Maa Elections: మోహన్ బాబు కాళ్ళ మీద పడబోయిన ప్రకాష్ రాజ్‌కు చేదు అనుభవం.. నిరాకరించడంతో..
మా ఎన్నికల హడావిడి మొత్తానికి ఆదివారం ఉదయం చాలా కూల్ గానే మొదలైంది. మొన్నటి వరకు ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన వారు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. నేడు ఉదయం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో మొదలైన మా ఎన్నికల హడావుడిలో సెలబ్రిటీలు కలర్ఫుల్ సీన్స్ తో దర్శనమిచ్చారు. చాలావరకు సినీ తారల అందరు కూడా కాస్త స్నేహంగానే కనిపించారు. అయితే ప్రకాష్ రాజ్ కు మాత్రం ఒక వింత అనుభవం ఎదురయ్యింది. మోహన్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాగానే ప్రకాష్ రాజ్ ఆయన దగ్గరకు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా అందరూ వారిద్దరి కలయికను చూసి ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే...

గతంలో ఎప్పుడు లేని విధంగా విమర్శలు
మా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పోటీకి నిలబడిన అభ్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి వ్యక్తిగత విషయాలపై కూడా అభ్యర్థులు దూషణలకు దిగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా చాలా మంది విమర్శలు చేసుకున్నారు కానీ ఈ తరహా లో పర్సనల్ విషయాలపై ఎవరు నిందలు వేసుకోలేదని చాలా మంది సెలబ్రెటీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వ్యక్తిగత దూషణలకు దిగడం చాలా తప్పు అని కూడా తెలిపారు.

వ్యక్తిగత దూషణలు
మా అధ్యక్ష పదవికి నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే చాలా మంది ప్రముఖ సెలబ్రెటీల నుంచి మద్దతు తీసుకున్నాడు. మరోవైపు ప్రత్యర్థిగా నిలబడినటువంటి మంచు విష్ణు కూడా సీనియర్ నటీనటుల సపోర్ట్ బాగానే తీసుకున్నాడు. అయితే ప్రచారంలో మాత్రం ఇద్దరూ కూడా వ్యక్తిగత దూషణలు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి ఈ స్థాయిలో ఎన్నికల వేడి ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

ఓటింగ్ వేసేందుకు వచ్చిన మెగా హీరోలు
ఇక నేటి ఉదయం ఎనిమిది గంటలకే జూబ్లీహిల్స్ లోని పబ్లిక్ స్కూల్లో మా ఎలక్షన్స్ ఓటింగ్ మొదలైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ వంటి వాళ్ళు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. హీరోయిన్ నిత్యా మీనన్ కూడా ఎన్నికల్లో ఓటు వేసేందుకు కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చారు. ఎక్కువగా ప్రకాష్ రాజ్ కోసమే చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది.

మోహన్ బాబు కాళ్లపై ప్రకాష్ రాజ్
మోహన్ బాబు ఉదయమే ఎన్నికల ఓటింగ్ మొదలైనప్పుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మంచు మనోజ్ కూడా అప్పుడే వచ్చాడు. అయితే మోహన్ బాబు వచ్చే సమయంలో ప్రకాష్ రాజ్ కాళ్ల మీద పడే ప్రయత్నం చేశారు. కానీ అందుకు మోహన్ బాబు ఒప్పుకోలేదు. వెంటనే అతన్ని పట్టుకొని పైకి లేపి భుజం తట్టారు.
Recommended Video

కౌంటింగ్ కూడా ఈరోజే..
ఇక ఆ తరువాత మంచు విష్ణు ఓటింగ్ వేసే ముందు తన తండ్రి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఉదయం 8గంటలకు మొదలైన ఈ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత 'మా' కౌంటింగ్ మొదలు కానుంది. ఇక ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











