twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను నాన్ లోకలా? ఏ గ్రహంలో ఉన్నారు.. అకారణంగా శృత్వత్వం వద్దు.. మీడియా మీట్‌లో ప్రకాశ్ రాజ్ ఆవేదన

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్న ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ అయ్యారు. తనపై వస్తున్న ఆరోపణలు, వార్తలు, కథనాలపై ఆయన ఆందోళన చెందారు. తాను నటుడు కాదని.. లోకల్ కాదనే ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్యానెల్ సభ్యులతో ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించి ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ...

    Recommended Video

    Allu Arjun Pushpa Breaks RRR Record, Hail Allu Arjun || Filmibeat Telugu
    మీరు ఏ లోకంలో ఉన్నారండీ..

    మీరు ఏ లోకంలో ఉన్నారండీ..

    ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అనే కొత్త ప్రచారం మొదలుపెట్టారు. నాన్ లోకల్ ప్రచారం చేస్తున్న వారు ఏ లోకంలో ఉన్నారో అర్ధం కావడం లేదు. మీరు ఏ సూర్యుడో అర్థం కావడం లేదు. కళాకారుడు అనే వాడు యూనివర్సల్. సూర్యుడిలా వెలుగు ఇస్తుంటారు. గత ఎన్నికల్లో నాన్ లోకల్ అనే ఎజెండా రాలేదు. నేను సామాజిక సేవ చేస్తున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు. రెండు గ్రామాలను దత్తత తీసుకొన్నప్పుడు నాన్ లోకల్ అనలేదు. ఏడు నంది అవార్డులు వచ్చినప్పుడు? జాతీయ అవార్డు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదేమిటని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు.

    ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా?

    ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా?

    నన్ను నాన్ లోకల్ అని చెప్పడం ఎక్కడ నుంచి వచ్చింది. జయసుధ, సాయికుమార్ లాంటి వాళ్లని తీసుకోండి. అన్ని భాషల్లో రాణిస్తున్నారు. వారిని ఎవరు కూడా నాన్ లోకల్ అనలేదు. మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ చాలా బలమైన సంస్థ. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అక్కడి తెలుగు వాళ్లు మన ఆర్టిస్టులు వెళితే బ్రహ్మరథం పడుతారు. అది మనకు ఉన్న గౌరవం అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

    కోపంతో కాదు.. ఆవేదనతో పుట్టిన ప్యానెల్

    కోపంతో కాదు.. ఆవేదనతో పుట్టిన ప్యానెల్

    మా ఎన్నికల్లో పోటీ చేయడానికి కోపంతో పుట్టిన ప్యానెల్ కాదు. కేవలం కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ఆవేదనతో పుట్టిన ప్యానెల్ ఇది. ఇది సిని 'మా' బిడ్డల ప్యానెల్ అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లోని సభ్యులందరూ అనేక అవమానాలు, కష్టాలు అనుభవించి సొంతంగా ఎదిగిన వ్యక్తులు. వారికి సమస్యలపై అవగాహన ఉంది. మా సంస్థ అందరికి ఇళ్లు లాంటింది. దానికి క్లీన్ చేసుకొనే బాధ్యత అందరిపై ఉంది అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

    మనసాక్షితో ఓటు వేయాలని

    మనసాక్షితో ఓటు వేయాలని

    మా సంస్థలో ఉన్న ప్రతీ ఒక్కరు మహానుభావులు. ప్రతీ ఒక్కరికి ఓ అర్హత ఉంది. నేను సైన్యం తయారు చేయడం లేదు. అందరూ వచ్చి ఇక్కడ గుమికూడకండి. సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతాం. ఎవరికి చిత్తశుద్ది ఉందో గమనించాలని కోరుతున్నాను. మీ మనసాక్షితో ఓటు వేయండి అని కోరుతున్నాను. మా ప్యానెల్ గొప్పగా ఎజెండాను సిద్దం చేస్తుంది. దానిని ఓటర్ల ముందు పెడుతున్నాం. మా సంస్తకు సొంత భవనం ఉండేలా చర్యలు తీసుకొంటాం. అందరూ ఆశ్చర్య పడేలా ఆ భవనాన్ని నిర్మించుకొంటాం అని ప్రకాశ్ రాజ్ ధీమాను వ్యక్తం చేశారు.

    పాపులారిటీ కోసం కాదు...

    పాపులారిటీ కోసం కాదు...

    మా ఎన్నికలు మరో మూడు నెలల్లో జరుగబోతున్నాయి. అప్పటి వరకు మేము మీడియా ముందుకు రావద్దని అనుకొన్నాం. మాకు మీడియాలో పాపులారిటీ కోసం ప్రయత్నించం. ఎందుకంటే మేము అల్రెడీ పాపులర్. జనరల్ బాడీ పెట్టి.. ఎలక్షన్ డేట్ ప్రకటించే వరకు మూడు నెలలు పాటు మేము ఎజెండాను రూపొందించే పనిలో ఉంటాం. ఎవరూ మీడియాలోకి రారు. మాకు అకారణంగా శతృత్వం వద్దు. పెద్దలు ఈ వ్యవహారంలోకి రావొద్దని కోరుకొంటున్నాను. పదవి కోసం ఎవరు రాలేదు. ఎవరైనా తప్పు చేసినా ప్రశ్నించే.. క్రమశిక్షణను నేర్పే కార్గవర్యం ఉండాలి అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

    సభ్యుల మధ్య సఖ్యత, సహృద్బావం ఉండాలి...

    సభ్యుల మధ్య సఖ్యత, సహృద్బావం ఉండాలి...

    ఎన్నికల పేరుతో శతృత్వం కాకుండా.. సభ్యుల మధ్య సఖ్యత, సహృద్బావం ఉండాలని, దానిని సెలబ్రేట్ చేసుకొనేలా ఉండాలని కోరుకొంటున్నాను. అందరూ ఆనందంగా ఉండాలి. ప్రతీ ఒక్కరు మరొకరిని కౌగిలించుకొనే అనుబంధం కొనసాగాలి. మా ఎన్నికలు అనేది అంతర్గత వ్యవహారం. ప్రతీ ఒక్కరిని కలుస్తాం. అప్పటి వరకు మీడియాతో మాట్లాడే విషయం లేదు అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

    English summary
    Prakash Raj about MAA Elections strategy and clarity on rumours in media. Jaya Sudha to contest for MAA President post: Movie Artist Association (MAA) Elections to held soon. Report suggest that Jaya Sudha in the race of President post. Actress Jeevitha Rajasekhar to contest President against Prakash Raj and Manchu Vishnu. Already Prakash raj seek support from Chiranjeevi, Nagababu and others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X