MAA Elections..విష్ణు తప్పు చేస్తున్నావు? నీలాంటోడు గెలిస్తే ‘మా’ పరిస్థితి ఏంటి? ‘మంచు’ను ఉతికి పారేసిన ..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులందరికి విన్నపం చేస్తూ నాగబాబు వీడియో రిలీజ్ చేశారు. మా ఎన్నికల విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్రకాశ్ రాజ్‌కు ఓటు వేయాలా? విష్ణు మంచుకు ఓటు వేయాలా? అనే విషయంపై మా సభ్యుల్లో కొందరికి అనుమానాలు ఉన్నాయి అంటూ వీడియోలో తన అభిప్రాయాలను షేర్ చేసుకొన్నారు. తాజా వీడియో ప్రకారం నాగబాబు మాట్లాడుతూ..

ప్రకాశ్ రాజ్‌కు ఎందుకు ఓటు వేయాలంటే
ప్రకాశ్ రాజ్‌కు ఓటు ఎందుకు వేయాలంటే.. కింద నుంచి పైకి వచ్చాడు. ఊరూరు తిరిగి నాటకాలు ఆడారు. నటుల కష్టాలు కన్నీళ్లు తెలుసు. అవకాశాల కోసం స్టూడియోల చుట్టు, ఆఫీసుల చుట్టూ తన కలలను కళ్లలో పెట్టుకొని, మనిషంతా టాలెంట్ పెట్టుకొని, పొట్ట చేతపట్టుకొని తిరిగాడు. కాబట్టి అవకాశాల అవసరాలు తెలుసు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. అన్ని భాషల్లో నటిస్తూ.. మన పరిశ్రమకు ఏం కావాలో తెలుసు అని నాగబాబు అన్నారు. తన భాష కాకపోయినా.. తప్పు మాట్లడకూడదనే ఇంగిత జానం తెలుసు. ప్రపంచ సాహిత్యం తెలుసు. ప్రపంచ సినిమాను చదివాడు. సంఘం విలువ తెలుసు. ఒక్కడే పోరాటం చేయడం తెలుసు అని ప్రకాశ్ రాజ్ గురించి తెలిపారు.

ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అయితే?
ప్రకాశ్ రాజ్‌ను నాన్ లోకల్ అంటూ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. మా అంటే తెలుగు ఆర్టిస్టుల అసోసియేషనా? లేక మూవీ ఆర్టిస్టుల అసోసియేషనా? మా అంటే తెలుగు సినిమా ఆర్టిస్టుల అసోసియేషన్. అందులో ప్రకావ్ రాజ్ నటిస్తున్నాడు. వివిధ భాషలు పక్కన పెడితే తెలుగులోనే ప్రకాశ్ రాజ్ ప్రతీ ఏటా 25 సినిమాలు నటించిన సందర్భాలు ఉన్నాయి. నీవు కేవలం నీ కెరీర్‌లో 25 సినిమాలు చేసి ఉంటావు అని నాగబాబు తెలిపారు.

మిమల్మి గెలిపించాలి? కానీ ఆయన గెలువవద్దా
ప్రకాశ్ రాజ్ పోటీ చేయవద్దంటే.. ఇది తెలుగు నటుల అసోసియేషన్ అంటారా? తెలుగులో సినిమాల్లో నటించే వారి అసోసియేషన్ కాదా? అయితే ప్రకాశ్ రాజ్‌కు ఎందుకు సభ్యత్వం ఇచ్చారు. ఆయన డబ్బులు తీసుకొన్నారు కదా.. ఆయన ఓటు హక్కు కావాలి? ఆయన డబ్బులు కావాలి కానీ పోటీ చేయవద్దా? ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరికి ఓటు వేసే హక్కు ఉంటుంది? పోటీ చేసే హక్కు ఉంటుంది. మిమ్మల్ని గెలిపించడానికి పనికి వస్తాడు కానీ గెలవడానికి పనికి రాడా అని నాగబాబు స్పష్టం చేశారు.

నీలాంటోడు గెలిస్తే.. పరిస్థితి ఏంటో
అసోసియేషన్‌లో తోటి సభ్యుడి మీద ఉన్న గౌరవం ఇదేనా? నీలాంటోడు గెలిస్తే అసోసియేషన్ పరిస్థితి ఏంటి? విష్ణు తప్పు చేస్తున్నావు? తెలుగు సినిమా పోషించింది? తెలుగు సినిమా నన్ను గుర్తించింది. నేను ఇక్కడే ఉంటాననని ఒకడు నమ్మి బతుకుతుంటే.. తెలుగు కళామతల్లికి సేవ చేసే అవకాశం ఇవ్వమంటే.. నీవు కావు పో అంటూ వేరు చేయడం మానవత్వమేనా? మనం మనషులమేనా అంటూ నాగబాబు ఘాటుగా స్పందించారు.

నాన్ లోకల్ అంటే మద్రాస్‌లో పరిస్థితి ఏంటి?
తెలుగు సినిమా పరిశ్రమ 60 ఏళ్లు మద్రాసులో ఉంది. వాళ్లు నాన్ లోకల్ అంటే పరిశ్రమ ఇలా ఉండేదా? 1950లో నడిగర సంఘం పెడితే.. 1956లో మహా నటుడు చిత్తూరు నాగయ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1959లో మన అంజలి దేవి అధ్యక్షరాలు అయ్యారు. మనం ఎక్కడున్నాం? ఏమై పోతున్నాం అని నాగబాబు ప్రశ్నించారు. అంటే సంఘం విడిపోయిందని సాకులు చెప్పుతారా? ప్రకాశ్ రాజ్ మన నుంచి విడిపోయాడా అని ఘాటుగా స్పందించారు.


Click it and Unblock the Notifications











