twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఇద్దరి మధ్య రాజీ.. ‘మా’ అవకతవకలపై ఇంకా అసంతృప్తే.. మాలో గతం గత:!

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా)లో జరిగిన అవకతవకలపై సంస్థ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ పరస్పర ఆరోపణలు చేసుకోవడం వివాదానికి కేంద్రంగా మారింది. దాంతో మా సంస్థ పరువు రోడ్డున పడింది. మీడియాలో విభిన్న కథనాలు రావడంతో సినీ పెద్దలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. పరస్పర ఆరోపణలు చేసుకొన్న శివాజీరాజా బృందం, నరేష్‌ను కూర్చోబెట్టి నచ్చ జెప్పారు. అంతేకాకుండా భవిష్యత్‌లో ఇలాంటి వివాదాలకు చోటుండే సమస్యలపై మాట్లాడటానికి కలెక్టివ్ కమిటీ వేశారు. శివాజీరాజా, నరేష్ వివాదంపై వివరణ ఇవ్వడానికి శనివారం (మా) ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు సురేష్ బాబు, కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, శివాజీ రాజా, నరేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని చెప్పడంతో గందరగోళంగా మారింది.

    తెరపైకి కలెక్టివ్ కమిటీ

    తెరపైకి కలెక్టివ్ కమిటీ

    తెలుగు సినీ పరిశ్రమ అంటే మా, ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్, ఫిల్మ్ కౌన్సిల్ ఇతర భాగాలతో కలిపి ఏర్పడింది. పరిశ్రమలో మా వివాదం నేపథ్యంలో అన్ని సంస్థలన్నింటిని కలిపి కలెక్టివ్ కమిటీ ఏర్పాటు చేశాం అని సురేష్ అన్నారు. ఆ కలెక్టివ్ కమిటీ మీడియా ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.

    మాలో అవకతవకలు లేవని

    మాలో అవకతవకలు లేవని

    మా నిధుల అవకతవకల విషయం బయటకు రావడం చాలా దురదృష్టకరం. భవిష్యత్‌లో కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తాం. మాలో నిధుల అవకతవకలు జరుగలేదు. థర్డ్ పార్టీ తీరు వల్ల గందరగోళం నెలకొన్నది అని సురేష్ బాబు వెల్లడించారు. వాటికి పరిష్కారాలు వెతికేందుకు కలెక్టివ్ కమిటీ ప్రయత్నిస్తుంది అని అన్నారు.

    మీడియా, ఇండస్ట్రీ ఫ్యామిలీ మాదిరిగా

    మీడియా, ఇండస్ట్రీ ఫ్యామిలీ మాదిరిగా

    40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. మీడియా, సినీ పరిశ్రమ ఓ ఫ్యామిలీలా కలిసి ఉంది. చాలా విషయాలు జరిగాయి. మీరు, మేము చర్చించుకొన్నాం. లోపల జరిగేటివి జరుగుతుంటాయి. అల్లరి చేసుకోమంటావా? కొన్ని విషయాలను వదిలేద్దాం. ఈ విషయాన్ని ఇంతటితో ముగిద్దాం. ఈ వివాదానికి ముగింపు పెడుదాం అని తమ్మారెడ్డి భరద్వజా ఆవేశంగా ప్రసంగించారు. మీడియా సమావేశంలో రిపోర్టర్లు, సినీ పెద్దల మధ్య వాగ్వాదం చేజారి పోతుందనే విషయాన్ని గ్రహించిన నిర్మాత సురేష్ రంగంలోకి దిగారు.

    మాలో విభేదాలు గతం.. గత:

    మాలో విభేదాలు గతం.. గత:

    ప్రజలతో మమేకమైన సినీ పరిశ్రమ పనిచేసేటప్పడు కొన్ని సమస్యలు వస్తుంటాయి. తప్పులనేటివి మానవ సహజం. వాటిని పరిష్కరించుకోవడానికి కలెక్టివ్ కమిటి ఏర్పడింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా చెప్పేదేమిటంటే.. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు గతం గత:. టాలీవుడ్ సిల్వర్ జూబ్లీ వేడుకను మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫొటోలు పెట్టుకొని నిర్వహిస్తాం. మహేష్‌బాబు, ప్రభాస్ కార్యక్రమాలను నిర్వహిస్తాం అని నరేష్ తెలిపారు.

     సిల్వర్ జూబ్లీ వేడుకలను

    సిల్వర్ జూబ్లీ వేడుకలను

    అనంతరం వివాదంపై శివాజీ సమాధానం ఇస్తూ.. మా సంస్థ అకౌంట్ పుస్తకాలను మా పెద్దలు పరిశీలించారు. వాటిలో అవకతవకలు లేవని తేల్చారు. దాంతో ఈ వివాదానికి తెరపడింది. భవిష్యత్‌లో మహేష్ బాబు, ప్రభాస్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తాం. పేదలకు, సినీ పరిశ్రమకు మేలు చేయడమే మా సంస్థ ఉద్దేశం అని శివాజీరాజా తెలిపారు. మీడియా సమావేశం అనంతరం మా అధ్యక్షుడు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకొని ఫొటోలకు ఫోజిచ్చారు.

    ఇంతటితో ముగిద్దామా?

    ఇంతటితో ముగిద్దామా?

    అయితే మా, సినీ ఇతర పరిశ్రమలో ఈ వివాదంపై భారీగానే ఆరోపణలు వినిపించాయి. అయితే ఎవరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడకుండా అంతర్గతం హెచ్చరించినట్టు సమాచారం. కొద్ది రోజులాగితే మీడియాలో వేడి తగ్గుతుంది. అప్పుడు వివరణ ఇచ్చి వివాదానికి తెరవేద్దామని సూచించారట. అంతేకాకుండా సినీ ప్రముఖులు దీనిని ఇంతటితో ముగిద్దామని సీరియస్‌గా చెప్పినట్టు తెలిసింది.

    మాలో ఆరోపణల మాటేమిటి?

    మాలో ఆరోపణల మాటేమిటి?

    కానీ శివాజీ రాజా చేసిన ఆరోపణలేమిటని నరేష్ ప్రశ్నించారట. అలాగే నరేష్ సాక్ష్యాలతో చూపిన ఆరోపణలకు ఎలాంటి సమాధానమివ్వడం అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ క్రమంలో నరేష్, శివాజీరాజా మధ్య రాజీ కుదిర్చినట్టు సమాచారం. కానీ వారి మధ్య విభేదాలు బయటకు కనిపించకుండా అలానే ఉన్నాయనే మాట వినిపిస్తున్నది.

    English summary
    The Movie Artists Association is facing a lot of unnecessary rumors in the recent times. The association is facing allegations regarding the funds utilized for organizing the events in the USA. Regarding this issue, MAA members said that there is no truth in the news. Naresh alllegations made this issue very serious note. Tammareddy Bhardwaja serious over media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X