MAA Elections: పోస్టల్ బ్యాలెట్‌లో మంచు ప్యానెల్ దుర్వినియోగం.. అసహ్యంగా అంటూ ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం గందరగోళంగా మారుతున్నది. ఎన్నికల తేదీ సమీపిస్తుండగా ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు ప్యానెల్స్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ విషయంలో మంచు విష్ణు ప్యానెల్ దుర్వినియోగం జరుపుతున్నారని ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో అడ్డదార్లు తొక్కుతున్నారు. ఈ విషయం క్రమశిక్షణా సంఘం తగు చర్యలు తీసుకోవాలని ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్యానెల్ సభ్యులు జీవిత, శ్రీకాంత్, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..

పోస్టల్ బ్యాలెట్ వేయాలంటే..
ప్రస్తుతం జరుగుతున్న మా ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా 65 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్‌కు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఇవ్వాలని ఎన్నికల అధికారి సూచిస్తే.. అందుకు సంతోషం వేసింది. అయితే ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలను కొంటే వారు ఎన్నికల అధికారికి లేఖ రాసి అనుమతి తీసుకోవాలి. వారికి పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల నిర్వాహకులు పంపిస్తే.. వారు సంతకం చేసి పోస్టులో బ్యాలెట్ పంపించాలనే నిబంధనను అమలు చేయాలని నిర్ణయించారు అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

సీనియర్ సిటిజన్‌కు ఫోన్ చేస్తే
అయితే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకొనేందుకు 500 రూపాయలు చెల్లించుకోవాలి. పోస్టల్ ఖర్చుల నిమిత్తం ఆ మొత్తాన్ని వినియోగించుకొంటారు. ఆ విషయం గురించి తెలియజేయడానికి ఓ సీనియర్ సిటిజన్‌కు ఫోన్ చేస్తే.. అప్పటికే విష్ణు మంచు వాళ్లు వచ్చి సంతకం తీసుకొని వెళ్లారని చెబితే మేమంత షాక్‌కు గురయ్యాం. దాంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకొంటామని చెప్పారు అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

ఒకే కవర్‌లో 60 మంది బ్యాలెట్స్
అయితే ఇటీవల దాదాపు 60 మంది సీనియర్ సిటిజన్లకు మొత్తం 500 చొప్పున మంచు విష్ణు మనిషి వచ్చి కట్టారు. ఇకే కవర్‌లో పోస్టల్ బ్యాలెట్లు పంపారు. ఇది ఈ నిబంధనలకు విరుద్ధం. ఏకంగా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు కృష్ణం రాజు, మహేష్ బాబు తండ్రి ఘట్టమనేని కృష్ణ, శారద, పరుచూరి బ్రదర్స్ లాంటి ప్రముఖులకు కూడా మంచు విష్ణు వర్గం 500 రూపాయలు కట్టారు. ఇది సమంజసమేనా అంటూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.

50 ఓట్లకు డబ్బు చెల్లించారంటూ..
పోస్టల్ బ్యాలెట్‌ను దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విష్ణు మంచు వర్గంపై నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీనియర్ సిటిజన్ పేరున పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఎలా 500 కడుతారు. ఒకటి కాదు.. రెండు కాదు.. 50 ఓట్లకు వాళ్లు డబ్బు చెల్లించారు. చిరంజీవి, నాగబాబు, మహేష్ బాబు, కృష్ణం రాజు, మురళీ మోహన్ రావుకు విన్నవిస్తూ ఇది న్యాయమా.
ఈ విషయంపై మీరు స్పందించాల్సిందే అంటూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. మీ ఎజెండాను, మీరు చేసే కార్యక్రమాలను చెప్పి ఓట్లు వేయించుకొండి. కానీ ఇలా అడ్డదారిలో గెలువడానికి ప్రయత్నించకండి అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పారు.
Recommended Video

పోస్టల్ బ్యాలెట్‌లో దుర్వినియోగం
పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం చేశారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. మంచు విష్ణు ప్రొడక్షన్ ఆఫీసులో పనిచేసే మేనేజర్ వచ్చి 60 మందికి డబ్బు కట్టారు. మేము ఫిర్యాదు చేస్తే ఆ వ్యక్తి వెనుకకు తీసుకెళ్లారు. ఇలా అసహ్యంగా, అన్యాయంగా ఎన్నికలు జరుపుకొంటారా? ఓ పోటీదారుడు 28 వేల రూపాయలు కట్టడం ఎన్నికల నిబంధనలు విరుద్ధం అని ప్రకాశ్ రాజ్ చెప్పారు. మా ఫిర్యాదుపై విచారణ చేపడుతామని ఎన్నికల అధికారి చెప్పారని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











