ప్రకాశ్ రాజ్ బీపీ ట్యాబ్లెట్ వేసుకో.. నీవు మగాడివైతే.. దమ్ముంటే రా.. 10 తర్వాత తీవ్ర పరిణామాలు.. విష్ణు ఫైర్
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం వివాదాలను మించి ముదిరి పాకాన పడుతున్నాయి. ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు ప్యానెల్స్ పోటాపోటీగా మీడియా సమావేశాలు పెడుతూ విమర్శల దాడులను పెంచారు. పోస్టల్ బ్యాలెట్ వివాదంపై మంచు విష్ణు స్పందించారు. ప్రకాశ్ రాజ్ ఆరోపణలను తిప్పి కొడుతూ విష్ణు మంచు ఘాటుగా స్పందించారు. మీడియా సమావేశంలో విష్ణు మంచు మాట్లాడుతూ...

ఓటు వేయమని హక్కు ఉందంటూ
పోస్టల్ బ్యాలెట్ విషయంలో అధ్యక్ష అభ్యర్థిగా, ఓ ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్నందున ఓట్లు అడిగే హక్కు ఉంది. నేను పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులైన వారిని ఓటు వేయమని అడిగాను. అందులో తప్పేమి లేదు. నిబంధనలకు అనుగుణంగానే నేను వ్యవహరించాను. ప్రకాశ్ రాజ్‌కు వాస్తవాలు తెలియకుండా మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బీపీ టాబ్లెట్ వేసుకోకుండా వచ్చి ఏదేదో మాట్లాడారు. ఈ మేధావికి శరత్ బాబు ఫ్రెండ్ అట.. కానీ మా నాన్నకు శరత్ బాబు చెన్నైలో రూంమేట్. ఆయన నన్ను 500 కట్టమని అడిగారు. నాన్నకు గూగుల్ పే చేస్తామని చెప్పారు అని విష్ణు మంచు అన్నారు.

నోరు ఉందని పారేసుకోకు ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నోరు ఉన్నదని, పెద్ద చిన్నా తేడా తెలియకుండా నోరు పారేసుకోవద్దు. కృష్ణంరాజు, కృష్ణను అవమానిస్తారా? పెద్దలను గౌరవించకపోతే సర్వనాశనం అయిపోతారు. కృష్ణ గారు, నరేష్ గారు ఒకే ఇంట్లో ఉంటారు. ఆయన్ని అడిగితే మీరు కట్టేయండి అని చెప్పారు.
కృష్ణంరాజును అడిగితే ఆయన కూడా కట్టమని చెప్పారు. దాంతో వారి తరఫున నేను 500 రూపాయలు కట్టాను. దానిని ఏదో తప్పు చేశానని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆయన అహంకారం గురించి తమిళ, కన్నడ పరిశ్రమలో అడిగితే చెబుతారు. ఇప్పడు ఆయన తెలుగు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని విష్ణు మంచు అన్నారు.

ప్రకాశ్ రాజ్ తెలుగు వాడు కాదు..
ప్రకాశ్ రాజ్‌కు విష్ణు మంచు వార్నింగ్ ఇస్తూ.. ప్రకాశ్ రాజ్ తెలుగు వాడు కాదు. అతడికి ఇక్కడి సంప్రదాయాలు తెలియవు. ఇంకోసారి నా ఫ్యామిలీ మాటెత్తితే ఇక గారు అని సంబంధించడం ఉండదు. నేను ప్రసిడెంట్ క్యాండిడేట్‌ను. అంతేకాని నా అక్క పేరు, తమ్ముడి పేరు, నాన్న, తల్లి, భార్య, పిల్లలు పేరు తీస్తున్నారు. కావాలంటే నన్ను టార్గెట్ చేయండి. ఇంకోసారి నా ఫ్యామిలీ పేరు ఎత్తితే బాగుండదని హెచ్చరించారు.

శ్రీకాంత్, హేమ, జీవిత నోరు జారకండి అంటూ
ప్రకాశ్ రాజ్‌ను చూసి శ్రీకాంత్, హేమ, జీవిత నోరు జారుతున్నారు. 10 తేదీ తర్వాత ప్రకాశ్ రాజ్ జాడ ఇక్కడ కనిపించదు. తోటి నటీనటులకు గౌరవం ఇవ్వండి. మేము ఎవరినీ విమర్శించడం లేదు. పదో తేది లోపు నోరు జారితే ముఖాలు చేసుకొనే అవకాశం కూడా ఉండదు. మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రకాశ్ రాజ్ మీ రాజకీయాలను ఇక్కడికి తీసుకొస్తున్నారు. అలాంటి పనులు చేయకండి అని విష్ణు మంచు ఘాటుగా స్పందించారు.

ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటూ
ఈవీఎంల ద్వారా ఓటింగ్ వద్దు.. బ్యాలెట్ కావాలని అంటున్నారు. మీరు ఓడిపోతే ఈవీఎంలు టాంపరింగ్ చేసి గెలిచారని ఆరోపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రకాశ్ రాజ్ ఇంకోసారి నోరు జారితే ఊరుకొనేది లేదు. నీవు మగాడివైతే.. దమ్ము, ధైర్యం ఉంటే నాపై విమర్శలు చేయకండి. ఇక నుంచి నా ఫ్యామిలీని ఈ వివాదంలోకి లాగకండి. ఆయన గెలిచే ప్రసక్తి లేదు. ఆయన తప్పుదారిలో గెలిచినా నేను హుందాగా షేక్ హ్యాండ్ ఇవ్వవద్దు అని విష్ణు మంచు అని తీవ్రస్థాయి మండిపడ్డారు.
Recommended Video

నా ఫ్యామిలీ లాగితే తీవ్ర పరిణామాలు.. మంచు విష్ణు
నన్ను, ఫ్యామిలీని విమర్శిస్తే.. పది తేదీ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శ్రీకాంత్, జీవిత, ఇతర ప్యానెల్ మెంబర్లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్నికలు మంచి వాతావరణం మధ్య జరగాలి. మీరు ఎంత ఆవేశంగా, గట్టిగా మాట్లాడుతారో.. అంతే ధైర్యంగా నేను మాట్లాడుతాను. మీరు నా ఫ్యామిలీని బయటకు లాగితే.. మీ ఫ్యామిలీలను కూడా రోడ్డు మీదకు లాగుతాను అని విష్ణు మంచు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











