మేమూ గెలిచాం, జయసుధ లేట్‌గా వచ్చారు: నటుడు నరేష్
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సినీ నటుడు నరేష్ స్పందించారు. జయసుధ ప్యానెల్ తరఫున పోటీ చేసిన నరేష్ మా సంయుక్త కార్యదర్శిగా విజయం సాధించారు. తామ ప్యానెల్ కూడా విజయం సాధించిందని ఆయన చెప్పారు.
జయసుధ ఎన్నికల బరిలోకి ఆలస్యంగా దిగారని, ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొనలేదని ఆమె ఓటమిపై స్పందిస్తూ అన్నారు. పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకత ఎదురు కావడం సహజమేనని, మా ఎన్నికల్లో కూడా అది పనిచేసిందని ఆయన అన్నారు.

పోటీ అనారోగ్యకర పరిణామం కాదని నరేష్ అభిప్రాయపడ్డారు. విజయం సాధించిన రాజేంద్ర ప్రసాద్‌ను ఆయన అభినందించారు. అంతా మా విజయమేనని ఆయన అన్నారు. తమ ప్యానెల్ తరఫున చాలా మందిమి గెలిచామని ఆయన అన్నారు.
మాలో వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకోకుండా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు. మురళీ మోహన్‌పై వ్యతిరేకత జయసుధపై పడిందనే వాదనను ఆయన అంగీకరించలేదు. చివరి నిమిషంలో జయసుధ వచ్చారని, ప్రచారంలో ఎక్కువగా పాల్గొనలేదని ఆయన అన్నారు. ఓట్ల లెక్కింపునకు జయసుధ గైర్హాజరు కాగా, నరేష్ హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











