‘మా’ లొల్లి: ఆఫీసుకు నరేష్ తాళం, శివాజీ రాజీనామా అంటూ వార్తలు... ఏం జరిగిదంటే!

By Bojja Kumar

Recommended Video

Movie Artists Association Calls For Emergency Executive Meeting

'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'లో విభేదాలు భగ్గుమన్నాంటూ.... రెండు మూడు రోజులుగా మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ ప్రముఖ పత్రికలో మా అధ్యక్షుడు శివాజీ రాజాకు, ప్రధాన కార్యదర్శి నరేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుందంటూ వార్తలు వచ్చాయి. నిధులు దుర్వినియోగం చేస్తున్నారని నరేష్ ఆగ్రహంగా కార్యాలయానికి వెళ్లారని, రికార్డులను సీజ్ చేశారని, ఆఫీసుకు తాళం వేశారంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. దీంతో పాటు శివాజీ రాజా తన పదవికి రాజీనామా చేసినట్లు సైతం పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తల నేపథ్యంలో 'మా' ఎగ్జిక్యూటివ్ కమిటీ అత్యవసరంగా సమావేశం అవ్వడం కూడా మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దీనిపై 'మా' సభ్యులు వివరణ ఇచ్చారు.

ఇవన్నీ సహజమే

ఇవన్నీ సహజమే

ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అనంతరం నరేష్ మాట్లాడుతూ... వర్క్ ఒత్తిడి పెరగడం, మా మధ్య కో ఆర్డినేషన్‌కు మనుషులు సరిపోక పోవడం ఇవన్నీ కూడా చర్చించుకోవాలనే ఆలోచన ఎప్పటి నుండో ఉంది. వర్క్ ఎక్కువ పెరిగినపుడు చిన్న డిఫరెన్సెస్ వస్తాయి. ఇవన్నీ కూడా అన్నదమ్ముల్లాగ, అక్క చెల్లెళ్ల మాదిరిగా పరిష్కరించుకోవడం సహజం... అని వ్యాఖ్యానించారు.

మా ప్రతిష్ట నిలబెడతాం

మా ప్రతిష్ట నిలబెడతాం

‘మా' ప్రతిష్ఠ ఎప్పుడూ నిలబెడతాం. మా సిల్వర్ జూబ్లీని సక్సెస్ ఫుల్‌గా చేస్తాం. నేను శివాజీ రామలక్ష్మణుల్లాంటివారం. సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి... అని నరేష్ స్పష్టం చేశారు.

బౌన్సర్లను ఎందుకు పెట్టినట్లు?

బౌన్సర్లను ఎందుకు పెట్టినట్లు?

బౌన్సర్లను పెట్టి ఈసీ మీటింగ్ పెట్టారెందుకు? అని మీడియా వారు ప్రశ్నించగా... వారు నరేష్ పర్సనల్‌గా పెట్టుకున్న బౌన్సర్లు. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు అని మా సభ్యులు హేమ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు వెల్లడించారు.

ప్రాణం పోయినా తప్పు చేయం

ప్రాణం పోయినా తప్పు చేయం

నేను ఆఫీసులో ఉండగానే శివాజీ రాజా రాజీనామా అని వచ్చింది. ఒక పత్రికలో నాపై కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పత్రికలకు స్వేచ్ఛ ఉంది. దాన్ని గౌరవిస్తాం. ప్రాణం పోయినా మేము తప్పు చేయం, మా అసోసియేషన్లో ఎలాంటి అవకతవకలకు చోటు లేదు అని శివాజీ రాజా తెలిపారు.

అందరి సపోర్ట్ ఉంది

అందరి సపోర్ట్ ఉంది

సిల్వర్ జూబ్లీ అద్భుతంగా మొదలు పెట్టాం. మేము అనుకున్నదానికంటే చిరంజీవి, మహేష్, ప్రభాస్, నాగార్జున, బాలకృష్ణ తదితరులు ఇలా ఎవరికి వారు మనస్ఫూర్తిగా ఒక అడుగు ముందుకేసి వస్తామని చెప్పడం ఆనందంగా ఉంది. త్వరలోనే వారితో కార్యక్రమాలు చేసి ఫండ్స్ కలెక్ట్ చేసి ‘మా' బిల్డింగ్ కడతామని సభ్యులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X