విష్ణు ఎక్కడ పుట్టావు? నీవు తెలుగోడివేనా? తెలుగు భాషపై నీకు పరీక్ష పడితే.. మంచు ఫ్యామిలీపై నాగబాబు ఫైర్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో సంచలనాలు చోటుచేసుకొంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వివాదాస్పదంగా, ఘాటైన పదజాలంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్, విష్ణు మంచు ప్యానెల్ విమర్శనాస్త్రాలు సంధించుకొంటున్నాయి. తాజాగా పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి మంచు విష్ణు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగబాబు విరుచుకుపడ్డారు. మంచు ఫ్యామిలీని ఏకిపారేస్తూ నాగబాబు ఘాటుగా ఎలా స్పందించారంటే..

దేశ ప్రధానినే ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్

దేశ ప్రధానినే ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్

దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్. కెరీర్ పరంగా గానీ, లేదా ఆలోచనపరంగా కానీ ఆయనకు ఉన్న ప్రత్యేకతలు కొంచెం కూడా విష్ణు మంచులో కానరావు. ఒకవేళ ప్రకాశ్ రాజ్‌ను పోల్చాలంటే మోహన్ బాబుతో పోల్చాలి. ప్రకాశ్ రాజ్‌తో మంచు విష్ణు పోల్చుకోవడం ఏమిటి అని నాగబాబు ప్రశ్నించాడు.

నిర్మాతలతో మంచు ఫ్యామిలికి వివాదాలు

నిర్మాతలతో మంచు ఫ్యామిలికి వివాదాలు


విద్యార్థులకు ఏం కావాలో అనే విషయాన్ని అడిగితే ప్రతిష్టాత్మకంగా విద్యాసంస్థ నడుపుతున్న మోహన్‌బాబుకు తెలుసు. నటీనటులకు ఏం కావాలో అని అడిగితే.. ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రకాశ్‌రాజ్‌కే తెలుసు. నిర్మాతలతో ప్రకాశ్ రాజ్‌కు వివాదం ఉందని ఆరోపణలు చేయడం సరికాదు. నిర్మాతలతో వివాదాలు మోహన్ బాబు కుటుంబానికి కూడా ఉన్నాయి అని నాగబాబు ఘాటుగా స్పందిచాడు.

వైవీఎస్ చౌదరీని అధోగతి పట్టించిన మోహన్ బాబు

వైవీఎస్ చౌదరీని అధోగతి పట్టించిన మోహన్ బాబు

మోహన్ బాబు కుటుంబానికి పలువురు నిర్మాతలకు వివాదాలు ఉన్నాయనేది కాదనలేని వాస్తవం. సలీం చిత్రం విషయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరినే మోహన్ బాబు అధోగతి పట్టించారనేది అందరికి తెలిసిందే. మోహన్ బాబుకు ఎదురు తిరగలేక ఎంతో మంది నిర్మాతలు వెనుతిరిగారు. మీ వివాదాల్లో తప్పెవరితో మాకు తెలియదు, నిర్మాతలతో ప్రకాశ్ రాజ్‌కు ఉన్న వివాదాల్లో తప్పెవరితో మీకు తెలియదు మెగా బ్రదర్ నాగబాబు అన్నారు.

విష్ణు నీవు ఎక్కడ పుట్టావు అంటూ ఘాటుగా నాగబాబు

విష్ణు నీవు ఎక్కడ పుట్టావు అంటూ ఘాటుగా నాగబాబు


ఇక విష్ణు మంచుపై నాగబాబు ఘాటుగా స్పందించారు. విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ చదువుకున్నావు? మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు అనే విషయం నీవు గుర్తుపెట్టుకోవాలి. ఇతరులను తెలుగు వాడు కాదని విమర్శలు చేసే ముందు నీ గురించి ఆలోచిస్తే ఆ విషయం ఏమిటో అర్ధమవుతుంది అని నాగబాబు చురకలు అంటించారు.

ప్రకాశ్ రాజ్‌కు, నీకు పరీక్ష పడితే..

ప్రకాశ్ రాజ్‌కు, నీకు పరీక్ష పడితే..


ప్రకాశ్ రాజ్‌ను తెలుగు వాడు కాదు.. తెలుగు రాష్ట్రేతర వ్యక్తి అంటూ ఆరోపణలు చేయడంపై నాగబాబు తప్పుపట్టారు. ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు తెలుగు పరీక్ష రాస్తే విష్ణుకు పాస్ మార్కులు కూడా రావు అంటూ చురకలు అంటించారు. తెలుగు భాష మాట్లాడే తీరు చూస్తే ప్రకాశ్ రాజ్‌ని తెలుగు వాడంటరు, విష్ణు భాషను చూస్తే తెలుగు నేర్చుకొమ్మని అంటారు అని మంచు విష్ణును నాగబాబు కడిగిపడేశారు.

ప్రకాశ్ రాజ్‌కే నా ఓటు, ఆ ప్యానెల్‌కే నా మద్దతు

ప్రకాశ్ రాజ్‌కే నా ఓటు, ఆ ప్యానెల్‌కే నా మద్దతు


భాష పేరిట ఒకరిపై దాడి చేయడం సరికాదు అంటూ నాగబాబు తీవ్రంగా స్పందించారు. సినిమా జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఉన్న ప్రకాశ్‌రాజ్ కే నా మద్దతు. సినీ నటుల సంక్షేమం గురించి తెలిసిన ఆయనకు ఓటు వేసి గెలిపించండి. ఆయన ప్యానెల్‌లోని సభ్యులకు ఓటు వేసి మా అసోసియేషన్‌కు సహకారం అందించండి అంటూ నాగబాబు తాజాగా వీడియో బైట్‌ను రిలీజ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X