twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మా' ఎన్నికలు: ఓటమిని జయసుధ ముందే ఊహించారా?

    By Pratap
    |

    హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రముఖ సినీ నటి జయసుధ ముందే ఊహించారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఓటమిని పసిగట్టడం వల్లనే ఆమె ఓట్ల లెక్కింపునకు హాజరు కాలేదనే ప్రచారం సాగుతోంది. ఆమె తరపున ఆమె సమీప బంధువు, ప్రముఖ సినీ నటుడు నరేష్ హాజరయ్యారు.

    గురువారంనాడు ఓట్ల లెక్కింపు జరిగిన ఫిలిం ఛాంబర్ వైపు ఆమె కన్నెత్తి చూడలేదు. లెక్కింపు ప్రారంభమైన తర్వాత ప్రతి రౌండ్‌లోనూ జయసుధపై అధ్యక్ష పదవికి పోటీ చేసిన రాజేంద్రప్రసాద్ ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు.

    MAA elections: Jayasudha expected her defeat?

    ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు నరేష్ అక్కడే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ జయసుధపై 85 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. మా ఎన్నికలు ఈసారి వేడిగా జరిగాయి. సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో జరిగాయి.

    ఆరోపణలు, ప్రత్యారోపణలతో మా ఎన్నికలు వేడిగా సాగాయి. మా ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మురళీ మోహన్ ప్యానెల్ తరఫున జయసుధను అధ్యక్ష పదవికి పోటీకి దించారు. దాంతో వాతావరణం వేడెక్కింది.

    English summary
    It is said that Jayasudha, who contested aginst Rajendra Prasad, expected the end result of MAA elections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X