For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిరు, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ అందరినీ టచ్ చేశాం, రాజశేఖర్ ఓటమి భరించలేరు: జీవిత

|
Naresh Panel Press Meet After Winning Maa Elections 2019 | Filmibeat Telugu

'మా' ఎన్నికల్లో విజయం అనంతరం జీవిత రాజశేఖర్ ప్రెస్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేష్ వచ్చి జనరల్ సెక్రటరీకి పోటీ చేయాలని కోరగానే రాజశేఖర్ గారే నువ్వు నిలబడు అని నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత ఆయన్ను కూడా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలని కోరారు. నేను నా పిల్లలు ఆయన వద్దు అని చెప్పాం. ఎందుకంటే ఆయన ఓటమిని తట్టుకోలేరు. క్యారమ్స్ ఆడుతూ ఓడిపోయినా ఆయన భరించలేరు. అంత సెన్సిటివ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎందుకు వద్దని చెప్పాను. కానీ నరేష్ తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి నిలబెట్టారు. భారీ విజయం దక్కడం సంతోషంగా ఉందని జీవిత అన్నారు.

మా పిల్లలు కూడా

మా పిల్లలు కూడా

మాకు ప్రచారానికి పది రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రత్యర్థి టీమ్ బలమైన టీమ్. చాలా కష్టపడ్డాం. చివరకు మా పిల్లలు కూడా రంగంలోకి దిగారు. అందరికీ ఫోన్లు చేసి కాంపెయిన్ నిర్వహించారు అని జీవిత గుర్తు చేసుకున్నారు.

ఇకపై అలా జరుగదు

ఇకపై అలా జరుగదు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నిక అనేది ఇప్పటి వరకు కేవలం పది మంది మధ్యలో జరిగిపోతోంది. అలా జరుగడం కాదు, ప్రతి మెంబర్ రావాలి, అందరూ ఓటింగులో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో నేను వచ్చాను. అది జరుగడం లేదు, ఇది జరుగడం లేదు అనడం కాదు. ఓటు వేసి ఒక స్ట్రాంగ్ ప్యానెల్ గెలిపించుకుంటేనే అన్నీ సక్రమంగా జరుగుతాయని ప్రచారం చేశాం. ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మాపై నమ్మకం ఉంచి, మమ్మల్ని గెలిపించిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం.

కౌశల్ X తనీష్: నానిపై బాబు గోగినేని ఫైర్.. బిగ్‌బాస్‌లో కొత్త వివాదం

పెద్ద పెద్ద స్టార్లు అందరినీ టచ్ చేశాం

పెద్ద పెద్ద స్టార్లు అందరినీ టచ్ చేశాం

చాలా మంది మీడియా వారు, నా ఫ్రెండ్స్ ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' అంటే చిన్న స్టార్లే ఉంటారా? పెద్ద హీరోలు కనపడరు ఏంటి? అన్నారు. ఈ సారి చిరంజీవిగారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, మోహన్ బాబుగారు, మహేష్ బాబు అందరినీ కలిశాం. జూ ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరినీ టచ్ చేశాం. ప్రతి ఒక్కరూ ‘మా' కోసం పని చేస్తామని ప్రామిస్ చేశారు. మంచి ప్లానింగ్ చేయండి మీ వెనక మేము ఉండి నడిపిస్తాం అని చిరంజీవిగారితో పాటు అందరూ ప్రామిస్ చేశారు.

‘మా'ను ఆదర్శంగా తయారు చేస్తాం

‘మా'లో టాప్ నుంచి బాటమ్ వరకు అందరికీ సమానమైన ప్రధాన్యత ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అందరం కలుస్తాం. సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎంత బావుంది, వారి నుంచి మేము నేర్చుకోవాలి అని పక్క ఇండస్ట్రీ వారు అనే విధంగా తయారు చేస్తామని జీవిత తెలిపారు.

English summary
MAA elections 2019 results released. Naresh elected as MAA President. Jeevitha as General Secretary. The reason is that the Naresh team is supported by popular actors like Chiranjeevi, Nagarjuna and Mahesh Babu.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more