twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA ఎన్నికల ఫలితాలు మారనున్నాయా? సీసీటీవీ ఫుటేజ్‌లో అసలు గుట్టు.. ప్రకాశ్ రాజ్ పట్టు.. అధికారి తిరకాసు!

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి విజేతలు ప్రమాణా స్వీకారం చేసినా వివాదాలు నిప్పు రాజుకొంటూనే ఉంది. ఓటమి పాలైన ప్రకాశ్ రాజ్ ఎన్నికలల్లో జరిగిన అవకతవకలను బయటపెట్టడానికి చాప కింద నీరులా వ్యూహాన్ని అమలు పరుస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో సీసీ టీవీ ఫుటేజ్‌ వ్యవహారం అత్యంత ఆసక్తికరం మారుతున్నాయి. అయితే సీసీటీవీ ఫుటేజ్‌లో ఏం దాగి ఉన్నది? ప్రకాశ్ రాజ్ ఎందుకు పట్టుబడుతున్నారు? ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఎందుకు నిరాకరిస్తున్నారనే విషయాలు అత్యంత వివాదాస్పదంగా కనిపిస్తున్నాయి. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

    రాత్రి ఓట్ల లెక్కింపు వాయిదా

    రాత్రి ఓట్ల లెక్కింపు వాయిదా

    మా ఎన్నికలకు సంబంధించి ఫలితాలను రాత్రి వాయిదా వేశారు. అధ్యక్ష పోటీలో ఉన్న ప్రకాశ్ రాజ్‌కు, విష్ణు మంచుకు మాట రూపంలో చెప్పి ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా వేశాను. ఆఫీస్ బేరర్ ఫలితాలను ప్రకటించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీ ఎన్నికల ఫలితాలను నిలిపివేశాను. మరుసటి రోజు లెక్కిస్తామని ఎన్నికల అధికారి చెప్పినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

    బ్యాలెట్ బాక్సులు ఇంటికి అంటూ ఆరోపణలు

    బ్యాలెట్ బాక్సులు ఇంటికి అంటూ ఆరోపణలు

    అయితే ఓట్ల లెక్కింపును అప్పుడే ఎందుకు ప్రకాశ్ రాజ్ నిరాకరించలేదనే ప్రశ్న ఇప్పుడు వినిస్తున్నది. అదికాకుండా బ్యాలెట్ బాక్సులు ఇంటికి తీసుకెళ్లారనే విషయం మరింత వివాదాస్పదంగా మారింది. దాంతో సీసీటీవీ ఫుటేజ్‌పై ప్రకాశ్ రాజ్ దృష్టిపెట్టడం మరింత చర్చనీయాంశమైంది. ఇటీవల జూబ్లీహిల్స్ స్కూల్‌కు వెళ్లి కెమెరాలను పరిశీలించిన ప్రకాశ్ రాజ్ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకొన్నారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్‌‌ను ఇవ్వాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు.

    సీసీటీవీ ఫుటేజ్ కోసం ప్రకాశ్ రాజ్ పట్టు

    సీసీటీవీ ఫుటేజ్ కోసం ప్రకాశ్ రాజ్ పట్టు

    నటుడు ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల అధికారిని సీసీటీవీ ఫుటేజ్ అడిగాం. ముందు ఇస్తానని చెప్పారు. కానీ ఆ తర్వాత ఎన్నికల అధికారి ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించినట్టు వార్తలు వచ్చాయి. మాకు ఆ విషయం చెప్పకోపోగా మీడియాకు ఎన్నికల అధికారి వెల్లడించారు. కోర్టు అనుమతితో ఇస్తామని చెప్పడంపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ను ప్రకాశ్ రాజ్ తప్పుపట్టారు.

    జూబ్లీ హిల్స్ స్కూల్‌లో సిసీటీవీ ఫుటేజ్ చూశాం

    జూబ్లీ హిల్స్ స్కూల్‌లో సిసీటీవీ ఫుటేజ్ చూశాం

    విష్ణు మంచు ప్రమాణ స్వీకారం తర్వాత కూడా గొడవలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తున్నాం అని ప్రకాశ్ రాజ్ చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ అందిన తర్వాత మీడియాకు వెల్లడించే విషయంలో నిర్ణయం తీసుకొంటాం. జూబ్లీ హిల్స్ స్కూల్‌లో కొన్ని సిసీటీవీ ఫుటేజ్ చూశాం. ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన ఏడు సీసీటీవీ ఫుటేజ్‌ను చూడాలి. ఆయన ముందు ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత మాట మార్చారు.
    కోర్టు అనుమతితో సీసీ ఫుటేజ్ ఇస్తామని చెబుతున్నారు అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

    ఎన్నికల అధికారిపైనే అనుమానం

    ఎన్నికల అధికారిపైనే అనుమానం

    ఇక మా ఎన్నికలు, మంచు విష్ణు ప్యానెల్, ఇంకా ఎవరిపై అనుమానాలు, వ్యక్తిగత కక్షలు లేవు. ఎన్నికల అధికారి ఎన్నికలను నిర్వహించిన తీరు, ఫలితాలను వెల్లడించిన తీరుపై మాకు అనుమానాలు ఉన్నాయి. మీడియాకు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా విషయం ఉంటే మీడియాకు తెలియజేస్తాం అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

    ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై సీవీఎస్ ఫైర్

    ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై సీవీఎస్ ఫైర్

    ఎన్నికలు జరిపించిన తీరు, వెల్లడించిన ఫలితాలపై తెలంగాణ వాది, నటుడు, న్యాయవాది సీవీఎల్ నరసింహారావు ఘాటుగా స్పందించారు. మా ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించి ఆ తర్వాత తప్పుకొన్న విషయం తెలిసిందే. మా ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. సీనియర్ నటులతో పనిచేశాను. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఏమీ జరుగలేదు. తాజా ఎన్నికల్లలో జరిగిన అవకతవకలను చూడలేకపోతున్నాను. చట్టవ్యతిరేకంగా ఎన్నికలు జరిపించారు. మహామహులతో ఎన్నికల్లో లీగల్ ఆఫీసర్‌గా వ్యవహరించాను. కానీ ఎప్పడు ఇలాంటివి జరుగలేదు అని ఆయన అన్నారు.

    సీసీటీవీలో అలాంటి నిజాలు ఉంటే...

    సీసీటీవీలో అలాంటి నిజాలు ఉంటే...


    మా సంస్థకు మురళీ మోహన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముఖ్యమైన తీర్మానాలతో కూడిన ఒక డాక్యుమెంట్ ఇచ్చాం. వాటిని పరిశీలించారా? అంటే అదీ లేదు. కొన్ని తీర్మానాలు చదవించలేదు. వాటిని పట్టించుకోలేదు. బీజేపీ, మా సంస్థలో ఉన్న సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఎన్నికల్లో జరిగిన అవకతవకలను బయటకు తీసుకురావాల్సి ఉంది. మా సంస్థను రక్షించుకోవాల్సి ఉంది అని సీవీఎల్ అన్నారు. ఇలాంటి నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్‌లో ఏముంది? ఒకవేళ అక్రమాలు జరిగినట్టు రుజువైతే మా ఫలితాలు మారే అవకాశం ఉన్నాయనే వాదన వినిపిస్తున్నది.

    English summary
    Prakash Raj demands Election commissions to show CCTV Footages on Voting day. Actor Prakash Raj and CVL Narasimha rao doubts Election process.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X