలుంటే మంచి చేయాలని హితవు పలికారు.

    వారు ఓడిపోతారనే భయంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హేమ మీపై ఎన్నికల అనంతరం చర్యలు తీసుకుంటారని అంటున్నారుగా అని ప్రశ్నించగా వారు ఏ చర్యలైనా తీసుకోవచ్చని, తాను తాటాకు చప్పుళ్లకు భయపడనని అన్నారు. తాను గొప్ప పోరాటయోధుడినని తెలిపారు.

    రాజేంద్ర ప్రసాద్ ను ఒంటరి చేయడం ఇష్టం లేకే ఓడిపోయినా సరే ఎన్నికలకు వచ్చానని అన్నారు. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని.. ఏదైనా ఉంటే కెమెరా ముందు నటించాలేగానీ, కెమెరా వెనుక వద్దని చెప్పారు. ఎన్నికల ప్రభావం సినిమాలో నటించడంపై పడబోదని స్పష్టం చేశారు.

    మరో ప్రక్క మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో కొనసాగుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 2గంటల వరకు జరగనుంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ల ద్వారా పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జయసుధ,రాజేంద్రప్రసాద్, మురళిమోహన్,సుమన్ వంటివారు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

    తెలుగు మూవీ ఆర్టిస్టుల సంఘంలోని 702 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 'మా' అధ్యక్ష పదవి ఎన్నికపై సినీ పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల ఆసక్తి నెలకొంది. అధ్యక్ష పదవి రేసులో నటుడు రాజేంద్రప్రసాద్‌, నటి జయసుధతో పాటు బొమ్మరిల్లు ధూళిపాళ్ల అనే మరో నటుడు ఉన్నారు. మా ఎన్నికల నిర్వహణ న్యాయస్థానం పరిధిలోకి చేరినందువల్ల ఇవాళ పోలింగ్‌ మాత్రమే జరుగుతుంది. ఫలితాలు కోర్టు తుది తీర్పు తర్వాత వెల్లడయ్యే అవకాశముంది.

    జయసుధ, రాజేంద్రప్రసాద్‌ ప్యానెళ్ల మధ్య హోరీహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్‌ జరగనుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఉన్న కోర్టు ఆదేశాల మేరకు నేడు కౌంటింగ్‌ ఉండదు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సార్వత్రిక ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికలపై సినీ జనాలతోపాటు సామాన్యులు కూడా ఆసక్తి పెంచుకున్నారు.

    English summary
    Artist Hema fire on Sivaji Raja for Maa elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X