twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నరేష్ ఒళ్లు దగ్గరపెట్టుకో.. మంచు ఫ్యామిలీ కంటే నేనే మంచి తెలుగు మాట్లాడుతా..సిగ్గుందా?అంటూ ప్రకాశ్ రాజ్‌ ఫైర్

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారాయి. ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు ప్యానెల్స్ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా మారాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇటీవల నాన్ లోకల్ అంటూ విష్ణు మంచు, వీకే నరేష్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ భగ్గుమన్నారు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..

    Recommended Video

    MAA Elections: Prakash Raj VS Manchu Vishnu మంచు ఫ్యామిలీ కంటే నేనే మంచి తెలుగు మాట్లాడుతా..
    సిగ్గు లేకుండా నాపై అబద్దాలు

    సిగ్గు లేకుండా నాపై అబద్దాలు

    మా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నప్పుడు ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ఊహించాను. నాపై మాటల దాడి కొనసాగుతుందని అప్పుడే గ్రహించి ఇందుకు సిద్ధమయ్యాను. సిగ్గు లేకుండా నాపై అబద్దాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తెలుగు వాడిని కాదు అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రకాశ్ రాజ్ తప్పుపట్టారు. కొందరు నాపై చేస్తున్న దాడి సరికాదు. నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్లకు చదువు వచ్చా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    వాళ్లకు తెలుగు మాట్లాడటం వచ్చా?

    వాళ్లకు తెలుగు మాట్లాడటం వచ్చా?

    నన్ను తెలుగు వాడు కాదని అంటున్న వాళ్లకు తెలుగు మాట్లాడటం వచ్చా? నేను మాట్లాడినట్టు వాళ్లు తెలుగు మాట్లాడగలరా? ఎవరో రాసిస్తే వచ్చి మాట్లాడేవాళ్లు.. నా మాదిరిగా అనర్గళంగా మాట్లాడగలరా? నేను తెలుగు మాట్లాడితే భాష గర్వపడుతుంది. తెలుగు ఇండస్ట్రీకి జాతీయ అవార్డు తెచ్చిపెట్టాను. మీలో ఎవరైనా అలాంటి అవార్డును ఇప్పటి వరకు సాధించారా? నాన్ లోకల్ అనే విషయం నాకు కొత్తకాదు. కన్నడలో విన్నాను, తమిళ భాషలో ఆ వివక్షణను ఎదుర్కొన్నాను. ఇప్పుడు తెలుగులో కూడా ఆ వివక్షను ఎదుర్కొంటున్నాను అని ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు.

    నన్ను కాల్చి చంపడానికి ప్రయత్నిస్తే...

    నన్ను కాల్చి చంపడానికి ప్రయత్నిస్తే...

    పలు భాషల్లో తనను టార్గెట్ చేసినా నా పురోగతిని ఆపలేకపోయారు. బయటి వాడు అంటూ ఆరోపణలు చేశారు. వాటిని జీర్ణించుకోని ఇండస్ట్రీలో నిలబడ్డాను. అందుకే వారిపై నేను కవిత కూడా రాశాను అంటూ ప్రశాశ్ రాజ్ చదివి వినిపించాడు.

    తరమకండి.. చేరాల్సిన చోటు త్వరగా చేరుకొంటా

    తరమకండి.. చేరాల్సిన చోటు త్వరగా చేరుకొంటా


    రాళ్లతో కొట్టకండి.. నేను ఇల్లు కట్టుకొంటా
    నన్ను కాల్చి చంపడానికి నిప్పు పెట్టకండి.. నేను దీపం వెలిగించుకొంటా
    నన్ను చంపేస్తానని విషం పెట్టకండి.. గరళకంఠుడిని అయిపోతా అంటూ ఆవేశంగా ప్రసంగించారు. నన్ను రకరకాలు టార్గెట్ చేశారు. అలాంటి సంఘటనలను అధిగమించి ఇక్కడ ఉన్నాను అని అన్నారు.

    కళాకారులు అంటే అడ్డుక్కొనే వాళ్లా?

    కళాకారులు అంటే అడ్డుక్కొనే వాళ్లా?

    మా సంఘంలో 65 ఏళ్లకుపై బడిన వారు 250 మంది ఉన్నారు. ఇటీవల ఓ పెద్దాయన మాట్లాడుతూ.. నేను పది మందికి 8 వేలు ఇస్తున్నామని చెప్పారు. కళాకారులు అంటే అడ్డుకొనే స్థితిలో ఉండకూడదు. కళాకారుడికి ప్రతిభే సంపద. ఆర్టిస్టును అడుక్కొనే వాడిగా చూడకూడదు. మా ఎన్నికల తర్వాత ప్రతీ సభ్యుడికి హెల్త్ కార్డు అందించే ప్రయత్నం చేస్తాం. చాలా మంది కళాకారులు ఓల్డ్ ఏజ్ హోంలో ఉంటున్నారు. అలాంటి వారికి చేయూత ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

    పెద్దల ఆశీర్వాదం అక్కర్లేదు..

    పెద్దల ఆశీర్వాదం అక్కర్లేదు..

    మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో పెద్దల ఆశీర్వాదం తీసుకొన్నారా? అంటూ కొందరు అడిగారు. అయితే ఆ పెద్దల ఆశీర్వాదం నాకు అవసరం లేదు. నేను వారి వద్ద చేతులు కట్టుకొని నిలబడలేను. నా ప్రతిభ ఆధారంగా నేను గెలువాలని కోరుకొంటాను. పెద్దల ఆశీర్వాదం తీసుకొంటే.. మా సంస్థ ఇలానే పాడుబడిపోతుంది అని అన్నారు. చివరగా మీకు మంచి ప్యానెల్ కావాలా? మంచు ప్యానెల్ కావాలా మీరే తేల్చుకోండి అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

    నరేష్.. ఒళ్లు దగ్గర పెట్టుకో..

    నరేష్.. ఒళ్లు దగ్గర పెట్టుకో..


    తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మా మాజీ అధ్యక్షుడు, నటుడు వీకే నరేష్‌పై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. నరేష్ మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. నీవు ప్రసిడెంట్ హోదాలో అలా మాట్లాడుతారు. సంస్థ సిగ్గుపడేలా మాట్లాడటం సరికాదు. నీకు నీవు అర్జునుడిగా ఫీలవుతున్నావు. నీ చేతిలో చక్రం లాగేసుకొన్నామనే విషయం నీకు అర్ధం కావడం లేదు. డబ్బు సంపాదించడానికి వేషాలు వేయండి. బయట వేషాలు వేస్తే ఎవరు సహించరు అంటూ ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు.

    English summary
    MAA Elections campaign is going in high note. Actor Prakash Raj fires on VK Naresh and Manchu Vishnu Family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X