twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు వాడే అధ్యక్షుడు కావాలి.. ప్రకాశ్ రాజ్‌ వచ్చాడా? తెచ్చారా? వీకే నరేష్ ధ్వజం

    |

    సినిమా హీరోలు తలచుకొంటే ఏమైనా చేయగలరు. కానీ మమల్ని చేయనియ్యరు కద.. ఈ సారి మేము విద్యపై ఫుల్ ఫోకస్ పెడుతున్నాం. మాదాల రవి వైద్యంపై ఫోకస్ పెడుతున్నారు. మా సింగిల్ పాయింట్ ఎజెండా సినీ కళాకారులు సంక్షేమం మాత్రమే. మా ఎన్నికల సందర్భంగా మాకు రాజకీయాలు చేయడం ఇష్టం లేదు అంటూ మా మాజీ అధ్యక్షుడు వీకే నరేష్ ఘాటుగా స్పందించారు.

    ప్రకాశ్ రాజ్ సస్పెండ్ అయ్యారంటూ..

    ప్రకాశ్ రాజ్ సస్పెండ్ అయ్యారంటూ..

    మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాశ్ రాజ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మీరు ఎప్పుడైనా ఓటు వేయడానికి వచ్చారా? ఏనాడైనా మీరు వార్షిక సమావేశాలకు హాజరయ్యారా? మీరు ఏ సభ్యుడికైనా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారా? మీరు ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారు? ఆ విషయం మీకు గుర్తుందా? మా ఎన్నికల కోసం మీరు వచ్చారా? లేక ఎవరైనా తెచ్చారా? మీరు న్యాయం చేస్తారనే విషయం వాళ్లకైనా ఉందా అంటూ వీకే నరేష్ పేర్కొన్నారు.

    ప్రకాశ్ రాజ్ ఎవరినైనా దత్తత తీసుకొన్నారా?

    ప్రకాశ్ రాజ్ ఎవరినైనా దత్తత తీసుకొన్నారా?

    ప్రకాశ్ రాజ్‌ గారు.. మీరు ఓ గ్రామాలను దత్తత తీసుకొన్నారు. కానీ నేను అనంతపురం జిల్లాను దత్తత తీసుకొన్నాను. 60 మండలాల కళాకారులకు సేవ చేస్తున్నాను. 120 చెరువులు నింపడానికి పనిచేస్తున్నాను. అనేక మంది కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇప్పించాం. పిల్లలకు చదువు చెప్పిస్తున్నాం. మా అమ్మ బతికి ఉన్న సమయంలో ఇన్సూరెన్సులు ఇచ్చాం. మీరు కనీసం ఒక్క మనిషికి ఏదైనా సహాయం చేశారా. రెస్టారెంట్లలో డిస్కౌంట్లు ఇప్పిస్తే.. డ్యాన్సులు చేయాలా అంటూ వీకే నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు

    కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు

    తెలుగు సినీ పరిశ్రమతో, కళాకారులు సంక్షేమంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న మీరు ఉన్నట్టుంది మా ఎన్నికల్లో దూకి అందర్నీ కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. మాటలకు, మ్యానిఫెస్టోకు తేడా ఉంటుంది. సభ్యుడు ఎవరికైనా ఓటు వేయండి. ఆరేళ్లుగా మా సంఘంలో ఉన్నాను. మంచి టీమ్ ఉండాలని కోరుకొంటున్నాను. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో ఎలాంటి వాళ్లు ఉన్నారో మీకు తెలుసు అని వీకే నరేష్ తెలిపారు.

    తెలుగు వారిలో ఆ పౌరుషం లేదా?

    తెలుగు వారిలో ఆ పౌరుషం లేదా?

    ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ ఉన్న సభ్యుల్లో ఉన్న వాళ్లకే ఆయ నమ్మకం లేదు. మా ప్రసిడెంట్ గెలుస్తాడో లేదో మాకు తెలియడం లేదు అంటున్నారు. ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అనడం తప్పు. కళాకారులకు స్థానికత ఉండదు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో సరైన వాళ్లు లేర అని ప్రకాశ్ రాజ్ అనడం బాధ కలిగించింది. స్వర్గీయ ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్యనాయుడు, అల్లూరి లాంటి పౌరుషం మనలో లేదా అని వీకే నరేష్ అన్నారు.

    ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు.. కానీ అధ్యక్షుడు మాత్రం

    ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు.. కానీ అధ్యక్షుడు మాత్రం

    చెన్నైలో తెలుగు సినీ పరిశ్రమ ఉన్నప్పుడు తెలుగు వారికి ఓ సంస్థ ఉండాలని తెలుగు సినీ నటుల అసోసియేషన్ సూపర్ స్టార్ కృష్ణ ఇంటిలో ఏర్పడింది. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఏర్పడింది. అలాంటి సంస్థలో ఏ భాషకు చెందిన నటులైనా సభ్యత్వం తీసుకోవచ్చు. స్థానికతను పక్కన పెడితే.. తెలుగు వాళ్లే అధ్యక్షుడు కావాలి. తెలుగువాడిగా గర్వంగా చెబుతున్నా అని ప్రకాశ్ రాజ్‌పై వీకే నరేష్ ఘాటుగా స్పందించారు.

    Recommended Video

    SP Balasubrahmanyam : సజీవ మూర్తిగా ఎస్పీ బాలు.. చీకటి వెలుగులతోపాటు | Mohan Lal | Filmibeat Telugu
    ప్రకాశ్ రాజ్ మాట వెనుకకు తీసుకో..

    ప్రకాశ్ రాజ్ మాట వెనుకకు తీసుకో..

    మీరు మీ భాష సంఘంలో ఎందుకు లేరు? ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఎన్నికలు ముగిసిన తర్వాత బైలాస్ ఫ్రీడమ్ గురించి చర్చించుకొందాం. తెలుగు వాళ్లో సత్తా ఉన్న వ్యక్తి లేరనే మాటను వెనకకు తీసుకోండి. మీకు బెస్టాఫ్ లక్ చెబుతున్నాం. మా ఎన్నికల సందర్భంగా సభ్యులకు విన్నపం చేస్తున్నాను. ఎవరిని గెలిపించినా.. ఒకే ప్యానల్‌ను గెలిపించండి. కానీ ప్రలోభాలకు మోసపోకండి అంటూ నరేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    English summary
    Tollywood MAA Elections are going with high note. VK Naresh starts campaign and speak to media. In this media conference, VK Naresh slam Prakash Raj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X