For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MAA అధ్యక్షపదవికి జీవితా రాజశేఖర్ పోటి?.. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు‌కు సవాల్.. జోరుగా పవర్ పాలిటిక్స్‌!

  |

  టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రత్యక్ష రాజకీయాలను తలదన్నేలా కనిపిస్తున్నాయి. మా ఎన్నికల అంశం తెరపైకి రాగానే పలువురు లాబీయింగ్‌తో ఎన్నికల వేడి పుట్టించారు. ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు కొత్త కొత్త పేర్లు అనూహ్యంగా తెరపైకి రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా టాలీవుడ్‌లో చోటు చేసుకొంటున్న అనూహ్యమైన పరిణామాలు ఏమిటంటే.

  పవర్ ఫుల్‌గా ఎన్నికల ప్రక్రియ

  పవర్ ఫుల్‌గా ఎన్నికల ప్రక్రియ

  టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గంలో చోటు సంపాదించాలని ఎందరో కలలు కనడం సహజం. భారీ మొత్తంలో ఆదాయం, నిధులు, పవర్‌ఫుల్‌గా ఉండే పదవి ఇలాంటి అంశాలు ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. గత ఎన్నికల్లో మా కార్యవర్గం ఎన్నికలు గందరగోళ పరిస్థితుల మధ్య జరగడం, అంతేకాకుండా వివాదాస్పదం కూడా అయ్యాయి.

  మెగా మద్దతు కోరిన ప్రకాశ్ రాజ్

  మెగా మద్దతు కోరిన ప్రకాశ్ రాజ్


  ఇప్పటికే పదవి కాలం ముగిసిన మా కార్యవర్గం స్థానంలో కొత్తగా కార్యవర్గాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికలకు తెరలేపారు. దీంతో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ముందే మేలుకొన్నాడు. తాను అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్టు సంకేతాలు వదిలారు. ఎవరూ మేలుకోక ముందే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, ఇతర ప్రముఖులను కలిసి మద్దతును ఆశించారు.

  మంచు విష్ణు బరిలోకి..

  మంచు విష్ణు బరిలోకి..

  అలాగే మా అధ్యక్ష పదవి రేసులోకి మంచు విష్ణు బరిలోకి దిగుతున్నట్టు ప్రత్యక్షంగానే వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణను కలిసి మంతనాలు జరిపారు. గతంలో మా ఉపాధ్యక్షుడిగా మంచు విష్ణుకు పనిచేసిన అనుభవం ఉంది. దాంతో ఈ సారి అధ్యక్ష పదవికి పోటీపడాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. ఇలా మా ఎన్నికలు ముఖాముఖి పోటీగా మారుతుందనే అందరూ అనుకొంటుండగా నటి, దర్శకురాలు, నిర్మాత జీవితా రాజశేఖర్ తాను బరిలో ఉన్నట్టు సంకేతాలు పంపారు.

  అనూహ్యంగా జీవితా రాజశేఖర్ పేరు తెరపైకి

  అనూహ్యంగా జీవితా రాజశేఖర్ పేరు తెరపైకి


  ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటికి సిద్దం కాగా, జీవితా రాజశేఖర్ పేరు తెరపైకి రావడంతో ఈ పోటీ ముక్కోణపు పోటీగా మారింది. గతంలో జీవితా రాజశేఖర్‌కు మా సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. అధ్యక్ష పదవిలో తాను ఉంటే ఇంకా ఎక్కువగా సభ్యులకు సేవ చెయ్యగలననే ధీమాను ఆమె వ్యక్తం చేస్తున్నట్టు సన్నిహితులు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మహిళా సినీ ప్రముఖురాలు ప్రెసిడెంట్‌గా పోటీపడితే ఈ సారి ఎన్నికలు చాలా వేడివాడిగా మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

  Bigg Boss Telugu Season 5 Update: Payal Rajput In BiggBoss 5 Telugu ? | Filmibeat Telugu
  గత హయాంలో కుమ్ములాటలతో

  గత హయాంలో కుమ్ములాటలతో


  గత హయంలో మా లో జరిగిన కుమ్ములాటలు, పరస్పర ఆరోపణలు, నిధుల్లో అక్రమాలు తదితర అంశాలు ఆ సంఘానికి ఉన్న ప్రతిష్టను మసకబారేలా చేశాయి. మా కార్యవర్గంలో ఉన్నత పదవులు చేపట్టిన కొందరు చవకబారు ఆరోపణలు చేసుకొంటూ మీడియాలో ఎక్కడం అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజా మా ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

  English summary
  Movie Artist Association (MAA) Elections to held soon. Report suggest that Actress Jeevitha Rajasekhar to contest President against Prakash Raj and Manchu Vishnu. Already Prakash raj seek support from Chiranjeevi, Nagababu and others
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X