MAA Elections Results: ఉత్కంఠ పోరులో మా అధ్యక్షుడిగా విష్ణు మంచు విజయం.. ప్రకాశ్ రాజ్‌పై ఎంత తేడాతో గెలిచాడంటే

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అత్యంత ఉద్రిక్తతలు, వాడివేడి ఆరోపణల మధ్య ఓట్ల లెక్కింపు ముగిసింది. తాజాగా ఆదివారం (అక్టోబర్ 10)న జరిగిన ఎన్నికల్లో విష్ణు మంచు విజయం సాధించారు. అయితే ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ అధిక్యాన్ని ప్రర్శించింది. ఓట్ల లెక్కింపు వివరాల్లోకి వెళితే..

మంచు విష్ణు భారీ విజయం

మంచు విష్ణు భారీ విజయం

ప్రకాశ్ రాజ్‌పై విష్ణు మంచు భారీ విజయం సాధించారు. విష్ణు మంచు 381 ఓట్లు సంపాదించుకోగా, ప్రకాశ్ రాజ్‌కు 270 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో విష్ణు మంచు 111 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

శ్రీకాంత్ విజయం

శ్రీకాంత్ విజయం


మా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రసిడెంట్ ఎన్నిక కోసం మంచు విష్ణు ప్యానెల్‌లో బాబు మోహన్ బరిలో ఉండగా, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ పోటీలో ఉన్నారు. శ్రీకాంత్‌కు 375 ఓట్లు రాగా, బాబుమోహన్ 269 ఓట్లు పడ్డాయి. దాంతో శ్రీకాంత్ భారీ తేడాతో విజయం సాధించారు. కోశాధికారి పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన నాగినీడుపై 32 ఓట్ల తేడాతో శివ బాలాజీ విజయం సాధించారు. శివ బాలాజీకి 359 ఓట్లు రాగా, నాగనీడుకు 292 ఓట్లు వచ్చాయి.

మాదాల రవి విన్నర్‌గా

మాదాల రవి విన్నర్‌గా

మా కార్యవర్గంలో ఉపాధ్యక్షుడు పదవికి జరిగిన ఎన్నికల్లో మాదాల రవి విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీలోకి దిగిన బెనర్జీపై మాదాల రవి గెలుపును సొంతం చేసుకొన్నారు. ఎంతో ఉత్కంఠ మధ్య ఈ పదవి కోసం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. చివరకు వరకు నువ్వా నేనా అన్నట్టు సాధించిన లెక్కింపులో మాదాల రవి గెలుపు 350 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

రఘుబాబు విజయం

రఘుబాబు విజయం

మా ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రధాన కార్యదర్శి పదవిని విష్ణు మంచు ప్యానెల్ సొంతం చేసుకొన్నది. మంచు ప్యానెల్ నుంచి పోటీ చేసిన రఘుబాబు విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన జీవిత రాజశేఖర్‌పై 7 ఓట్ల తేడాతో రఘుబాబు విజయం సాధించారు. రఘుబాబుకు 340 ఓట్లురాగా, జీవితకు 313 ఓట్లు వచ్చాయి.

మా కార్యవర్గం కోసం

మా కార్యవర్గం కోసం

మా కార్యవర్గం కోసం జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది కార్యవర్గ సభ్యులు విజయం సాధించారు. మాణిక్, హరినాథ్, బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మీ, జయవాణి శశాంక్, పూజిత కార్యవర్గ సభ్యులు విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో సురేష్ కొండేటి, అనసూయ, కౌశిక్, శివారెడ్డి గెలుపును సొంతం చేసుకొన్నారు.

Recommended Video

Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
ఉత్తేజ్ భారీ గెలుపుతో

ఉత్తేజ్ భారీ గెలుపుతో


ఇక విష్ణు మంచు ప్యానెల్‌లో పోటీ చేసిన గౌతమ్ రాజు జాయింట్ సెక్రెటరీ విజయం సాధించగా, ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో ఉత్తేజ్ జాయింట్ సెక్రెటరీగా విజయం సాధించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X