twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదంలోకి రాజశేఖర్‌ కూతురు.. జీవిత దిమ్మ తిరిగే జవాబు.. శివాజీ రాజా వర్గానికి రిటర్న్ గిఫ్ట్!

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల పూర్తయిన తర్వాత కూడా నరేష్ వర్గానికి, శివాజీ రాజా వర్గాని మధ్య అధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు బురుద జల్లుకోవడానికి ప్రయత్నిస్తూ అభాసు పాలవుతున్నాడు. తాజాగా రాజశేఖర్ కూతురుపై నిరాధారమైన ఆరోపణలు చేసి శివాజీ రాజా బుక్ అయ్యాడు. ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇంతకు ఏమైందంటే..

     నిధుల దుర్వినియోగం అంటూ

    నిధుల దుర్వినియోగం అంటూ

    మా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఏప్రిల్ ఒకటి నుంచి నరేష్ అధ్యక్షుడిగా, జీవితా రాజశేఖర్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో మా నిధులకు సంబంధించి రూ.7 లక్షలు దుర్వినియోగం అయ్యాయిని శివాజీ రాజా వర్గం ఆరోపించింది. ఆ నిధులు ఏకంగా జీవితా రాజశేఖర్ కూతురు అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ కావడంతో వివాదంగా మారింది.

     స్పందించిన జీవిత రాజశేఖర్

    స్పందించిన జీవిత రాజశేఖర్

    శివాజీ రాజా వర్గం చేసిన ఆరోపణలపై జీవిత స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేందుకు అడ్వర్టయిజ్ మెంట్ ఇవ్వాలని మా కార్యవర్గం నిర్ణయించింది. ఆ సమయంలో కోశాధికారి రాజీవ్ కనకాల అందుబాటులో లేరు. దాంతో దానికి కావాల్సిన మొత్తాన్ని స్వయంగా మేము ఇచ్చాం అని జీవిత వెల్లడించారు.

    రాజీవ్ కనకాల స్వయంగా ట్రాన్స్‌ఫర్ చేశారు

    రాజీవ్ కనకాల స్వయంగా ట్రాన్స్‌ఫర్ చేశారు

    తెలంగాణ ప్రభుత్వం కోసం ఇచ్చిన ప్రకటనకు అయిన ఖర్చును మా నిధుల నుంచి నా కూతురు బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. స్వయంగా రాజీవ్ కనకాల ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ విషయాన్ని తెలుసుకోకుండా శివాజీరాజా వర్గం మాపై నిందలు వేసేందుకు ప్రయత్నించారు అని అన్నారు.

     ఆరోపణలు వస్తాయని తెలుసు అందుకే

    ఆరోపణలు వస్తాయని తెలుసు అందుకే

    మా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదు. నిధుల వినియోగం విషయంలో ఏం జరుతుందో ఆఫీస్ బేరర్స్‌కు తెలుసు. ఎలాంటి అనుమానాలు ఉన్నా మా ఆఫీసుకు వచ్చి చెక్ చేసుకోవచ్చు. ‘మా'పై ఇలాంటి ఆరోపణలు వస్తాయని ముందే తెలుసు. అందుకే ‘మా' అకౌంట్స్ విషయంలో పారదర్శకంగా ఉంటున్నాం అని జీవిత స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

     శివాజీ రాజా అవాస్తవాలతో ఆరోపణలా?

    శివాజీ రాజా అవాస్తవాలతో ఆరోపణలా?

    గత కొద్దికాలంగా నరేష్ వర్గాన్ని, ఆయనకు సహకరించిన నాగబాబును టార్గెట్‌గా చేసుకొని శివాజీ రాజా ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా రాజశేఖర్ కూతురును వివాదంలోకి లాగుతూ చేసిన ఆరోపణలు బౌన్స్ కావడంపై సినీ వర్గాలు తలో విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు విషయం తెలుసుకోకుండా ఆయన వర్గం విమర్శలు చేయడం తగదు అని అంటున్నారు.

    English summary
    MAA general secretary Jeevitha Rajasekhar given clarity on Sivaji Raja allegations. Sivaji Raja alleges about 7.5 Lakhs fraud in MAA. On that allegations, Jeevitha Rajasekhar clarifies about money, which spent for Office use.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X