'మా' ఎన్నికలు: మురళీ మోహన్‌పై నాగబాబు విజయమా?
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు నాగబాబు మద్దతు ఇచ్చి రాజేంద్ర ప్రసాద్‌ను గెలిపించారు. రాజేంద్ర ప్రసాద్ వెంట నాగబాబు నామినేషన్ వేసినప్పటి నుంచి చివరి దాకా నించున్నాడు. ఆయన పెద్దగా హంగామా చేసిందేమీ లేదు గానీ స్థిరమైన మద్దతు ఇచ్చారు.
నాగబాబు మద్దతు ఇవ్వడంతో వెనక మెగాస్టార్ చిరంజీవి ఉన్నారనే ప్రచారం కూడా సాగింది. అయితే, వాటిని నాగబాబు పట్టించుకున్నట్లు కనిపించలేదు. మా ఎన్నికల్లో పరస్పరం విమర్శలు చేసుకుంటున్న సమయంలోనూ ఆయన పెద్దగా ముందుకు రాలేదు. మౌనంగానే మార్పునకు ఆయన నాంది పలికినట్లు కనిపిస్తున్నారు.

రాజేంద్ర ప్రసాద్ తన ప్యానల్‌తో కలిసి మురళీమోహన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దానికి ప్రతిగా జయసుధ తదితరులు జవాబు ఇచ్చారు. దానితో ఆగకుండా మురళీ మోహన్ ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.
మా తరఫున తాను చేసిన పనులను ఆయన ఆ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అయినా, మురళీ మోహన్ జయసుధను గెలిపించలేకపోయారు. ఆ విషయంలో నాగబాబు విజయం సాధించారు.


Click it and Unblock the Notifications











